భారతీయ సంప్రదాయంలో తులసి (basil) కి ఎంతో ప్రాముఖ్యత మరియు విశిష్టత ఉంది. తులసి చాలా పవిత్రమైనది.తులసి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది. తులసికి సాలిగ్రామం (Saligram) తో వివాహం జరిగింది.
సాలిగ్రామం అనగా మహావిష్ణువు రూపం. కనక విష్ణుమూర్తి ని ప్రసన్నం చేసుకోవాలంటే తులసిని నైవేద్యంగా సమర్పించాలి.
తులసిలో ఎన్నో ఆయుర్వేద ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే.అంతేకాదు తులసి ని అమ్మగా కూడా పరిగణిస్తారు.
ప్రతి రోజూ తులసిని పూజిస్తే ఆ ఇంట్లో దుఃఖం (sadness) మరియు దరిద్రం కూడా శాశ్వతంగా దూరం అవుతాయి.
అయితే నిత్యం తులసి దగ్గర కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అలాగే పూజ చేసే సమయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి.అవేమిటో తెలసుకుందాం .
ఎన్ని రకాల ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించినా తులసీ దళం లేనిదే ఆ నైవేద్యం అసంపూర్ణంగా ఉంటుంది. ఒక చిన్న తులసి దళం నైవేద్యాన్ని సంపూర్ణం చేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
Also Read : Vaastu Tips : వాస్తు శాస్త్ర ప్రకారం మీ ‘పడక గది’ని ఇలా ఉంచండి. తరచూ గొడవలు లేని దాంపత్య జీవితాన్ని పొందండి.
నీటిలో తులసి ఆకులను వేస్తే ఆ నీరు తీర్థం అవుతుంది. ప్రతిరోజు ఉదయం పూట రెండు తులసి ఆకులను తినడం వల్ల ఎన్నో రకాల వ్యాధుల (Diseases) ను దూరం చేసుకోవచ్చు.
తులసి మొక్క ఎక్కడ ఉంటే అక్కడ గాలిని శుద్ధి (purification) చేస్తుంది. స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. కనుక తులసి చెట్టు ఉన్న ప్రదేశాన్ని దేవతల నివాసం అని నమ్ముతారు.
కాబట్టి తులసి మొక్క ఉన్న ప్రాంతాన్ని పవిత్రం గా మరియు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. తులసి మొక్కను ఎంత పవిత్రంగా భావిస్తామో ఆ మొక్క యొక్క కొమ్మలు, ఆకులు, వేర్లు, మట్టి ని కూడా అంతే పవిత్రంగా భావించాలి.
ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు తులసి దగ్గర ఉన్న మట్టిని నుదుట బొట్టుగా కూడా పెట్టుకుంటే శుభప్రదంగా భావిస్తారు.
తులసి మొక్క దగ్గర పెరిగిన కలుపు మొక్కలు (Weeds) లేదా గడ్డి మొక్కలను పెకిలించి పడేయడం కన్నా వాటిని పేపర్లో ఉంచి, భద్రపరిచి దాచుకుంటే సంపద (wealth) పెరుగుతుందని అని నమ్మకం.
ఎందుకంటే ఆ గడ్డి మొక్కలు తులసి సన్నిధిలో పెరిగాయి.కాబట్టి అవి లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది ఉంటాయి.
ప్రతిరోజు సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగిస్తారు. దీపం పెట్టే ముందు, దీపం క్రింద కొద్దిగా బియ్యం (rice) పోయాలి. అప్పుడు ఆ బియ్యం పై దీపం పెట్టాలి.
ఈ విధంగా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా పొందవచ్చు అని నమ్మకం. ఆ తర్వాత ఆ ధాన్యాన్ని చిన్న జీవులకు ఆహారంగా పెట్టడం శుభప్రదం. తులసి అంటే కృష్ణుడికి చాలా ప్రీతికరమైనది.
అందువల్ల రోజువారీ దైవారాధన లో తులసీ దళం తో కూడిన నైవేద్యమును శ్రీకృష్ణ భగవానుడి ప్రసాదంగా భావిస్తారు.
Also Read : Vaastu Tips : ఇంటి గోడలకు ఈ రంగులు వేస్తే సానుకూల శక్తులు లక్ష్మీ దేవిని ఆహ్వానిస్తాయి
అంతే కాదు తులసి సంజీవని (Sanjeevani). కాబట్టి తులసి పవిత్రతను కాపాడుతూ ఉండాలి. తులసి మాలను ధరించేవారు మాంసాహారం (non-vegetarian) మరియు మద్యం తీసుకోకూడదు.
కాబట్టి తులసి దగ్గర ఇటువంటి జాగ్రత్తలు పాటించినట్లయితే తులసమ్మ అనుగ్రహం (grace) తో పాటు లక్ష్మీదేవి మరియు మహావిష్ణువు అనుగ్రహం కూడా పొందవచ్చు. తద్వారా బాధలు, దుఃఖాలు తొలగిపోతాయి.అందరూ సంతోషంగా జీవించవచ్చు.