Diabetes: శరీరం లో ఇన్సులిన్ కొరత వలన డయాబెటిస్ కాకుండా వచ్చే ఇతర వ్యాధులు తీసుకోవలసిన జాగ్రత్తలు.

Telugu Mirror: డయాబెటిస్ వ్యాధితో బాధపడే వారికి ఇన్సులిన్(insullin)కొరత సమస్య ఏర్పడుతుంది. అయితే అసలు సమస్య ఏమిటంటే ఇన్సులిన్ అనే హార్మోను రక్తంలో చక్కెర స్థాయి మొత్తాన్ని అదుపు చేయడంలో ఉపయోగపడుతుంది. ఈ హార్మోను(har కు శరీరంలోని కణాలు స్పందించనప్పుడు ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. దీని వలన చక్కెర కణాలలోకి సులువుగా ప్రవేశించలేదు .దీని కారణంగా గ్లూకోజ్(Glucose) పరిమాణం పెరగడం ప్రారంభం అవుతుంది. దీనివలన టైప్- 2 డయాబెటిస్(Type-2 Diabetes)వచ్చే అవకాశంఎక్కువగా ఉంది.

ఇన్సులిన్ తక్కువ అవడంవల్ల రక్తంలో చక్కెర పెరిగి మధుమేహం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి వివిధ రకాల జబ్బులు రావడానికి ఇదే కారణం.

శరీరంలో ఇన్సులిన్ కు ఆటంకం కలిగినప్పుడు అది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. దీనిని హైపర్ గ్లైసిమియా అంటారు. డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా సర్వసాధారణం కానీ ఇది కంట్రోల్ చేయకపోతే దీని కారణంగా శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

రోగనిరోధక శక్తి యొక్క అతిపెద్ద ప్రమాదం మెటబోలిక్ సిండ్రోమ్ రూపంలో కనిపిస్తుంది‌. దీనివల్ల జీర్ణ క్రియ కు అర్థం కాని పరిస్థితి వస్తుంది. నడుము చుట్టూ ఎక్కువగా కొవ్వు చేరడం మరియు బరువు పెరిగే సమస్యలతో పాటు ఇది గుండె జబ్బుల ప్రమాదాలను కూడా పెంచుతాయి. జీర్ణక్రియ మందగించినవ్యక్తులలో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.

Cure for Diabetes
Image source:TV Health

ఇటువంటి వ్యాధిగ్రస్తులు హృదయ సంబంధ వ్యాధులు, మెటబాలిక్ డిజార్డర్స్ ,నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీస్, మరియు పి సి ఓ ఎస్ జబ్బులను వృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

మహిళల్లో ఇన్సులిన్ నిరోధకత ఉంటే వారికి అనేక రకాల ఇబ్బందులు గురిచేస్తాయని అనుకుంటారు. అలాంటి మహిళలు పిసిఒ ఎస్ మరియు మొటిమలు వంధత్వానికి గురి అయ్యే అవకాశం కూడా ఉండవచ్చు .సంతాన ఉత్పత్తి సమస్యలను కలిగిస్తుంది. మరియు గర్భధారణ సమయంలో అనేక ఇబ్బందులు వస్తాయి .

ఇన్సులిన్ నిరోధకత సమస్యను నయం చేయలేము. మందుల ద్వారా కూడా కంట్రోల్ చేయలేమని డయాబెటిస్ ఉన్నవారికి ఇన్సులిన్ ఇంజక్షన్లతో సమస్యలు తప్పవని డాక్టర్లు అంటున్నారు.

అయితే జీవన విధానంలో కొన్ని మార్పులు చేయడం వలన దీన్ని కచ్చితంగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించవచ్చు.

– 45 నిమిషాలు రోజు కనీసం వ్యాయామం చేయాలి .

– ఒత్తిడి లేకుండా నిద్రపోవాలి.

– బరువును కంట్రోల్ లో ఉంచుకోవాలి .

– పౌష్టికాహారం తీసుకోవాలి.

– జీవన విధానాన్ని సరైన పద్ధతిలో ఉంచడం ద్వారా ఇన్సులిన్ నియంత్రించవచ్చు.

Leave A Reply

Your email address will not be published.