Hyderabad To Goa: హైదరాబాద్ టూ గోవా విమాన ప్రయాణం, మరి ఇంత తక్కువ బడ్జెట్ లోనా?
అతి తక్కువ ధరకే హైదరాబాద్ టూ గోవా విమాన ప్రయాణం. వివరాల్లోకి వెళ్తే.
Hyderabad To Goa: గోవా వెకేషన్ (Goa Vacation) కోసం ప్లాన్ చేసుకుంటున్నారా? IRCTC టూరిజం ప్రస్తుతం హైదరాబాద్ నుండి గోవా వరకు ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. గోవా అందాలను చూడడానికి విమానంలో ప్రయాణించాలని అనుకుంటున్నారా? అయితే, అతి తక్కువ ధరకే ఒక అద్భుత ప్యాకేజ్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ ట్రావెల్ ప్యాకేజీ ధర రూ.20,000 కంటే తక్కువ కావడం విశేషం అనే చెప్పుకోవాలి. ఈ ట్రిప్ ప్యాకేజీ ఆగస్టు 23 మరియు సెప్టెంబర్ 13 ఈ రెండింటిలో అందించబడుతుంది. ఇప్పుడు, హైదరాబాద్ నుండి గోవా ప్రయాణానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
ప్రయాణం ఎలా ప్రారంభం అవుతుంది?
IRCTC గోవా టూర్ ప్యాకేజీ మొదటి రోజు హైదరాబాద్ (Hyderabad) లో ప్రారంభమవుతుంది. హైదరాబాద్ నుంచి ఉదయం 11.20 గంటలకు విమానం ఎక్కితే దాదాపు 12.30 గంటలకు గోవా (Goa) చేరుకుంటారు. హోటల్ (Hotel) లో స్థిరపడిన తర్వాత, మీరు జువారీ నదిని చూడవచ్చు. తర్వాత, గోవాలో రాత్రి బస చేస్తారు.
రెండో రోజు దక్షిణ గోవా టూర్ ఉంటుంది. సందర్శకులు ఓల్డ్ గోవా చర్చి (Old Goa Tour) , బామ్ జీసస్ బాసిలికా, పురావస్తు మ్యూజియం, పోర్ట్రెయిట్ గ్యాలరీ, వాక్స్ వాల్ మ్యూజియం, శ్రీ మంగేషి టెంపుల్ మరియు మిరామార్ బీచ్‌లను చూడవచ్చు. మండోవి నదిలో పడవ విహారాన్ని ఆనందించవచ్చు.
మూడో రోజు ఉత్తర గోవాలో పర్యటిస్తారు. ఫోర్ట్ అగ్వాడా, కాండోలిమ్ బీచ్ మరియు బాగా బీచ్ (Baga Beach) వీక్షించవచ్చు. వాటర్ గేమ్స్ (Water Games) లో పాల్గొనవచ్చు. ఆ తర్వాత, అంజునా బీచ్ (anjuna beach) , వాగేటర్ బీచ్ (vagator) మరియు చపోరా ఫోర్ట్‌లను సందర్శించవచ్చు. నాల్గవ రోజు, రిటర్న్ ప్రయాణం ప్రారంభమవుతుంది. గోవా నుండి మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 3.55 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.
IRCTC గోవా టూర్ ప్యాకేజీకి ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.18,935, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.19,245 మరియు సింగిల్ అకామడేషన్‌కి రూ.24,620 ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో ఎయిర్‌లైన్ టిక్కెట్‌లు, ఎయిర్ కండిషన్డ్ హోటల్ వసతి, అల్పాహారం, రాత్రి భోజనం, సందర్శనా స్థలాలు మరియు ప్రయాణ బీమా ఉన్నాయి.
Comments are closed.