శరీరం ఆరోగ్యంగా ఉండాలన్న మరియు వ్యాధుల బారిన పడకుండా ఉండాలన్న ఆహారంలో కివి (Kiwi) పండ్లను తప్పకుండా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా తినే పండ్లలో కివి పండ్లు ఒకటి. కివి పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
ఈ పండు తక్కువ క్యాలరీలు కలిగి ఉండి,ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. అంతేకాకుండా ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. ఈ పండు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకారి (Beneficiary) గా పనిచేస్తుంది .
కివి పండు తినడం వలన రోగనిరోధక శక్తిని బలంగా చేస్తుంది. అలాగే చర్మాన్ని కూడా ఆరోగ్యంగా మరియు అందంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ప్రతిరోజు రెండు కివి పండ్లను తినడం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి లభిస్తాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.
Also Read : Dates Benefits : పోషకాల గని ఖర్జూర పండు. రోజూ రాత్రి రెండు ఖర్జూర మిమ్మల్ని ఎప్పటికీ ధృఢంగా ఉంచుతుంది.
పోషకాలు కలిగిఉన్న పండ్లలో కివి పండు ఒకటి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె, మరియు విటమిన్ బి 6 ఉన్నాయి. అంతే కాకుండా అధిక మొత్తంలో ఫైబర్, జింక్, ఫాస్ఫరస్, మెగ్నీషియం కూడా సమృద్ధి (intensity) గా ఉన్నాయి.
https://twitter.com/narendramodi/status/1464938313756774407?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1464938313756774407%7Ctwgr%5E369f8fe4f4c44524bced07aa17756cf020c78720%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.hindustantimes.com%2Findia-news%2Fpm-modi-says-this-delicious-fruit-from-arunachal-pradesh-is-a-must-have-in-homes-101638111642615.html
ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ వృద్ధి కాకుండా అడ్డుకుంటాయి.
ఈ పండు అనేక రకాల వ్యాధులను దూరం చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. సీజన్ మారుతున్న సమయంలో అనారోగ్యం కారణంగా శరీరంలో ప్లేట్ లెట్స్ తగ్గినప్పుడు కివి పండ్లను తినడం వలన ప్లేట్ లెట్స్ ను పెంచడంలో చాలా ప్రభావంతం (effective) గా పనిచేస్తాయి. కనుక ప్లేట్ లెట్స్ తక్కువ ఉన్నవారు ప్రతిరోజు ఈ పండ్లను తినవచ్చు.
నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఈ పండు చాలా బాగా ఉపయోగపడుతుంది. కివి లో ఫెరోటోనిన్ ఉంటుంది. ఇది మంచిగా నిద్ర వచ్చేలా చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ పండును తినడం వలన మనసుకి కూడా ప్రశాంతంగా మరియు హాయిగా ఉంటుంది.
బిపి సమస్యతో బాధపడుతున్న వారు ఈ పండ్లను తప్పకుండా తినాలి. ఈ పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. దీనిని తినడం వలన బీపీని అదుపులో ఉంచుతుంది.
గుండె జబ్బులు మరియు స్ట్రోక్ వంటి వచ్చే వ్యాధుల నుండి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. కివి పండులో పొటాషియం అధికంగా ఉండడం వల్ల శరీరంలో కిడ్నీలు, గుండె, కండరాలు (muscles) సక్రమంగా పనిచేసేలా శక్తిని పొందుతాయి.
కివి పండు చర్మాన్ని ఆరోగ్యంగా మరియు అందంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ పండును తినడం వల్ల ముఖంపై వచ్చే మొటిమలు మరియు మచ్చలను నిర్మూలిస్తుంది.
అంతేకాకుండా కివి పండ్లలో విటమిన్ ఇ అధిక మొత్తంలో ఉండటం వల్ల చర్మానికి కాంతిని మరియు పోషణను అందించడంలో తోడ్పడుతుంది.
Also Read : Soaked Dry Fruits : ప్రతి రోజూ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మీ గుండె పదిలం.. శారీరక ఆరోగ్యం ధృడం
దీనిలో ఉండే ఆక్టినిడిన్ అనే సమ్మేళనం శరీరంలోని ప్రోటీన్లను విచ్ఛిన్నం చేసి జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉండడం వలన జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
కాబట్టి కివీ పండ్లను తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కనుక ప్రతిరోజు రెండు కివి పండ్లను తినడం వలన వైద్యుడు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు.
గమనిక : ఈ సమాచారం కేవలం అవగాహన, జ్ఞానం కోసం అందించడం జరిగినది. ఇందులోని అంశాలను ఉపయోగించాలని అనుకున్నప్పుడు మీ వైద్యులను సంప్రదించి వారి సూచన ప్రకారం నడచుకోండి.