Telugu Mirror : ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ జనవరి 14, 15 మరియు 16వ తేదీల్లో జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగని ఘనంగా జరుపుకుంటారు. అయితే నిన్న మకర సంక్రాంతి పూర్తి అయింది. సంక్రాంతి పండుగ రోజున రంగు రంగుల ముగ్గులతో, పిండి వంటలతో ప్రతి ఇల్లూ కళకళలాడుతూ ఉంది. అయితే ఈ రోజు కనుమ పండుగ. ఈ పండుగ రోజున రైతులు తమ పశువులకు పూజలు చేస్తారు. పండుగ సమయానికి పంట చేతికి రావడం మరియు వ్యవసాయం చేసేటప్పుడు పశువులు తోడుగా ఉంటాయి కాబట్టి ఆ పశువులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కనుమ పండుగ జరుపుకుంటారు.
అయితే ఈ కనుమ పండుగ రోజున మీ మిత్రులకు, మీ బంధువులకు మరియు మీ ప్రియమైన వారికి కనుమ శుభాకాంక్షలు ఇలా తెలపండి.
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కనుమ శుభాకాంక్షలు
కొత్త సంవత్సరంలో మొదటి పండుగ సంక్రాంతి…కనుమ రోజున నూతన ఆరంభానికి శ్రీకారం చుట్టాలనీ కోరుకుంటూ…. హ్యాపీ కనుమ
మీ జీవితం సుఖ సంతోషాలతో నిండి మరెన్నో జ్ఞాపకాలను నింపుకోవాలని కోరుతూ…. హ్యాపీ కనుమ
ఎన్నో దీవెనలు మీకు, మీ కుటుంబానికి కలగాలని కోరుకుంటూ, కొత్త వెలుగులు నిండాలని కోరుతూ…. కనుమ శుభాకాంక్షలు
సంక్రాంతి పండుగ ఎన్నో జ్ఞాపకాలను ఇవ్వాలని కోరుకుంటూ, నా ప్రియ మిత్రులకు కనుమ శుభాకాంక్షలు
ప్రతి ఏటా ఇలాంటి పండుగలు మరెన్నో జరుపుకోవాలని ఆ శ్రీమహావిష్ణువుని మనసారా ప్రార్థిస్తూ… హ్యాపీ కనుమ
రైతులు పడిన కష్టానికి ఫలితం ఈ కనుమ.. కడుపు నింపే కనుమ ప్రతి ఇంట్లో జరుపుకోవాలంటూ… హ్యాపీ కనుమ
మీ ఇల్లు పాడి పంటలతో, పశు పాకతో పచ్చగా ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ కనుమ
రంగు రంగుల ముగ్గుల వలె కోటి జ్ఞాపకాలతో ఈ పండుగ ఉండాలని కోరుతూ… కనుమ శుభాకాంక్షలు
సంక్రాంతి పండుగతో మీ కష్టాలు అన్ని తొలిగి, సిరి సంపదలతో మీ ఇల్లు వర్ధిల్లాలని కోరుతూ.. కనుమ శుభాకాంక్షలు
రంగు రంగుల ముగ్గులా నవ్వుకుంటూ, పందెం కోడిలా సమస్యలపై పోరాడుతూ, చెరుకుగడలా తీయని జీవితాన్ని కొనసాగిస్తూ .. గాలిపటంలా అందనంత ఎత్తుకి ఎదగాలని కోరుకుంటూ .. నా ప్రియమైన స్నేహితులకి మరియు బంధువులకు కనుమ శుభాకాంక్షలు.
రైతు కష్టాన్ని గుర్తించి ఇచ్చే కానుక కనుమ.. రైతు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ.. కనుమ శుభాకాంక్షలు