Telugu Mirror: పోటీ టెలికాం మార్కెట్లో ‘జియో’ కొత్తగా మరో రీఛార్జ్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వినియోగదారులు తమ వివిధ ఎంపికల కొరకు ముఖేష్ అంబానీ సంస్థ Jio 365 రోజుల రీచార్జ్ ప్లాన్(365 days recharge plan)ను మొదలు పెట్టింది. ఈ ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్ ను స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా jio సంస్థ ప్రకటించింది.
అయితే ముందుగా ఈ రీఛార్జ్ ప్లాన్ ప్రీపెయిడ్ చందాదారుల కోసం.మీరు సబ్స్క్రయిబ్ చేసుకున్నట్లయితే మీకు డేటా , SMS మరియు వాయిస్ కాలింగ్ ని పొందుతారు. జియో ‘ఇండిపెండెన్స్ డే’ పెద్ద తగ్గింపు కారణం గా ట్రావెలింగ్ విషయం లో, ఆన్లైన్ షాపింగ్ విషయంలో, ఫుడ్ డెలివరీ పై తగ్గింపులను అందిస్తుంది.
ఈ ప్లాన్ వల్ల ప్రయోజనాలు ?
ఈ ప్లాన్ ని ఎంచుకోవడం వల్ల వరుసగా 365 రోజుల పాటు రూ. 2,999తో ప్రతి రోజు 100 SMS లు , అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్(unlimited voice calls),2.5GBని పొందవచ్చు.
సంవత్సరం మొత్తం 912.5 GBని ఉపయోగించవచ్చు అలాగే 5జి డేటా ని కూడా పొందవచ్చు. జియో ఆఫర్ లో మరికొన్ని ఫీచర్లను కూడా చేర్చబడ్డాయి. ఈ ప్యాకేజ్ లో swiggy యాప్ వినియోగం తో రూ. 249 లేదా అంతకన్నా అధికంగా ఆర్డర్ పెడితే దానిపై రూ. 100 వరకు తగ్గింపును,ట్రావెలింగ్ విషయం లో రూ.1500 వరకు తగ్గింపు ఆఫర్ను పొందవచ్చు.
ఈ పోర్టల్ లో అత్యధికంగా రూ. 4,000 వరకు 15% హోటల్ బుకింగ్(hotel booking) పై తగ్గింపును పొందవచ్చు. అజియో ఆన్లైన్ షాపింగ్ యాప్ లో రూ. 999 లేదా అంతకు మించి షాపింగ్ చేస్తే రూ. 200 వరకు తగ్గింపును ఉన్నాయి. వినియోగదారులకు ఆన్‌లైన్ ఫార్మాస్యూటికల్స్‌పై 20% తగ్గింపును, రిలయన్స్ డిజిటల్ నుండి ఆడియో పరికరాలను కనుగోలు చేస్తే 10% వరకు తప్పింపును పొందవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ ను మీరు ఒకసారి ప్లాన్ ను పొందినట్లయితే 365 రోజుల చెల్లింపుతో పాటు డేటా మరియు అన్ లిమిటెడ్ కాల్స్ వీటితో పాటు వివిధమైన సైట్ లలో భారీ తగ్గింపులని కూడా పొందవచ్చు.
దీన్ని రీఛార్జ్ చేయడం ఎలా ?
ఈ రీఛార్జ్ ప్లాన్ ఇప్పటికే ప్రారంభమైంది. వివరాల తెలుసుకోవడం కోసం MyJio యాప్ ఓపెన్ చేసి రీఛార్జ్ ప్రాంతంలో రూ. 2,999 రీఛార్జ్ ప్లాన్‌ను క్లిక్ చేయండి. ఈ రీఛార్జ్ ప్లాన్ ను UPI, నెట్ బ్యాంకింగ్ లేదా బ్యాంక్ కార్డ్ ఉపయోగించి చెల్లింపులు జరుపుకోవచ్చు. ఈ ప్లాన్‌ని Jio యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో రీఫిల్ చేయవచ్చు.ఇంకా Paytm, GooglePay, Amazon లేదా PhonePay ఈ ప్లాన్‌ని రీఛార్జ్ చేసుకోవచ్చా అనే విషయం తెలియాల్సి ఉంది.