Automatic Headlight On : AHO వల్ల ప్రయోజనాలు..బ్యాటరీకి ఏమైనా ప్రమాదముందా? ఇప్పుడే తెలుసుకోండి ఇలా..
Telugu mirror : టెక్నాలజీ(Technology) పెరుగుతున్న కొద్దీ కొత్త విషయాలను , ఎన్నో అద్భుతాలను అనుభూతి చెందుతూ ఉన్నాం.ఫోన్లు, బైకులు సరికొత్త వర్షన్స్ లు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఫోన్లు, బైక్ ల వాడకం విపరీతంగా పెరుగుతుంది. సొంత వాహనం లేకుండా కూడా ఎవ్వరు ఉండట్లేదు.అయితే ఇంతక ముందు వినియోదారుడు బైక్ స్టార్ట్ చేసి లైట్స్(lights) ఆన్ చేస్తేనే వెలిగేవి కానీ కొత్తగా ఇప్పుడు బైక్ స్టార్ట్ చేయగానే స్వయంచాలకంగా లైట్స్ వెలుగుతున్నాయి.ఇక పగటి పూట కూడా లైట్స్ ఆన్ అయే ఉంటాయి.
ఇలా వెహికల్(Vachile స్టార్ట్ చేయగానే లైట్స్ ఆన్ అయ్యేదాన్ని AHO అంటారు అనగా automatic Headlight On అని అంటారు.ఇలా లైట్స్ బైక్ స్టార్ట్ చేయగానే ఆన్ అవ్వడం చాల మంది ఇష్ట పడరు.ఇలా ప్రతిసారి లైట్ ఆన్ అవ్వడం వల్ల బాటరీ ఛార్జింగ్ దిగిపోతుందనే ఉద్దేశం చాల మందిలో ఉంటుంది.
AHO సిస్టం పెట్టడానికి గల కారణం :
ఆటోమేటిక్ హెడ్ లైట్ ఆన్ (Automatic Headlight On)సిస్టం ని పెట్టడానికి ముఖ్య కారణం స్వీడన్(Swedan) దేశం.ఈ హెడ్ లైట్ సిస్టం ఇంతక ముందు లేనప్పుడు స్వీడన్ దేశంలో ఎక్కువ మొత్తం ఆక్సిడెంట్లు జరిగేవి.ఎప్పుడైతే ఈ సిస్టం ని అందుబాటులోకి తీసుకొచ్చారో ఆక్సిడెంట్ ల రేట్ చాల వరకు తగ్గు ముఖం పట్టింది. భారత దేశంలో జనాభా(Population) ఎక్కువ ఉండడం వల్ల రోజు వారి ఆక్సిడెంట్ లు చాల ఎక్కువ గా జరుగుతున్నాయిదాన్నీ ఆధారం చేసుకొని ఈ హెడ్ లైట్ సిస్టం తీసుకొస్తే ఆక్సిడెంట్ లు జరిగే ప్రమాదాలు కొంచం అయిన తగ్గుతుందనే ఉద్దేశం తో ఈ సిస్టం ను పెట్టారు.
శామ్సంగా మజాకా.. దుమ్ము రేపుతున్న Samsung.. రికార్డ్ స్థాయిలో ప్రీ బుకింగ్ లు..
మరి ఈ AHO సిస్టంని పెట్టడం వల్ల బ్యాటరీకి ఏదైనా ప్రమాదం ఉందా అంటే అసలు ఏ ప్రమాదము లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఆధునికత పెరుగుతున్న కొద్దీ ఆడ్వాన్సుడ్ బ్యాటరీల వల్ల ఏ సమయం లో అయినా ఈ లైట్ ఆన్ లోనే ఉంటుంది మరియు ఆ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తో బ్యాలన్స్ లేదా హ్యాండిల్ చేయగలుగుతుంది.
కాబట్టి ఈ లైట్స్ వెలుగుతున్న ప్రతిసారి మీ బాటరీ కి ఇబ్బంది అవుతుందని మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. మరియు ఆక్సిడెంట్లు అయ్యే అవకాశం చాల తక్కువ గా ఉంటుందని గమనించండి.