JIO CLOUD PC : రిలయన్స్‌ జియో మరో శుభవార్త కేవలం రూ. 15 వేలకే ల్యాప్‌టాప్‌

JIO CLOUD PC : Another good news from Reliance Jio is just JIO CLOUD PC : Another good news from Reliance Jio is just Rs. 15 thousand laptopRs. 15 thousand laptop
image credit: TV9 Bangla

Telugu Mirror : రిలయన్స్ జియో ఇప్పుడు తక్కువ ధర ల్యాప్‌టాప్‌ను మార్కెట్ లోకి తీసుకురావాలని భావిస్తుంది. ఇందులో భాగంగా కీలకమైన ల్యాప్‌టాప్ తయారీదారులైన హెచ్‌పీ (HP) , లెనోవో (Lenovo) , ఏసర్‌ (Acer) లతో చర్చలు జరుపుతున్నట్లు కార్పొరేట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. Jio గత సంవత్సరం మార్కెట్లోకి Jio Book మరియు Jio Book 4G అనే రెండు ల్యాప్‌టాప్‌లను పరిచయం చేసింది. ఈ రేట్లు దాదాపుగా రూ. 16,000. జియో ల్యాప్‌టాప్ క్లౌడ్ పిసి (Jio Laptop Cloud PC) ఇప్పుడు కేవలం రూ. 15,000 మాత్రమే కంపెనీ అందజేస్తుంది. అనేక విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన జియో ఇప్పుడు కంప్యూటర్లలో కొత్త శకం ప్రారంభమైంది.

Also Read : PM Kisan Yojana 15th Instalment: PM కిసాన్ యోజన 15వ విడతలో మీ ఖాతాలకు ఇంకా డబ్బు జమ కాలేదా? అయితే ఇప్పుడే పిర్యాదు చేయండి.

Jio ఇప్పటికే Jio Book మరియు Jio Book 4G అనే రెండు కంప్యూటర్లను తీసుకొచ్చింది. వారు ఇప్పుడు మూడవ ల్యాప్‌టాప్‌ను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. టెలికాం పరిశ్రమలో జియో పెను ప్రకంపనలు సృష్టించిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జియో రాకముందు, ఇంటర్నెట్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అకస్మాత్తుగా వేరే నెట్ వర్క్ ప్రొవైడర్స్ ధరలు చాలా వరకు తగ్గించారు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఇంటర్నెట్‌ ఉపయోగిస్తున్నారు. Jio ఫైబర్ (Jio Fiber) పేరుతో, Jio దూరంగా ఉన్న పట్టణాలకు కూడా వేగవంతమైన ఇంటర్నెట్‌ను తీసుకువస్తుంది.

JIO CLOUD PC : Another good news from Reliance Jio is just JIO CLOUD PC : Another good news from Reliance Jio is just Rs. 15 thousand laptopRs. 15 thousand laptop
image credit: Telecom Talk

Also Read : బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొనాలా, అయితే రూ.15 వేలలో బెస్ట్ ఫీచర్లతో వీటిని సొంతం చేసుకోండి

ల్యాప్‌టాప్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేసేలా జియో క్లౌడ్ పీసీ (Jio Cloud PC) ని కూడా తీసుకువస్తున్నారు. ల్యాప్‌టాప్ ధర దాని నిల్వ, ప్రాసెసర్, చిప్‌సెట్, బ్యాటరీ మరియు ఇతర హార్డ్‌వేర్ భాగాలపై ఆధారపడి ఉంటుంది” అని కంపెనీ తెలిపింది. జియో క్లౌడ్ పీసీ పేరుతో ఈ ల్యాప్‌టాప్ ను తీసుకురానుంది. ఈ కొత్త ల్యాప్‌టాప్ ను తీసుకొచ్చేందుకు గాను ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ సంస్థలైన హెచ్‌పీ, లెనోవో, ఏసర్‌లతో చర్చలు జరుపుతోంది. ఈ విషయమై కంపెనీకి చెందిన ఉన్నతాధికారి మాట్లాడుతూ ల్యాప్‌టాప్ ధరను అందులోని స్టోరేజ్, ప్రాసెసర్, చిప్ సెట్ బ్యాటరీతో పాటు హార్డ్ వేర్ ఆధారంగా నిర్ణయిస్తారు.

వీటి ధర పెరిగితే దాని ప్రభావం తప్పక ల్యాప్‌టాప్ ధరపై ఉంటుంది, దీనిని తగ్గించేందుకు జియో క్లౌడ్ పిసిని తీసుకొస్తున్నాం ఇందులో సిస్టం ప్రాసెసింగ్ మొత్తం జియో క్లౌడ్ లో జరుగుతుంది దీనివల్ల తక్కువ ధరకే వినియోగదారులు ల్యాప్‌టాప్ ను పొందవచ్చు. జియో ల్యాప్‌టాప్‌తో పాటు, జియో క్లౌడ్‌లో పిసి యాప్‌లు కూడా ఉన్నాయి. కాబట్టి, ప్రజలు తమ ల్యాప్‌టాప్‌లు లేదా స్మార్ట్ టీవీ (Smart TV) లలో ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించవచ్చు. ఈ మెంబర్‌షిప్ ప్లాన్‌ల గురించి కంపెనీ త్వరలో మరిన్ని వివరాలను తెలియజేస్తుంది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in