Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసే బిఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.

Kcr announced first list of brs members for 2034 elections
Image credit: Namasthe Telangana

Telugu Mirror: టీఎస్ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ తొలి జాబితా: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (KCR) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం విడుదల చేశారు. కే చంద్రశేఖర రావు నాయకత్వంలోని అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వరుసగా మూడోసారి కూడా అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు చోట్ల పోటీలో ఉంటున్నట్లు తెలిపారు. తాను గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు.

Kcr Announced BRS candidates list for 2024 elections.
Image credit: Namasthe Telangana

Also Read:PM Vishwakarma Yojana : చేతి వృత్తుల వారికి మొదటి సారి కేంద్రం చేయూత..అర్హులు వీరే

పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ (BRS) అధ్యక్షుడు ముందుగా ఎంపిక చేసిన శుభ ముహూర్తంలో సోమవారం పంచమ తిథి నాడు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో BRS పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల మొదటి జాబితాను పోలింగ్ తేదీ ప్రకటన కంటే ముందుగానే ప్రకటించడం ద్వారా, ప్రచారాన్ని వేగవంతంగా స్టార్ట్ చేయడానికి BRS చీఫ్ అభ్యర్థుల లిస్ట్ ను ముందుగానే విడుదల చేసే పద్ధతిని కొనసాగించారు. గతంలో పోటీచేసిన అభ్యర్థులలో పెద్దగా మార్పులు చేయలేదని, కేవలం 7గురు అభ్యర్థులను మాత్రమే మార్చినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. నాలుగు స్థానాలకు ప్రస్తుతం అభ్యర్థులను ప్రకటించలేదు. నర్సాపూర్ (Narsapur), నాంపల్లి(Nampally), జనగామ(Janagon), గోషా మహల్ (Gosha Mahal) స్థానాలకు పోటీచేసే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించలేదు. మెట్ పల్లి, ఉప్పల్, బోధ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, వేములవాడ లో గతంలోని అభ్యర్థులను మార్చారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితా:

Click Down to download list

BRS Party List

 

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in