chedodu Scheme–జగనన్న అందించే చెడోడు పథకం ..ఆన్‌లైన్ తనికీకై ఇలా చేయండి

Telugu Mirror : చిన్న తరహా వ్యాపారస్తులకు శుభ వార్త చెప్పిన జగన్ అన్న . చేతి వృత్తుల వారి కోసం చేదోడు వాదోడుగా ఉండాలన్న ఉద్దేశం తో జగన్ అన్న చేదోడు స్కీం తీసుకువచ్చారు . అర్హత కలిగిన వారి అకౌంట్ లోకి నేరుగా ప్రతి ఏటా రూ . 10 వేలు జమ అవుతున్నాయి. ప్రోత్సాహకరంగా ఉన్న ఈ పథకం టైలర్లకు , రజకులకు మరియు నాయి బ్రాహ్మణులకు మాత్రమే .

గత సంవత్సరం వరకు ఎవరైతే లబ్ది పొందారో ఆ వివరాలు అన్ని మల్లి రెవెరిఫికేషన్(Reverification) కు వచ్చాయి . దీనికి సంబంచిన సచివాలయ ఉద్యోగులకి బెనిఫిషరీ ఔట్రీచ్ 14.5 SOP మొబైల్ అప్ అనేది ఇవ్వడం జరిగింది. వారు మీ దగ్గరుకు వచ్చి వెరిఫికేరియన్ ని చెక్ చేసుకుంటారు .ఈ వెరిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి డాకుమెంట్స్ ఇవ్వాలి అనేది ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కానీ దానికి సమందించి ఒక SOP రావడం జరిగింది . అయితే ఈ SOP అనేది సచివాలయ సిబ్బంది ఓపెన్ చేసిన తర్వాత వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలు ఏంటి ? వాటికీ ఏ ఏ ఆప్షన్లు పెట్టాలి అనే దాని గురించి తెలుసుకుందాం .

Modi new powerful car: మోడీ కొత్త కారు రూ.12 కోట్లు .. దిమ్మతిరిగి పోయే ఫీచర్స్ ఏంటో మీకు తెలుసా?

బెనిఫిషరీ ఔట్రీచ్(Benificiary outreach) 14.5 SOP మొబైల్ అప్ ముందుగా ఓపెన్ చేసుకున్నాక సచివాలయ ఉద్యోగుల అనగా వెల్ఫేర్ సెక్రటరీ తమ ఆధార్ నెంబర్ తో లాగిన్ అవుతారు . లాగిన్ ఐన వెంటనే చేదోడు అనే ఆప్షన్ కనిపిస్తుంది అది క్లిక్ చేస్తే వెరిఫికేషన్ ఆగష్టు – 23 అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే వెరిఫికేషన్ లిస్ట్ అనేది వస్తుంది . అయితే అక్కడ సచివాలయ కోడ్ ని ఎంటర్ చేస్తే ఆ సచివాలయ పరిధి లో గతం లో ఈ చేదోడు పథకం లో ఎవరైతే లబ్ది పొందారో వారి పేర్లు అన్ని వస్తాయి. ఆ పేర్లు ఉన్న వారందరికీ వెరిఫికేషన్ అనేది చేయాలి. ఈ వెరిఫికేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఆ వృత్తి వారు ఇంకా ఆ వృత్తి ని కొనసాగిస్తున్నారా ? లేదా అనేది చెక్ చేస్తారు .

Image credit: Ap GSWS

అయితే ఆ సచివాలయ ఉద్యోగి, లబ్ది పొందుతున్న వారి షాప్ దగ్గరికి వచ్చి ఓపెన్ చేస్తే ఆ షాప్ వారి వివిరాలు అన్ని వస్తాయి అనగా బెనిఫిషరీ ID , వారి ఆధార్ నెంబర్ , పుట్టిన తేదీ , ఫోన్ నెంబర్ వస్తుంది. అయితే ఫోన్ నెంబర్ మార్చాలి అనుకుంటే మార్చుకోవచ్చు. తర్వాత సెలెక్ట్ అప్లికేన్ట్ స్టేటస్ (Select Applicant Status) అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఆప్షన్ దగ్గర మీరు ఇంకా ఆ చిన్న వ్యాపారం మీదనే మీ జీవనం కొనసాగిస్తే లైవ్ అని పెట్టండి . లేదు మీరు ఆ వ్యాపారాన్ని వద్దు అనుకున్నట్లు అయితే Not Recommended అని పెట్టండి అలా పెట్టినందుకు కూడా ఎందుకు మీ జీవనం కొనసాగించడం లేదు అని కొన్ని కారణాలు కూడా అడుగుతుంది ఆ కారణం ఏంటో సెలెక్ట్ చేయండి .

ఒకవేళ ఆ వ్యాపారానికి సంబంచిన వ్యక్తి చనిపోతే డెత్ అని పెట్టండి. దాని తర్వాత సెలెక్ట్ ప్రొఫెషన్ అనే ఆప్షన్ ఉంటుంది అయితే మీరు ఏ వర్గానికి చెందిన వారో తెలుపండి. దాని కింద ఎస్టాబ్లిషమెంట్ లొకేషన్ ఎక్కడ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది . అంటే మీరు కమర్షియల్ షాప్ లో చేస్తున్నారా ? లేక ఇంట్లో చేస్తున్నారా ? లేదా మొబైల్ షాప్ లో చేస్తున్నారా అంటే రోడ్ పక్కన బండి లాంటివి పెట్టుకొని మీ వృత్తిని కొనసాగిస్తున్నారా అని అర్ధం . అందులో మీ వృత్తికి సంబంచిన దానిని పెట్టండి . ఎక్కువగా షాప్స్ ఉన్న వారికే అని అన్నారు కాబట్టి కమర్షియల్ షాప్స్ అనే ఆప్షన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి .

Rainy Season Remedies: వర్షాకాలం లో హోమ్ రెమిడీస్ ఇస్తాయి మీకు బిగ్ రిలీఫ్.

రజకులు ఎవరైనా ఉంటె మొబైల్ షాప్స్ అనే ఆప్షన్ కి సెలెక్ట్ చేసుకోడం మంచిది.ఇది అయిపోయాక ఆ సచివాలయ సిబ్బంది తో పాటు ఆ లబ్ది దారులు ఒక సెల్ఫీ ఫోటో ని అప్లోడ్ చేసి ఆ లబ్ది దారుని బయో మెట్రిక్ ను వేయించుకుంటారు . ఇంతటితో వెరిఫికేషన్ పూర్తి అవుతుంది. ఇది ఫీల్డ్ వెరిఫికేషన్ మాత్రమే ఇక్కడ షాప్ కి సంబందించిన ఎటువంటి డాక్యుమెంట్స్ అడగరు . ఒకవేళ సపోర్టివ్ డాకుమెంట్స్ కావాలి అంటే ఇవ్వండి కానీ అధికారికంగా అయితే అడగలేదు.

Leave A Reply

Your email address will not be published.