Reliance Jio : జియో ప్రీ-పెయిడ్ రూ.119 రీఛార్జ్ నిలిపివేత, దానికి బదులుగా కొత్త ప్లాన్ ప్రారంభం.

Telugu Mirror : ఆధునిక కాలంలో రిలయన్స్ జియో (Reliance Jio) కంపెనీ ఈ మధ్య సరికొత్త రీఛార్జ్ ప్లాన్ లను పరిచయం చేస్తుంది. ఈ రోజుల్లో జియో నుండి రీఛార్జ్ ప్లాన్ల వినియోగం అధికంగా పెరిగింది. కొత్త కొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్ల(Pre – Paid )ను మన ముందుకు తీసుకోచ్చింది. అయితే జియో అతి చౌకైన ప్రీ-పెయిడ్ రూ.119 ప్లాన్ ని పూర్తిగా నిర్మూలించింది. ఈ ప్లాన్ ను సైలెంట్ గా నిలిపివేయడం వల్ల వినియోగదారులు షాక్ కి గురయ్యారు. ఇప్పుడు ప్రాథమిక రీఛార్జ్ ప్లాన్ ని వినియోగించలంటే రూ.149 చెల్లించక తప్పదు.ఈ ప్లాన్ 14 రోజుల పాటు సేవలను అందించి రోజుకి 1.5GB డేటా ని అందిస్తుంది.

2021 చివరి దశలో లో టారిఫ్ పెంచడం వల్ల ఈ రూ.119 రీఛార్జ్ ప్లాన్(Recharge plan) ను వినియోగంలోకి తీసుకొచ్చారు. పరిమితం లేని వాయిస్ కాల్స్, ప్రతి రోజు 1.5GB డేటా ఇంకా 14 రోజుల వరకు చెల్లుబాటు అయ్యే అవకాశాన్ని కల్పించారు.టెల్కోస్(telcos) అధికారికంగా ఉండే వెబ్సైటు నుండి ఈ ప్రీ-పెయిడ్ ప్లాన్ ను పూర్తిగా నిలిపివేసింది. ఇలా నిలిపి వేయడానికి కారణం ఏంటంటే , ప్రతి ఒక్క యూజర్ నుండి సగటు ఆదాయాన్ని పొందాలనే ఉద్దేశం తో ఈ బేసిక్ ప్లాన్ ను ఎత్తివేసారని కొన్ని వర్గాలు వెల్లడించాయి.

Image Credit : jio user

Change in life: జీవిత లక్ష్యాన్ని సాధించేందుకు ‘మార్పు’ యొక్క పాత్ర ఏమిటో మీకు తెలుసా ?

ప్రస్తుతం జియో యొక్క బేస్ ప్లాన్ 149 రూపాయలు. ఈ ప్లాన్ లో ప్రతి రోజు 1GB డేటా ను 20 రోజుల పాటు సేవను అందిస్తుంది.మరియు అన్లిమిటెడ్ ఫోన్ కాల్స్ ని అందిస్తుంది. 20 రోజులకి 20GB డేటా బాలన్స్ ని ఈ ప్లాన్ ద్వారా పొందుతారు.దీనికి అదనంగా ఈ ప్లాన్ ని వినియోగించడం వల్ల JioTV, JioCinema మరియు JioCloud పై ఉచిత సబ్స్క్రిప్షన్ పొందే అవకాశం కూడా ఉంది. ఈ మధ్య కాలంలోనే కొత్తగా టెలికాం సర్వీస్ ప్రొవైడర్ నెట్ ఫ్లిక్స్ ప్లాన్ మరియు అన్ లిమిటెడ్ 5జి డేటా ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నెట్ ఫ్లిక్స్ సుబ్స్క్రిప్షన్ రూ. 1099 కి అందుబాటులో ఉండగా, అపారమైన 5G డేటాని పొందేందుకు రూ. 1499కి అందించనుంది.

ఈ రెండు ప్లాన్లు 84 రోజుల పాటు చెల్లిబాటులో ఉంటుంది మరియు 4జి డేటా పరిమితిలో ప్రతిరోజు 2GB డేటాని పొందవచ్చు ఇంకా అపరిమితమైన 5జి డేటాని కూడా పొందవచ్చు మరియు అన్లిమిటెడ్ కాల్స్ సేవలను ఆనందించవచ్చు.ఈ ప్లాన్ లు నెట్ ఫ్లిక్స్(Net Flix ) సుబ్స్క్రిప్షన్ తో ఉన్నా కూడా రూ.1099 ప్లాన్ సెల్ ఫోన్ లాంటి పరికరం లో మాత్రమే చెల్లుబాటు అవుతుంది. నెట్ ఫ్లిక్స్ లో బేసిక్ సుబ్స్క్రిప్షన్ పొందాలి అంటే ఈ రూ. 1499 ప్లాన్ ని వినియోగించాలి.

రిలయన్స్ జియో ఈ మధ్య కాలం లోనే 2.27 బిలియన్ కొత్త కస్టమర్స్ ను తన వైపుకి తిప్పుకుంది. బేసిక్ ప్లాన్ ని వినియోగించాలంటే ఇప్పుడు ఈ రూ.149 ప్లాన్ ని ఉపయోగించాల్సిందే.

Leave A Reply

Your email address will not be published.