ఢిల్లీ లోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణీకుల కోసం మరో సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో ప్రయాణీకుల సౌకర్యం మేరకై సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ సిస్టమ్ ప్రారంభించబడింది. విమాన ప్రయాణం లో గతంలో లగేజ్ డిపాజిట్ చేయడానికి ఎయిర్ పోర్ట్ లో లైన్ లో నిలబడాల్సి వచ్చేది.కానీ ఇప్పుడు సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ విధానాన్ని ప్రవేశ పెట్టిన తరువాత ప్రయాణీకులు తమ లగేజీని విమానాశ్రయంలో డిపాజిట్ చ చేయడానికి లైన్ లో నిలబడే అవసరం లేదు.
దీనివలన విమానాశ్రయానికి వచ్చే ప్రయాణీకులకు వెయిటింగ్ చేసే సమయం తగ్గుతుంది.ఈ సదుపాయం వలన,ప్రయాణీకులు వేచి వుండే సమయం కూడా సుమారు 15 నుండి 20 నిమిషాలపాటు తగ్గుతుంది.సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ సదుపాయం తరువాత, ప్రయాణీకులకు ఎయిర్ పోర్ట్ లో చెక్ ఇన్ చేయడం సులభతరంగా మారుతుంది.ఏ టెర్మినల్ వద్ద సదుపాయం ప్రారంభమైంది.
Aadhar Pan Linking: ఆధార్ తో పాన్ కార్డ్ లింక్ చేశారా. ఈ ఒక్క రోజే అవకాశం
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీ లో ప్రయాణీకుల సౌకర్యం కోసం సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ విధానాన్ని టెర్మినల్ నంబర్ త్రీలో ప్రారంభించబడింది.ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(IGI ఎయిర్ పోర్ట్ ) నిర్వాహక కార్యవర్గం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్(DIAL), సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ విధానాన్ని సులభతరం చేయడంకోసం 12 ఆటోమేటిక్ మెషీన్ లతో సహా 14 SBD మెషీన్ లను అమర్చింది.అయితే ఈ సౌకర్యం ప్రస్తుతందేశీయ ప్రయాణీకులకు మాత్రమే లభించనుంది.
దీనికి అవసరమైన అన్ని అనుమతులు లభించిన తరువాత,ఈ సౌలభ్యాన్ని ఇంటర్నేషనల్ పాసింజర్ ల కోసం కూడా ప్రారంభించబడుతుంది.ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ని నిర్వహించే ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (DIAL) సంస్థ ఈ సదుపాయం గురించి ఒక ప్రకటన విడుదల చేసింది,సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ సదుపాయాన్ని ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోలో ప్రయాణించే ప్రయాణీకులకు మాత్రమే అందించనుంది.క్రమేణా విస్టారా,ఎయిర్ ఇండియా,ఎయిర్ ఫ్రాన్స్ అలాగే బ్రిటిష్ ఎయిర్ వేస్ ప్రయాణీకులకు కూడా ఈ సదుపాయాన్ని కల్పించబడుతుంది.
ఈ సదుపాయాన్ని ఎలా వినియోగించాలి:
ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ద్వారా ప్రయాణించే ప్రయాణీకులు సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ సదుపాయాన్ని రెండు అంచెలలో వినియోగించుకోగలరు. ఈ సౌకర్యం కోసం,ప్రయాణీకులు మొదటిగా చెక్ – ఇన్ కియోస్క్ బోర్డింగ్ పాస్ ను అలాగే బ్యాగేజ్ ట్యాగ్ తీసుకోవాలి.అనంతరం తనిఖీ చేసిన తమ లగేజ్ ని ప్రయాణీకులు మాన్యువల్ గా ట్యాగ్ చేయాలి. ఆ తర్వాత ప్రయాణీకులు వారి యొక్క బోర్డింగ్ పాస్ ని మెషిన్ వద్ద స్కాన్ చేయవలసి ఉంటుంది.
Telugu mirror: తెలుగు మిర్రర్ నేటి పంచాంగం
ఆ తరువాత ప్రయాణీకులు తాము ఎలాంటి నిషేధిత మరియు ప్రమాదకరమైన వస్తువులను తమ లగేజిలో తీసుకువెళ్ళడం లేదని తెలియపరచిన తరువాత తమ లగేజీని కన్వేయర్ బెల్ట్ పైన ఉంచాలి.ఈ ప్రక్రియ అంతా ముగిసిన అనంతరం మీ లగేజి ఆటోమేటిక్ గా విమానానికి చేరుకుంటుంది.అదే సమయంలో దీనికి అమర్చిన మెషీన్ లగేజ్ యొక్క బరువును తూచడం తోపాటు స్కాన్ చేస్తుంది.