Land Acquisition Act:భూ బాట సమస్యలతో బాధపడుతున్నారా? చట్టరీత్యా పరిష్కారం ఇప్పుడు మీ కోసం

Telugu Mirror: భూముల విషయం లో చాల మందికి అవగాహన ఎక్కువగా ఉండదు. ఈ రోజుల్లో భూముల విషయం లో అపరిమితంగా గొడవలు జరుగుతూ ఉంటాయి.అయితే చట్టపరంగా భూముల మధ్య జరిగే గొడవలకి చట్టరీత్య ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం.

భూ బాట సమస్యకి చట్ట రీత్యా చేయవలసిన పద్ధతులు ?

పాత కాలం లో పెద్ద పెద్ద కమతాలు ఉండేవి.ఆ కమతాలకు పెద్ద దారులు కూడా ఉండేవి.అయితే వారసత్వం కారణంగానో లేక అమ్మకాలు ఎక్కువ అవ్వడం వల్లనో ఇప్పుడు కమతాలు అనేవి చిన్నగా మారి దారి సమస్యను తెచ్చి పెడుతుంది.అయితే అలాంటి సందర్బాలలో చట్టరీత్యా ఎలా వెళ్ళాలి అంటే దానికి మూడు దశల ఫార్ములా అనేది ఉంటుంది. దాన్ని ప్రయత్నించి చూడాలి.ముందుగా మీ గ్రామ పటాన్ని తీసుకొని మీ భూమి ఎక్కడ ఉందో గుర్తించండి.

ఆ తర్వాత మీ భూమి దగ్గర ఒక చుక్కతో లైన్స్ ఉన్నాయా లేక రెండు చుక్కలతో లైన్స్ ఉన్నాయా అని గమనించండి. ఒక చుక్కతో లైన్ ఉంది అంటే కాలి నడకతో వెళ్లే దారి ఉంది అని రెండు చుక్కల తో లైన్ ఉంటే వాహనం మీద వెళ్లే దారి ఉంది అని అర్ధం. అలా చుక్కలు ఉంటే మాత్రం మీ దారి సమస్యను తహసీల్దార్ దగ్గరకు వెళ్లి నా భూమికి దారి బాట ఉంది ఇప్పుడు నా బాటను అభ్యర్దిస్తున్నారని పిర్యాదు చేస్తే మీ సమస్య తొందరగా పరిష్కారమవడానికి ఆస్కారం ఉంది.

Also Read:Madras High Court: భర్త ఆస్తిలో భార్యకు హక్కు ఉంటుందా? అద్భుతమైన తీర్పు ఇచ్చిన మద్రాస్ హై కోర్ట్..

ఈ రెండు బాటలు ప్రభుత్వ భూమిగా పరిగణలోకి వస్తాయి కాబట్టి భూఆక్రమణ చట్టం(Land Acquisition Act) కింద ఆ తహసీల్దార్(tehsildhar) చర్య తీసుకొని మళ్లి ఆ దారి ఏర్పాటు చేసే అధికారాన్నిఆయన కలిగి ఉంటాడు.రెండోది ఏంటంటే , ఒకవేళ ఆ దారి బాట కు చుక్కలు లేకపోతే 12 సంవత్సరాలుగా మీరు ఆ బాటను ఉపయోగిస్తున్నట్లైతే ఆ భూమి కి మీరు సొంతదారులు కాకపోయినా కూడా ఈ సిమెంట్ హక్కు అనేది వస్తుంది .

re survey of agricultural land to find way
image credit:The Hans India

భూమిని కొనిగోలు చేసే సమయంలోనే దారి ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉంది అని సేల్ యీల్డ్ లో రాసుకోవాలి. ఒకవేళ రాసుకోకుండా భూమిని కొంటే మాత్రం పాత యజమానులకు దారి ఎలా ఉండేది అనే విషయాన్ని పరిశీలించి ఆ విధంగా కూడా పోరాడడానికి అవకాశం ఉంటుంది.ఇవేమి లేని పక్షంలో ఆ దారిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది లేకపోతే ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది.ఈ సమస్యకు పూర్తి పరిష్కారం ఏంటంటే, ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ రీసర్వే(re survey)చేస్తే ఆ దారి ఏర్పాటు సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉండొచ్చు.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in