Jio High Speed Data Plan: జియో నుండి మరో ప్లాన్, 30రోజుల వ్యాలిడిటీతో హై-స్పీడ్ డేటా..!

Jio High Speed Data Plan: టెలికాం టాప్ ఇండస్ట్రీలో రిలయన్స్ జియో (Reliance Jio)ఒకటి. జియో ప్రతి ఒక్కరికీ సరసమైన ధరలో హై-స్పీడ్ ఇంటర్నెట్‌ (Hi Speed Internet) ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం, ఇది దేశంలోనే అగ్రగామి నెట్‌వర్క్‌గా కొనసాగుతోంది. జియోకు కోట్లాది మంది వినియోగదారులు ఉన్నారు.

వినియోగదారులందరికి అందరినీ ఆకట్టుకునే విధంగా ప్లాన్లను అందుబాటులో ఉంచుతుంది. టెలికాం కంపెనీల్లో పోటీ నెలకొంది. ఎక్కువగా ఎయిర్టెల్ (Airtel), రిలయన్స్ జియో (Reliance JIO) మరియు వొడాఫోన్ (Vodafone) మధ్య పోటీ ఉంది. వినియోగదారులు OTT ప్లాట్‌ఫారమ్ సబ్‌స్క్రిప్షన్‌లను ఎక్కువగా ఎంచుకోవడమ్ వల్ల అన్ని టెలికాం సంస్థలు తాజాగా కొత్త ప్లాన్‌లను ప్రారంభించాయి.

రిలయన్స్ జియో తన వినియోగదారులకు అనేక రీఛార్జ్ ప్లాన్ లను అందిస్తోంది. మీకు డేటా పరిమితులు లేని తక్కువ-ధర ప్యాకేజీ కావాలంటే, Jio మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ ప్లాన్‌తో రోజువారీ డేటా పరిమితి లేదు. అంటే మీరు అన్లిమిటెడ్ ఇంటర్నెట్‌ (Unlimited Internet) ని యాక్సెస్ చేయవచ్చు. ఈ ప్యాకేజీలో కాలింగ్ మరియు SMS వంటి మరిన్ని సేవలు కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ యొక్క వివరాలు ఇప్పుడే తెలుసుకుందాం.

Also Read: Whats App Users New Feature: వాట్సాప్ యూజర్స్ కి మరో ఫీచర్ వచ్చేసింది, ఇక నంబర్ సేవ్ చేసుకోవాల్సిన పని లేదు

ఈ జియో ప్యాకేజీ ధర (Jio Package Price) రూ. 296. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. ఇందులో రోజువారీ పరిమితి లేదు. మీరు ఎటువంటి అంతరాయాలు లేకుండా డేటాను ఉపయోగించవచ్చు.

జియో సబ్‌స్క్రైబర్‌లకు 30 రోజుల వ్యవధిలో 25 GB డేటాను అందిస్తుంది. ఇది ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమితమైన కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. ప్రతిరోజూ, 100 SMSలు చేసుకోవచ్చు. అది కాకుండా, JioTV, JioCinema, JioSecurity మరియు JioCloud అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇది వినియోగదారులకు అపరిమితమైన 5G డేటాను అందిస్తుంది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in