JIO Recharge Plan: జియో అందించే ఈ రీఛార్జ్ ప్లాన్ గురించి తెలుసా? రూ. 895తో 336 రోజుల వ్యాలిడిటీ
రిలయన్స్ జియో సరసమైన ధరకే రీఛార్జ్ ప్లాన్లను అందిస్తుండడం వలన టెలికాం రంగంలో అత్యధిక యూజర్స్ ని కలిగి ఉంది. వివరాల్లోకి వెళ్తే!
JIO Recharge Plan: అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన రిలయన్స్ జియో సరసమైన ధరలకే అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తుంది. అయితే, జియో మరో రీఛార్జ్ ప్యాకేజీని ప్రారంభించింది. జియో దేశవ్యాప్తంగా 46 కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. సరసమైన మరియు ఆకర్షణీయమైన కొత్త రీఛార్జ్ ప్లాన్ లను ప్రారంభించి, ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షిస్తోంది. రిలయన్స్ జియో (Reliance JIO) భారతీయ టెలికాం రంగంలో అత్యధిక వినియోగదారులను కలిగి ఉంది. కంపెనీ ఇప్పటికే ఉన్న వినియోగదారులకు అనేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్రోగ్రామ్ (Prepraid Recharge Programme) లను అందిస్తుంది, వాటిలో కొన్ని కొత్త సబ్‌స్క్రైబర్ (New Subscriber) లను ఆకర్షించే లక్ష్యంతో ఉన్నాయి.
రిలయన్స్ జియో రూ. 895 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ :
రిలయన్స్ జియో సరసమైన ధరకే రీఛార్జ్ ప్లాన్లను అందిస్తుండడం వలన టెలికాం రంగంలో అత్యధిక యూజర్స్ ని కలిగి ఉంది. జియో ప్లాన్ లు సబ్స్క్రైబర్లకు ప్రయోజనాలను అందిస్తాయి. కొత్తగా విడుదల చేసిన రూ. 895 ప్లాన్ 336 రోజుల చెల్లుబాటు వ్యాలిడిటీని కలిగి ఉంది.
జియో రూ. 895 రీఛార్జ్ ప్లాన్ 336 రోజుల వాలిడిటీని కలిగి ఉంది. 28-రోజుల రీఛార్జ్ సైకిల్ (Recharge Cycle) లో 12 సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాకేజీ కింద కస్టమర్లు 24GB డేటాకు పొందుతారు. ఇది 28 రోజుల పాటు 2GB డేటాను అందిస్తుంది. 28 రోజుల పాటు అపరిమిత కాలింగ్ మరియు 50 ఉచిత SMSలను అందుకుంటారు. మొత్తంమీద, మీ బడ్జెట్ ఆధారంగా ఈ ప్లాన్ చాలా ప్రయోజకరంగా ఉంటుంది.
28 రోజుల పాటు ఈ ప్లాన్ ను ఎంచుకోవడం వలన వినియోగదారునికి దాదాపు 28 రోజులకు రూ.75 ఖర్చు అవుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను కోరుకునే వారి కోసం ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ (Best Option) అని చెప్పవచ్చు. అందుకే ఇది జియో యొక్క టాప్ సెల్లింగ్ ప్లాన్ల జాబితాలో యాడ్ అయింది. ఈ ప్యాకేజీ వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్లాన్లు రెండు సిమ్ కార్డ్‌లు ఉన్న వినియోగదారులకు ఉపయోగపడతాయి. ఏడాది పొడవునా సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి ఉపయోగపడుతుంది.
Comments are closed.