jio cinema 299 Plan: జియో సినిమా (Jio Cinema) తన వార్షిక మెంబర్‌షిప్ ప్లాన్ (Annual Member Ship Plan) ను ప్రకటించింది. జియో తన నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్యాకేజీ (Monthly Subscription Package) ని ఏప్రిల్‌లో లాంచ్ చేసింది. అయితే, ఈ మెంబర్‌షిప్ యూజర్స్ యాప్‌లోని 4K కంటెంట్‌ను ఎలాంటి యాడ్స్ లేకుండా హ్యాపీ గా చూసి ఎంజాయ్ చేయవచ్చు. మిగిలిన OTT సేవల సబ్‌స్క్రిప్షన్‌ల కంటే ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. వినియోగదారులు సంవత్సరానికి కేవలం రూ.299కే OTT కంటెంట్‌ను చూసేందుకు ఒక సేవను అందించింది.
కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం, వార్షిక ప్యాకేజీ ధర రూ.599 ఉంది. అయితే, ప్రారంభ ఆఫర్ కింద, ఇది 50% తగ్గింపుతో రూ. 299 వద్దకే లభిస్తుంది. సబ్స్క్రిప్షన్ పొందిన మొదటి 12 నెలల తర్వాత రూ.299కి రెన్యువల్ అవుతుంది.
ప్రీమియం వార్షిక ప్యాకేజీ యాడ్స్-ఫ్రీ కంటెంట్ స్ట్రీమింగ్ (Ad Free Content Streaming) చేయవచ్చు. ఇది హెచ్బీవో, పారామౌంట్, పీకాక్ మరియు వార్నర్ బ్రదర్స్ వంటి టాప్ ప్రొడక్షన్ హౌస్‌లతో పాటు OTT అవుట్‌లెట్‌ల నుండి కంటెంట్‌ను కలిగి ఉంటుంది. వినియోగదారులు కంటెంట్ ను డౌన్‌లోడ్ చేసుకోని ఆఫ్లైన్ (Offline) లో చూడవచ్చు. ప్రస్తుతం, జియో సినిమా అందించే మూడు ప్రీమియం స్ట్రీమింగ్ సబ్‌స్క్రిప్షన్‌లలో యాడ్-ఫ్రీ కంటెంట్ ఉంటుంది. ఐపీఎల్, ఇతర క్రీడలు మరియు లైవ్ ఈవెంట్‌ల సమయంలో యాడ్స్ వస్తాయి.
ప్రస్తుతం, జియో సినిమా యొక్క రూ.299 ప్లాన్ భారతదేశంలో అందుబాటులో ఉన్న గొప్ప OTT ప్లాన్ అని చెప్పవచ్చు. సాధారణంగా, వార్షిక ప్లాన్ చాలా ఖరీదుగా ఉంటాయి, మీరు రూ.29తో నెలవారీ ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. రూ.299 ప్లాన్‌తో అందించే ఫీచర్లను రూ.29 ప్లాన్‌తో కూడా పొందవచ్చు. కానీ, ఒక నెల మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది.
ఇది కాకుండా, జియో ఇప్పుడు రూ.89 ప్లాన్‌ను అందిస్తుంది. ఇది కూడా నెలవారీ ప్లాన్. అయితే, ఈ ప్యాకేజీ, ఒకే సమయంలో నాలుగు డివైజ్లలో ప్రసారం చేయవచ్చు. ఈ ప్లాన్‌ని ఫ్యామిలీ ప్లాన్ అని అంటారు. ఫ్యామిలీ ప్లాన్‌లో ప్రస్తుతం వార్షిక వెర్షన్ అందుబాటులో లేదు. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోల కంటే జియో సినిమా సబ్స్క్రిప్షన్స్ (Jio cinema) చాలా తక్కువ. నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ కు మాత్రమే నెలకు రూ.149 ఖర్చు అవుతుంది, డిస్నీప్లస్ హాట్‌స్టార్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్‌లు రూ. 299కాగా, వారి వార్షిక ప్లాన్ రూ.1,499 వరకు ఉంటుంది.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…