IND vs AUS T20 Series: ఆసిస్‌పై భారత్ ఘనవిజయం T20 సిరీస్ కైవసం, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా అక్షర్ పటేల్.
20 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్ సిరీస్‌ను కైవసం చేసింది. భారత్ ఇచ్చిన 174 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో ఆస్ట్రేలియా విఫలమైంది.
Telugu Mirror : రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శుక్రవారం, డిసెంబర్ 1న ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గవ T20Iలో భారత జట్టు పటిష్టంగా పుంజుకుంది. నిన్న జరిగిన మ్యాచ్ లో భారత్ 20 పరుగుల తేడాతో గెలిచి, ఇప్పుడు 5 మ్యాచ్ ల సిరీస్ లో 3-1 ఆధిక్యంలో ఉన్నారు. ఆస్ట్రేలియా ను డిఫెండ్ చేయడానికి 175 చాలా ఎక్కువ స్కోరు కాదు అయినప్పటికీ, భారత బౌలర్లు చాలా అద్భుతంగా ప్రతిభను కనబరిచారు. అక్షర్ పటేల్ ట్రావిస్ హెడ్‌తో సహా మూడు వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికాతో జరిగే T20Iలకు అక్షర్ జట్టులో లేకుంటే జట్టుకు కాస్త ఇబ్బంది అనే చెప్పాలి. ఆస్ట్రేలియా గొప్ప ఆరంభానికి ట్రావిస్ హెడ్ చాల ఉపయోగపడ్డాడు.
రవి బిష్ణోయ్ (Ravi Bishnoi) జోష్ ఫిలిప్ (Josh Philippe)ను అవుట్ చేసినప్పటికీ ఆస్ట్రేలియా 40/0 నుంచి 52/3కి చేరుకుంది. ఆసీస్‌కు గెలుపుకు దగ్గర అవుతున్న సమయంలో అక్సర్ మళ్లీ చెలరేగాడు. బెన్ మెక్‌డెర్మాట్ (MCCDERMOTT) మరియు టిమ్ డేవిడ్ (TIM DAVID) కలిసి 35 పార్టనర్ షిప్ ను నెలకొల్పారు. ఆ తర్వాత, డేవిడ్ మరియు మాట్ షార్ట్ ఒక మంచి గేమ్ ఆడారు, తర్వాతి రెండు ఓవర్లలోనే వీరిద్దరినీ ఔట్ చేసి దీపక్ చాహర్ గేమ్‌ను ముగించాడు. అంతకుముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగుల స్కోరు సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభం అందించారు.
Also Read : BSNL : అతి తక్కువ ధరకే BSNL 4జీ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ పూర్తి వివరాలివే.
యశస్వి జైస్వాల్ దూకుడుతో పవర్ ప్లేలోనే టీమిండియా 50 పరుగుల మార్కు చేరుకుంది. అయితే పవర్ ప్లే ఆఖరి బాల్‌కు యశస్వి జైస్వాల్ (37) క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో 50 పరుగుల భాగస్వామ్యానికి అక్కడితో తెరపడింది. కష్టాల్లో పడిన జట్టు రింకూ సింగ్, జితేశ్ శర్మ ఆదుకున్నారు. ముఖ్యంగా జితేశ్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. 19 బంతుల్లోనే 35 రన్స్ చేశాడు. మరోవైపు రింకూ మరోసారి కీలకమైన పరుగులు చేశాడు. ప్రశాంతంగా ఆడుతూనే బౌండరీలు బాదాడు. రింకూ, జితేశ్ కలిసి ఐదో వికెట్‌కు 56 రన్స్ జోడించారు. స్పిన్‌కు వ్యతిరేకంగా బౌలర్లు పేలవ ప్రదర్శన చేయడమే ఓటమికి ప్రధాన కారణమని ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ అన్నాడు. 3/16తో చెలరేగిన అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. సిరీస్‌లోని చివరి మ్యాచ్ డిసెంబర్ 3న బెంగళూరులో జరగనుంది.
Comments are closed.