Telugu Mirror : భారతీయులందరూ తరచుగా వండే వంటలలో పప్పు ఒకటి.రోజు వారి ఆహారంలో దాల్ చావల్(Dal Chawal) చాలా ప్రసిద్ధి చెందింది. రుచి పరంగా చూస్తే పప్పు మరియు అన్నం చాలా బాగుంటుంది. పప్పు అలాగే అన్నం పోషకాహార జాబితాలో చేర్చబడినది.ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం బియ్యం మరియు పప్పులు, పిల్లలు ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి పిల్లలకు పప్పులతో కూడిన ఆహారం ఇవ్వడం వలన చాలా ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి.
World Hepatitis Day-2023 : “ఒకే జీవితం.. ఒకే కాలేయం”.. అవగాహనతో హెపటైటిస్ ను జయిద్దాం!
అయితే పప్పు మరియు అన్నం పిల్లలకు మాత్రమే కాదు పెద్దలకు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పప్పులో చాలా పోషక విలువలు ఉన్నాయి . ఇది దేహానికి రోగనిరోధక శక్తి(Immunity Power)తో పాటు శక్తిని కూడా అందిస్తుంది.బరువు తగ్గాలి అనుకున్న వారు రైస్ మరియు దాల్ కూడా తినవచ్చు. పిల్లల పెరుగుదల నుండి పెద్దల వరకు అందరికీ పప్పు మరియు అన్నం ఆరోగ్యానికి మంచిది. పప్పు మరియు అన్నం తీసుకోవడం వల్ల దేహానికి చేసే ప్రయోజనాలు గురించి తెలుసుకోండి. అలాగే ఆరోగ్య నిపుణుల సలహా కూడా తీసుకోండి.
పప్పు ఆరోగ్యానికి నిధి లాంటిది. దీనిలో విటమిన్ -బి ,ఫైబర్, మెగ్నీషియం, జింక్ మరియు పొటాషియం సమృద్ధిగా ఉన్నాయి. జీర్ణ వ్యవస్థకు ఉపయోగపడే విటమిన్లు మరియు ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్(Fibre) చాలా ఎక్కువగా ఉన్నాయి. పప్పు తేలికగా జీర్ణమయ్యే ఆహారం. అలాగే పప్పుతో తింటే చాలా సమయం వరకు కడుపు నిండిన భావన కలుగుతుంది .ఆకలి లేనివారికి కాలరీలు(Calories) తక్కువ అవుతాయి అని బాధపడాల్సిన అవసరం లేదు మరియు బరువు కూడా అదుపులో ఉంటుంది.
పప్పులో ఉండే పోషకాలు బియ్యం(Rice)లో కూడా ఉన్నాయి. బియ్యంలో పొటాషియం , కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ ,మెగ్నీషియం ,ఫైబర్, ఐరన్ , క్యాల్షియం ఉన్నాయి. వైట్ రైస్ తినడం వల్ల శరీరానికి శక్తి వస్తుంది. బియ్యంలో శరీరానికి హాని కలిగించే కొవ్వు మరియు సోడియం ఉండవు. బరువు తగ్గాలి అనుకునేవారు బ్రౌన్ రైస్(Brown Rice) కూడా తీసుకోవచ్చు.బరువు తగ్గాలి అనుకున్న వారు తినే ఆహారంపై స్పెషల్ కేర్ తీసుకుంటారు. అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారని చాలామంది భావిస్తారు. కానీ పప్పు మరియు అన్నం సరైన సమయంలో సరైన పద్ధతిలో తినడం వల్ల బరువు తగ్గవచ్చు. పప్పు మరియు అన్నం కాంబినేషన్ ఆరోగ్యపరంగా శరీరానికి చాలా మేలు చేస్తుంది.
Today Rashi Phalam: నేటి రాశి ఫలం, డైలీ జాతకం 29-జూలై-2023
రాత్రిపూట భోజనంలో రైస్ మరియు పప్పు సాధారణ క్వాంటిటీలో 30 రోజులపాటు తీసుకున్నట్లయితే దాని యొక్క ప్రభావాన్ని మీరు గమనిస్తారు అని నిపుణులు అంటున్నారు.పప్పు మరియు అన్నం కలిపి తినేటప్పుడు అన్నం తక్కువ పప్పు ఎక్కువ మోతాదులో ఉండేలా చూసుకోవాలి . పప్పు మరియు అన్నంతో పాటు నెయ్యిని తీసుకోవడం వల్ల సమతుల్య ఆహారం(balanced diet) అవుతుంది. నెయ్యి(Ghee)లో విటమిన్ -ఎ, ఇ ,డి ,కె ఉన్నాయి.ఇవి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.కాబట్టి పప్పు మరి అన్నం తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని నిపుణులు అంటున్నారు.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…