Kia EV3 Efficient EV : భారీ అంచనాలు పెంచుతున్న కియా కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ కియా EV3.
Kia EV3 Efficient EV : కియా కంపెనీ నుండి రాబోయే ఎలక్ట్రిక్ వెహికిల్ కియా ఈవీ3 ని నాణ్యత మరియు అందుబాటు ధరలో అందించి ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో అగ్ర స్థానంలో నిలవాలని ఆలోచిస్తుందని కియా సంస్థ అమెరికా సీఓఓ స్టీవ్ సెంటర్ పేర్కొన్నారు.
Kia EV3 Efficient EV : భారీ అంచనాలు పెంచుతున్న కియా కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ కియా ఈవీ3. దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ ఇప్పుడు ప్రపంచంలోని ఇతర కంపెనీల ఎలక్ట్రిక్ వాహన విభాగంపై ఆధిపత్యం చెలాయించేందుకు గట్టి ప్రణాలికతో సిద్దమైంది. Kia ప్లాన్ లో భాగంగా వెంట వెంటనే పలు ఈవీలను తయారు చేస్తుంది. ఇప్పటికే EV9, EV6 జీటీ మోడల్స్‌తో మార్కెట్ ను ఇంప్రెస్ చేసిన కియా మోటార్స్ ఇప్పుడు తాజాగా కియా EV3 ఎలక్ట్రిక్ వెహికిల్‌ని తయారు చేస్తోంది. కియా అమెరికా సీఓఓ స్టీవ్ సెంటర్ రాబోయే EV3 గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
The highly anticipated Kia EV3
కియా అమెరికా సీఓఓ స్టీవ్ సెంటర్ వ్యాఖ్యలను చూస్తే ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఇతర ఆటోమొబైల్ కంపెనీలకన్నా కియా మోటార్స్ ముందంజలో ఉందని ఆయన అభిప్రాయం. అదేవిధంగా టెక్నాలజీలో కూడా మిగతా సంస్థలకన్నా ముందు వరుసలో నిలవాలని ప్రణాళికలను సిద్దం చేసినట్లు పేర్కొన్నారు.
“ఇతర సంస్థల కన్నా మేమే ముందు ఉన్నాము. టెక్నాలజీ పరంగా కూడా కియా చాలా మెరుగ్గా ఉంది. మా సంస్థకు ఒక సీక్రెట్ ఉండాలి. బలమైన ఆర్ అండ్ డీ ఉండాలి. అప్పుడే విజయం దక్కుతుంది. అదే జరిగింది,” అని సెంటర్ అభిప్రాయపడ్డారు.
India EV Segment : కియా మోటార్స్ తన ఈవీ3 మోడల్ని కొన్ని నెలల క్రిందట వెల్లడించింది. ఈ సంవత్సరం ఆఖరిలో ఇది మార్కెట్లో విడుదల అవుతుందని వార్తలు వచ్చాయి. ఈ ఏడాది చివర్లో కియా ఈవీ4 సెడాన్ కూడా లాంఛ్ కి సిద్దమవుతుంది. EV3 లాంఛ్ తరువాత EV4 మార్కెట్ లోకి వస్తుందని సమాచారం. అయితే ఈ రెండు EV లు కూడా అందుబాటు ధరలలో ఉంటాయని అంచనా. మార్కెట్లో తన అమ్మకాల రేషియో పెంచాలని చూస్తున్న కియా సంస్థ, ధరలను తగ్గిస్తే సక్సెస్ సాధించవచ్చని భావిస్తోంది. కానీ, ఎలక్ట్రిక్ వాహనాల ధరల తగ్గింపు అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. ప్రముఖ ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ కంపెనీలన్నీ కూడా ధరలను తగ్గించాలి అంటే ఆలోచన చేస్తాయి. కానీ అందుబాటు ధరలతో ఈవీ మార్కెట్లో ఆధిపత్యం కోసం చూస్తున్న కియా మోటార్స్ మాత్రం సాహసం చేయాలని చూస్తోంది. రాబోయే నెలల కాలంలో వరుస వేరియంట్ లను విడుదల చేయడమే కాకుండా, సరసమైన ధరల్లో వాటిని అందించి సక్సెస్ సాధించాలని ప్లాన్ చేస్తోంది. స్టీవ్ సెంటర్ మాటల ద్వారా ఈ విషయాలు అర్ధం అవుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటోమొబైల్ మార్కెట్లోని ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో చైనాకు చెందిన ప్రముఖ సంస్థలు బీవైడీ, గిలే, నియోల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఎలాన్ మస్క్ టెస్లాకు, పైన పేర్కొన్న చైనా కంపెనీల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ దిగ్గజ సంస్థలతో పోటీ పడతామని కియా సంస్థ బాహాటంగా చెబుతోంది. మంచి నాణ్యత కలిగి అఫార్డబుల్ ప్రైస్ లో వాహనాలను మార్కెట్ చేస్తూ పలు చైనా కంపెనీలు విజయవంతం అవుతున్నాయి. కియా సంస్థ కూడా చైనా సంస్థల స్ట్రాటజీని అమలు చేయాలని భావిస్తోంది.
Kia Motors In India : ఇక భారత్ లో కియా సంస్థ విషయాలకొస్తే.. కియా ఈవీ9 లాంచ్ కోసం భారత్ లో ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం టెస్టింగ్ దశలో EV9 ఎలక్ట్రిక్ వెహికిల్ ఉంది. ఈ సంవత్సరం చివరికి ఇది ఇండియాలో ప్రారంభం కావచ్చు. కియా 2.0 ప్లాన్ లో భాగంగా EV సెగ్మెంట్‌పై ఆధిపత్యం కోసం రెడీ అవుతున్న కియా మోటార్స్ వరుసగా కొత్త వేరియంట్స్ ని లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. మరి ఈ పరిస్థితులలో కియా EV3 ఇండియాలో ప్రారంభం అవుతుందా? లేదా? అనేది ఇంకా స్పష్టత రాలేదు.
Comments are closed.