ICNG AND CNG DIFFERENCE : ఇంటర్‌కూల్డ్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (ICNG) మరియు రెగ్యులర్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG ). ఇంటర్‌కూల్డ్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (ICNG) అనేది వాహనాలకు శక్తినిచ్చే కొత్త మార్గం, ఈ గ్యాస్ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. పర్యావరణానికి హాని కలిగించే నార్మల్ ఇంధనాలతో, ICNG వంటి క్లీనర్ గ్యాసెస్ వాడటం చాలా కీలకం. ఈ ఇంధన వ్యవస్థ తక్కువ హానికరమైన గ్యాసెస్ ని ఉత్పత్తి చేస్తూ తక్కువ వాయువును ఉపయోగించేందుకు తయారు చేయబడింది, ఇది చాల ఏకో-ఫ్రెండ్లీ అని విశ్లేషకులు చెప్తున్నారు.
CNG (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) మరియు ICNG (ఇంటర్‌కూల్డ్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) రెండూ నేచురల్ గ్యాస్ ను ఫ్యూయల్ గా యూజ్ చేసి ఇంజిన్స్ కి పవర్ ఇవ్వడానికే ఉపయోగిస్తారు, అయితే వాటి కంప్రెషన్ మరియు కూలింగ్ ప్రాసెస్ భిన్నంగా ఉంటాయి.
CNG వర్కింగ్ ప్రాసెస్ :
- CNG, లేదా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, సహజ వాయువును గట్టిగా కంప్రెస్ చేస్తుంది కాబట్టి ఇది తక్కువ స్థలాన్ని తీసుకుంటుంది.
- ఇది హై-ప్రెషర్ ట్యాంక్స్ లో నిల్వ చేసి రవాణా చేయబడుతుంది.
- వెహికల్స్ లో దీన్ని ఉపయోగించాలనుకుంటే, నేచురల్ గ్యాస్ తో పనిచేసేలా ప్రత్యేకంగా రూపొందించిన లేదా రీడిజైన్ చేసిన ఇంజన్ తో కూడిన వాహనాల్లో CNGని సాధారణంగా ఉపయోగిస్తారు.
ICNG వర్కింగ్ ప్రాసెస్:
- ICNG అనేది CNG యొక్క మరొక వెర్షన్ లాంటిది. ఇందులో ఇంజిన్లోకి గ్యాస్ వెల్లే ముందు, గ్యాస్ చల్లబడుతుంది. ఈ కూలింగ్ ప్రాసెస్ వల్ల ICNG రెగ్యులర్ CNG కన్నా కొంచం ఎక్కువ ఎఫిసియెంట్ గా పనిచేస్తుంది.
- వాయువును చల్లబరచడం వలన ఎక్కువ గ్యాస్ ను ట్యాంక్‌లో నింపడం సులభం అవుతుంది. ఇది ఇంధన వ్యవస్థ మెరుగ్గా పని చేయడంలో సహాయపడుతుంది మరియు వెహికల్ ని ఫ్యూయల్ ఎఫిసియెంట్ గా చేస్తుంది.
- ICNG ప్రాసెస్ లో సాధారణంగా గ్యాస్‌ను కాంపాక్ట్ చేయడానికి ఇంటర్కూలర్లు లేదా డిఫరెంట్ కూలింగ్ ప్రాసెస్ ని ఉపయోగిస్తాయి.
- చల్లబడిన మరియు కాంపాక్ట్ అయిన నేచురల్ గ్యాస్ ఇంజిన్‌లో కి పంపడం వల్ల ఆ గ్యాస్ బర్న్ అయి ఇంజన్ కి పవర్ ఇస్తుంది.
పర్యావరణానికి మేలు చేయడం మరియు రవాణా రంగంలో ICNG ముందడుగు వేస్తుంది. తక్కువ కలుషితం చేస్తుంది మరియు అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. కానీ, ICNG పర్యావరణానికి మంచిదే అయినప్పటికీ, చాలా మంది ఇప్పటికీ ప్రతిచోటా దీనిని ఉపయోగించట్లేదు. గ్యాస్ నింపుకోవడానికి మరిన్ని స్థలాలను తయారు చేయడం మరియు సాంకేతికతను మెరుగుపరచడం పెద్ద సవాలుగా మారింది. ICNGని మరింత మెరుగ్గా చేయడానికి మరియు ఇంకా ఏవైనా సమస్యలను పరిష్కరించడానికి టైమ్ పడుతుంది అని విశ్లేషకులు చెప్తున్నారు.