Success Story: భార్య మాట విన్న భర్త.. ప్రతి రోజూ రూ.5 కోట్ల సంపాదన.. షాకింగ్ స్టోరీ..

Telugu Mirror : ప్రతి ఒక్కరి జీవితంలో విజయం(Success) అనేది జీవిత చరమాంకం వరకు చేపట్టిన ప్రతి పనిలో చాలా అవసరం. ప్రతి మనిషి తన జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటారు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో పోరాటం చేసి విజయం సాధిస్తారు. ఏ వ్యక్తి విజయం సాధించినా గాని ఆ వ్యక్తి విజయం సాధించడం వెనుక ఖచ్చితంగా అనేక మంది ఉంటారు. వారిలో ముఖ్యంగా జీవిత భాగస్వామి(life Partner) కావొచ్చు, తల్లి, చెల్లి ఇలా ఎవరో ఒకరు ఉంటారు. అలానే వ్యక్తి జీవితంలో విజయం లేదా ఓటమి వెనుక ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. అలా విజయవంతమైన ఒక వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా ఉన్న మహిళ పాత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము.

China Proposal : చిన్నారులకు ఇక స్మార్ట్ ఫోన్ వాడకం దూరం..’మైనర్ మోడ్’ ప్రపోసల్ తో చైనా…

ఆ వ్యక్తి మరెవరో కాదు ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీ గా చలామణి లో ఉన్న గూగుల్(Google) యొక్క మాతృ సంస్థ ఆల్ఫా బెట్ సిఈఓ సుందర్ పిచాయ్(Sundar Pichai) గురించి.ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ సంస్థలలో ఎంతో ప్రతిష్టాత్మకమైన సంస్థగా అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీల సిఈఓ పేర్లలో గూగుల్ సిఈఓ నిస్సందేహంగా సుందర్ పిచాయ్ ఒకరు. 2022 వ సంవత్సరంలో సుందర్ పిచాయ్ తన వేతనంగా 22.6 కోట్ల అమెరికన్ డాలర్లను వేతనంగా అందుకున్నారు. వార్షిక జీతం 22.6 కోట్ల US డాలర్స్ అంటే రోజుకు సుమారు రూ.5 కోట్లను వేతనంగా పొందారు. సుందర్ పిచాయ్ కు రూ.1,788 కోట్లను స్టాక్ ఆప్షన్స్ రూపంలో వచ్చాయి.

Image Credit : Engineerine

తమిళనాడు లోని మదురై లో జూన్ 10, 1972 లో సుందర్ పిచాయ్ జన్మించారు. పుట్టింది మధురై(Madhurai)లో అయినా సుందర్ పిచాయ్ పెరిగింది మాత్రం చెన్నయ్. ఐఐటీ ఖరగ్ పూర్ లో బీటెక్(B.Tech) పూర్తి చేసిన పిచాయ్ బీటెక్ అనంతరం పై చదువుల కోసం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి(Stanford University) వెళ్లారు. పిచాయ్ అమెరికాలోని వార్టన్ స్కూల్ నుంచి తన MBA పూర్తి చేశారు. అనంతరం 2004లో గూగుల్‌లో చేరారు. అయితే సుందర్ పిచాయ్ అనతి కాలంలోనే గూగుల్ సిఈఓ గా ఎదగడం ఒక ఎత్తయితే, పిచాయ్ విజయం వెనుక ఆయన సతీమణి అంజలి పిచాయ్ యొక్క ముఖ్యమైన పాత్ర ఉన్నదని చాలా మందికి తెలియని విషయం.

ToDay Panchangam August 18, 2023 : నిజ శ్రావణం లో నేడు శుభ ముహూర్త ఘడియలు ఎప్పుడంటే..

అంజలి చెప్పిన సలహాను వినడం వలనే సుందర్ పిచాయ్ 2019లో గూగుల్ సీఈవోగా నియమితులై ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.రాజస్థాన్‌(Rajasthan)లోని కోట లో అంజలి జన్మించారు. అంజలి తండ్రి కోట లోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లో ఉద్యోగం చేసేవారు.1993లో ఐఐటి ఖరగ్ పూర్ లో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. సుందర్ పిచాయ్ తో అంజలి పరిచయం IIT ఖరగ్ పూర్ లో ఇంజనీరింగ్ చదివే రోజులలో జరిగింది. సుందర్ పిచాయ్ అంజలిని ఇష్టపడి కాలేజీలోనే నిశ్చితార్థం చేసుకున్నారు. అంజలి 1999 నుంచి 2002 వరకు యాక్సెంచర్‌లో ఉద్యోగినిగా పనిచేసింది.

వార్తా కథనాల ప్రకారం సుందర్ పిచాయ్ గూగుల్‌(Google)ను విడిచిపెట్టి మైక్రో సాప్ట్(Micro Soft) లో చేరాలని భావిస్తున్న తరుణంలో భార్య అంజలి అతడి ప్రయత్నాన్ని వారించి, అతడిని గూగుల్‌ సంస్థ లోనే కొనసాగమని సలహా ఇచ్చింది. భార్య మాటను విని పిచాయ్ గూగుల్ లోనే కొనసాగాడు. భార్య మాటను వినడం నిజంగా సుందర్ పిచాయ్ జీవితాన్ని ఊహించని విజయానికి  తీసుకెళ్లింది.

Leave A Reply

Your email address will not be published.