ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఇన్ఫినిక్స్ మొబైల్(Infinix Mobile) మార్కెట్లోకి కొత్త 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది ఇన్ఫినిక్స్ హాట్ 30(Infinix hot A 30) పేరుతో ఈ మొబైల్ ను విడుదల చేసింది అతి తక్కువ ధరలు లభించే ఈ స్మార్ట్ ఫోన్ ఫైవ్ జి తో పాటు భారీ బ్యాటరీ మరియు ఇతర అద్భుతమైన ఫీచర్లతో లభిస్తుంది ఈ నూతన స్మార్ట్ ఫోన్ ధర కేవలం రూ 12 వేలకు లభిస్తుంది
బడ్జెట్ ఫోన్ లకు ప్రసిద్ధి చెందిన ఇన్ఫినిక్స్ మొబైల్ కంపెనీ ప్రస్తుతం విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ హాట్ 30 జూలై 18 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ లో హార్ట్ థర్టీ సేల్ షురూ అవుతుందని ఫ్లిప్కార్ట్ వర్గాలు వెల్లడించాయి
Also Read:Mobile Sales : వాట్ ఎ టమోటా ఐడియా..
హాట్ 30 స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది ఫోర్ జి బి రామ్ 128 జీబీ స్టోరేజ్ కలిగిన హ్యాండ్ సెట్ ధర రూ 12,499 అలాగే 8gb ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన వేరియంట్ ధర రూ 13వేల 499 గా కంపెనీ నిర్ణయించింది ఈ ఫోన్ పై ఆఫర్లను గమనిస్తే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఫోను కొనుగోలు చేస్తే రూ 1000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది అలాగే నెలకు రూ .2,250 చొప్పున నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా కలదు.
Infinix Hot 30 స్పెసిఫికేషన్లు :
•6.7 ఇంచెస్ ఫుల్ HD డిస్ ప్లే
•120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది.
•మీడియా టెక్ డైమెన్సిటీ 6020 SoC
ప్రాసెసర్ కలిగి ఉంటుంది.
•50+2 మెగా పిక్సెల్ డ్యూయల్ కెమెరా
•8 MP సెల్ఫీ కెమెరా
•ఆండ్రాయిడ్ 13తో రన్ అవుతుంది.
•6000 mAh బ్యాటరీని కలిగి ఉండి 18W
ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతు కలిగి ఉంటుంది.