ISRO Cheif Somanath: గ్రహశకలాలు భూమిని ఢీకొనే ప్రమాదం ఉందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ చెప్పారు . ఇదే జరిగితే మానవులతో సహా భూమిపై ఉన్న మెజారిటీ జీవులు అంతరించి పోతాయని ఆయన హెచ్చరించారు. ప్రపంచ గ్రహశకల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇస్రో వర్క్‌షాప్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఇస్రో చీఫ్ (ISRO CHEIF) పాల్గొన్నారు. అనంతరం మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు.
మన జీవితకాలం 70 నుండి 80 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి, తక్కువ విపత్తులను అనుభవించవచ్చు. కానీ, గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేసాం. అయితే, చరిత్రలో ఈ రకమైన ఘటనలు చాలా జరిగాయి. గ్రహశకలాలు తరచుగా భూమిని ప్రభావితం చేస్తాయి.
బృహస్పతిపై గ్రహశకలం కొట్టడాన్ని చూశానాని. భూమిపై అలాంటిదేదైనా జరిగితే, మనమందరం అంతరించిపోతామని సోమనాథ్ (Soma Nadh) చెప్పారు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. భూ తల్లిని అటువంటి విపత్తు నుండి తప్పించాలి. భూమి వైపు వెళ్లే గ్రహశకలాలను మళ్లించే మెషిన్ ఉంది.
Also Read:Ganga River National River: గంగ నదిని జాతీయ నదిగా ఎందుకు ప్రకటించారు? ఎప్పుడు ప్రకటించారో తెలుసా?
Also Read: tirumala no fly zone: తిరుమల మీదుగా విమానాలు ఎందుకు వెళ్లవు? కారణం ఇదే..!
భూమికి సమీపంలో ఉన్న గ్రహశకలాలను ముందుగా కనుగొనడం వలన విపత్తును నివారించవచ్చు. అయితే, ఇది ఒక్కసారే ఇలా చేయడం సాధ్యం కాదు. కాబట్టి, దీన్ని సులభతరం చేయడానికి టెక్నాలజీ (Technology) ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. భారీ వ్యోమనౌకలను ఉపయోగించి భూమిపై ప్రభావం చూపకుండా గ్రహశకలాలు తప్పక మళ్లించాలి. దీని కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు కలిసి విభిన్న విధానాలను అభివృద్ధి చేయాలి,” అని అన్నారు.
భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పారు. ప్రమాదం సమీపిస్తున్న వేళ మానవజాతి అంతా ఒక్కతాటి పైకి వచ్చి దానిని నివారించేందుకు నడుం బిగిస్తామన్నారు. అంతరిక్ష పరిశోధనల్లో అగ్రగామిగా ఉన్న ఇస్రో ఈ బాధ్యతను చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశానికి మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి సమీపించే విషాదాన్ని నివారించడానికి అవసరమైన సాంకేతిక మరియు ప్రోగ్రామింగ్ నైపుణ్యాల (Programming Skills) ను అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు.