Telugu Mirror : మనిషి మరణించిన తర్వాత కొన్ని రోజులకు మర్చిపోతాం. కానీ తన జ్ఞాపకాలతో, తన మంచితనంతో ఇంకా అభిమానుల గుండెల్లో ఉన్న పునీత్ రాజ్ కుమార్ మరణించినా ఇంకా ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నారు. 2021 అక్టోబర్ 29న హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. తాను మరణించి రెండు సంవత్సరాలు కావొస్తున్నా అభిమానులు ఇంకా తనని మరవలేకపోతున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ ని తలచుకుంటూ అభిమానులు అతనికి నివాళులు అర్పిస్తున్నారు.
Also Read : వీకెండ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా, అయితే కర్ణాటకలోని టాప్ 5 హిల్ స్టేషన్లను మిస్ కాకండి
సినీ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి రెండేళ్లు అవుతుంది. సినీ స్టార్ గా మాత్రమే కాకుండా ప్రజలకు ఎన్నో సేవలు చేసారు. బయట ప్రపంచానికి తెలియకుండా ఆయన చేసిన పనులు అతని మరణాంతరం వెలుగులోకి వచ్చాయి. దీనితో అతని పై అభిమానం మరింత పెరిగింది. ఇప్పుడు ఆయన మరణాన్ని గుర్తుచేసుకొని కర్ణాటక రాష్ట్రం అంతా భాదను వ్యక్తం చేస్తున్నారు. మరియు అతనికి నివాళులు అర్పించి కర్ణాటక రత్న అవార్డుని కర్ణాటక ప్రభుతం ప్రకటించింది. మరియు ఆ అవార్డుని అతని భార్య అశ్వినికి ఇచ్చారు.
ఆయన జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ చాలా ప్రదేశాల్లో అన్నదాన కార్యక్రమాల వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సినీ రంగానికి చెందిన మరియు రాజకీయ ప్రముఖులు తమ భాదను వ్యక్తం చేస్తూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అతను మరణించాక అతను నటించిన రెండు సినిమాలు విడుదలయిన విషయం తెలిసిందే. మరియు ఆ సినిమాలు పెద్ద హిట్ అయ్యాయని అని తెలుసు. సినీ రంగంలో ఆయన చేసిన పనికి గాను మరియు అతని కృషికి ఫలితంగా అతని మరణం తర్వాత డాక్టరేట్ తో మైసూర్ యూనివర్సిటీ సత్కరించింది.
Also Read : ఉమెన్ డెలివరీ భాగస్వాములకు జొమాటో అందిస్తున్న మెటర్నిటీ ఇన్సూరెన్సు ప్లాన్
అప్పు అన్నయ్య శివరాజ్ మాటలు ..
పునీత్ రాజ్ కుమార్ చనిపోయి రెండు సంవత్సరాలు అవుతున్నా ఇంకా అతని జ్ఞాపకాలతో బతుకున్నాం. ప్రతి క్షణం అప్పు మాతోనే ఉంటున్నట్టు అనిపిస్తుంది. అతని జ్ఞాపకాలతో , మంచి పనులతో మరియు నటనతో ఇంకా సజీవంగానే ఉన్నాడు. పునీత్ చిన్నవాడు అతన్ని మర్చిపోవడం చాలా కష్టంగా ఉంది అంటూ అప్పు అన్నయ్య శివరాజ్ బాధను వ్యక్తం చేసారు. ఇక సోషల్ మీడియా అయితే అప్పు లీవ్స్ ఆన్ అని ఫొటోస్ పెట్టి పునీత్ ప్రేమని మరియు అతను ఇక లేడు భాదని గుర్తు చేసుకుంటూ రోదిస్తున్నారు. అతను మరణించి రెండు ఏళ్ళు అయినా ఇంకా ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నారు. ప్రజల హృదయాలను గెలిచిన పునీత్ రాజ్ కుమార్ కి తెలుగుమిర్రర్ నివాళులు అర్పిస్తోంది.