Telugu Mirror : ప్రస్తుత కాలంలో చాలామంది మధుమేహం(Sugar)తో బాధపడుతున్నారు. మధుమేహం అనగా రక్తంలో చక్కెర స్థాయి పెరగడం .దీన్ని సైలెంట్ కిల్లర్(Silent Killer) గా పేర్కొంటారు. ఎందుకంటే ఇది శరీరాన్ని లోపల నుండి తినేస్తూ ఉంటుంది. అందుకే షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయకపోతే వీరికి కిడ్నీలు ,కాలేయము, గుండె జబ్బులు వంటి వ్యాధులు వీటితో పాటు కళ్ళకు ,నరాలకు సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
Quick MakeUp: క్విక్ మేకప్ కి లేడీస్ బ్యాగులో ఉండవలసిన ప్రొడక్ట్స్
డయాబెటిస్(Diabetes) ఉన్న వారు ఎప్పుడూ కూడా దానిని నిర్లక్ష్యం చేయకూడదు. అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి.అలాగే డయాబెటిస్ లేని వాళ్ళు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి .మధుమేహం ఎవరికైనా వచ్చే ప్రమాదం ఉంది .పిల్లల్లో కూడా టైప్-2 మధుమేహం వచ్చే అవకాశం ఉందని, ఇవి ఇప్పుడు త్వరగా పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు .ఆయుర్వేదం యొక్క సలహా ఏమిటంటే, ఈ నాలుగు ఆహారపు అలవాట్లు రోజువారి ఆహారంలో చేర్చుకున్నట్లైతే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చని అంటున్నారు. అవి ఏమిటో చూద్దాం.
తిప్పతీగ:
ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాల కోసం అనేక సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న ఔషధాలలో తిప్పతీగ ఒకటి. ఇది ఇమ్యూనిటీ పవర్ ని పెంచడంతోపాటు,మధుమేహాన్ని నియంత్రించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది . టైప్- 2 డయాబెటిస్(Type-2 Diabetes) ఉన్నవారికి ఈ ఆకులు చాలా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు కనుగొన్నారు.
నేరేడు పండు మరియు గింజలు:
నేరేడు విత్తనాల పొడి మరియు పండు రెండు కూడా డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయి(Sugar Levels)లను తగ్గించడంలో దోహదపడతాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిని ఇంప్రూవ్ చేయడంలో సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు. వీటిలో ఆంతోసైనిస్,ఎలాజిక్ ఆసిడ్ మరియు పాలిఫెనాల్స్ వంటి బయో యాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి.
ఉసిరి:
ఆయుర్వేద మూలికలలో ఉసిరి(Amla) ఒక శక్తివంతమైనది. దీనిలో విటమిన్ -సి పుష్కలంగా ఉంటుంది .రోగ నిరోధక వ్యవస్థకు చాలా ఉపయోగపడుతుంది. రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఉసిరి లో యాంటీ ఆక్సిడెంట్లు అనగా సూక్ష్మ పోషకాలు(Micro Nutrients) కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ప్యాంక్రియాస్ పనితీరును మెరుగుపరచడంలో మరియు ఇన్సులిన్ వృద్ధి చేయడంలో ఉపయోగపడుతుంది.డయాబెటిస్ లో కనిపించే వాపు మరియు ఆక్సికరణ(Oxidation) ఒత్తిడిని తగ్గించడంలో ఉసిరి చాలా ప్రయోజన కారిగా ఉంటుందని అధ్యయనాలలో పేర్కొన్నారు.
Ladie Lion:సింహం తో లేడీ సింగం డిన్నర్ వైరల్ అవుతున్న వీడియో
కాకరకాయ:
షుగర్ వ్యాధితో బాధపడే వారికి కాకరకాయ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది చేదుగా ఉంటుంది కాబట్టి. దీనిలో చక్కెర(Sugar)ను నియంత్రించే గుణాలు ఉన్నాయని, ఆయుర్వేదంలో చాలాకాలం నుండి వాడుతున్నారు.అలాగే పొట్లకాయలో కూడా షుగర్ ని నియంత్రించే లక్షణాలు ఉన్నాయి. పాలి పెపైడ్ – పి(Poly Peptide – P) అనే ఇన్సులిన్ ఉందని , ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది అని వైద్యశాస్త్ర పరిశోధనలో వెల్లడయ్యింది. పొట్లకాయ రసం లేదా దాని విత్తనాల పొడి తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి గ్రస్తులకు చాలా సహాయపడుతుంది.మధుమేహం ఉన్న వారు వీటిని వాడటం వలన షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ సమాచారం వివిధ మాధ్యమాల ద్వారా సమీకరించి వ్రాయబడినది.పాఠకులకు జ్ఞానం మరియు అవగాహన పెంచడానికి సంబంధిత కథనం తయారు చేయబడింది .పై కథనంలో పేర్కొన్న సమాచారం
వినియోగం కోసం మీ వైద్యుడిని సంప్రదించండి.