Husqvarna Svartpilen 401, Powerful Performance Bike: హూస్క్ వార్న నుంచి కొత్త స్వర్త్ పైలాన్ 401, ఆ బైక్ వివరాలు మీ కోసం.

Husqvarna Svartpilen 401

Husqvarna Svartpilen 401

Husqvarna Svartpilen 401 అనేది ఒక ప్రత్యేకమైన మోటార్‌సైకిల్, ఇది KTM డ్యూక్ 390 యొక్క పెర్ఫార్మన్స్ మరియు డైనమిక్స్‌తో కేఫ్ రేసర్ మరియు స్క్రాంబ్లర్ స్టైల్ కలిపి డిజైన్ చేయబడింది. ఇది వాస్తవానికి 2020లో ప్రారంభించబడింది, అయితే అప్పుడు ఇది కస్టమర్స్ ని పెద్దగా అట్ట్రాక్ట్ చేయలేకపోయింది. అయినప్పటికీ, డ్యూక్ 390 నుండి తీసుకోబడిన కొత్త ఇంజన్‌తో సహా కొత్త అప్‌డేట్‌లతో, Svartpilen 401 మెరుగైన రైడింగ్ ఎక్స్పీరియన్స్ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Design:
డిజైన్‌ విషయానికి వస్తేయ్, Svartpilen 401 పెద్ద హెడ్‌ల్యాంప్‌ తో వస్తుంది, దాని చుట్టూ LED DRL ఉంది, ఇది మంచి లుక్ ని ఇస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ WP అపెక్స్ ఫోర్క్‌లతో డిజైన్ చేయడం వాళ్ళ ఫ్రంట్ మంచి లుక్ వచ్చింది, ప్రత్యేకించి దాని స్పోక్ వీల్స్ మరియు రఫ్ టైర్‌లతో, ఇది దాని ఆఫ్-రోడ్
పెర్ఫార్మన్స్ ని చూపిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 177 మిమీకి పెంచబడింది, ఇది హెవీ ఆఫ్-రోడ్ రైడింగ్ కి బాగా యూజ్ అవుతుంది.

Rear:
వెనుక వైపు చుస్కుంటేయ్, ఏక్సట్రా సేఫ్టీ ఒక బాష్ ప్లేట్ ఉంది మరియు సీటు వెడల్పుగా మరియు పొడవుగా ఉండేలా రీడిజైన్ చేయబడింది, ఇది పిలియన్ రైడర్‌కు మరింత కంఫర్ట్ అందిస్తుంది. మెరుగైన పెర్ఫార్మన్స్ కోసం టెయిల్ మరియు ఫ్లాప్ డిజైన్ అప్‌డేట్ చేయబడింది.

Performance:
పెర్ఫార్మన్స్ పరంగా, Svartpilen 401 డ్యూక్ 390 లాగే అదే 399cc ఇంజన్‌తో 46 PS శక్తిని మరియు 39 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. మిడ్-రేంజ్ పెర్ఫార్మన్స్ చాల బాగుంది, ఇది సిటీ మరియు హైవే చొందితిఒన్స్ లో మంచి డ్రైవింగ్ ఫీల్ ని ఇస్తుంది. ఈ మోటార్‌సైకిల్ కేవలం 6.2 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు.

Handling:
హ్యాండ్లింగ్ అనేది Svartpilen 401 యొక్క మరొక బలమైన పాయింట్, దాని లైట్ వెయిట్ మరియు దాని పెర్ఫార్మన్స్ వాళ్ళ ఈ మోటార్‌సైకిల్‌ను కార్నర్స్ లో డ్రైవ్ చేయడం ఈజీ గ ఉంది. మరియు టైర్లు హై-స్పీడ్ రైడింగ్ కోసం తగినంత గ్రిప్ అందిస్తాయి. డ్యూయల్-ఛానల్ ABSతో పాటు ముందువైపు 320mm డిస్క్ మరియు వెనుకవైపు 240mm డిస్క్‌తో మంచి బ్రేకింగ్ మరియు కంట్రోల్ ని ఇస్తుంది.

https://twitter.com/hqv_moto_india/status/1762852588381475068?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1762852588381475068%7Ctwgr%5E4500b2970a32936dda5ec9c40ed056e24c5f7370%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2Fhqv_moto_india%2Fstatus%2F1762852588381475068

Comfort:
కంఫర్ట్ పరంగా, డ్యూక్ 390తో పోలిస్తే Svartpilen 401 మరింత రిలాక్స్డ్ రైడింగ్ పొజిషన్‌ను అందిస్తుంది, ఇది లాంగ్ రైడ్‌లకు అనుకూలంగా ఉంటుంది. సీటు సౌకర్యవంతంగా ఉంటుంది మరియు సస్పెన్షన్‌ను కంప్రెషన్ మరియు రీబౌండ్ కోసం అడ్జస్ట్ చేయవచ్చు, ఇది కస్టమైజ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది.

మొత్తంమీద, Husqvarna Svartpilen 401 అనేది మార్కెట్లో ప్రత్యేకమైన స్టైల్, పెర్ఫార్మన్స్ మరియు ఆఫ్-రోడ్ క్యాపబిలిటీ, అలాగే సిటీ డ్రైవింగ్ మరియు ఆఫ్-రోడ్ అడ్వెంచర్‌లు రెండింటినీ కవర్ చేయగల మోటార్‌సైకిల్ కోసం చూస్తున్న రైడర్‌లకు ఇది అనువైనది.

Husqvarna Svartpilen 401 Specifications:

Specifications Details
Engine 399cc single-cylinder, liquid-cooled
Power 46 PS
Torque 39 Nm
Transmission 6-speed
0-100 km/h 6.2 seconds
Ground Clearance 177mm
Front Suspension WP Apex forks
Rear Suspension Monoshock, offset
Brakes (Front) 320mm disc with ABS
Brakes (Rear) 240mm disc with ABS
Tires (Front) Spoked wheels with knobby tires
Tires (Rear) Spoked wheels with knobby tires
Seat Height
Weight 3kg heavier than Duke 390
Fuel Capacity
Price (Ex-Showroom) ₹2.92 lakhs
Colors

Husqvarna Svartpilen 401

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in