Bank of Baroda Jobs : బ్యాంక్ ఉద్యోగం మీ లక్ష్యమా?.. పరీక్ష లేకుండానే జాబ్ పొందే అవకాశం.
బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. బ్యాంక్ ఆఫ్ బరోడా బిజినెస్ కరస్పాండెంట్ సూపర్‌వైజర్లు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది
Bank of Baroda Jobs : ప్రభుత్వ ఉద్యోగాల తర్వాత అంతటి క్రేజ్ ఉండే జాబ్స్ ఏవైనా ఉన్నాయా అంటే అవి బ్యాంకు జాబ్స్ (Bank Jobs) మాత్రమే. బ్యాంకు ఉద్యోగాల కోసం యువత ఎదురుచూస్తూ ఉంటుంది. నిత్యం బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతూనే ఉంటారు. బ్యాంకు ఉద్యోగమైతే మంచి జీతం, వారానికి రెండు రోజులు సెలవులు ఇతర సౌకర్యాలు ఉంటాయి.
అందుకే బ్యాంకు ఉద్యోగాలకు అంతటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన బ్యాంకుల నుంచి జాబ్ నోటిఫికేషన్స్ (Job Notifications) వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో ప్రముఖ బ్యాంకు పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రాత పరీక్ష రాయకుండానే ఈ ఉద్యోగాలను పొందొచ్చు. వెంటనే అప్లై చేసుకోండి. మే 15 వరకు ఆఫ్ లైన్ (Offline) విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా BC సూపర్‌వైజర్స్ (బిజినెస్ కరస్పాండెంట్ సూపర్‌వైజర్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆసక్తిగల దరఖాస్తుదారు ఎవరైనా అధికారిక వెబ్‌సైట్ bankofbaroda.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు చేయడానికి ముందు ఈ క్రింది అంశాలను జాగ్రత్తగా చదవండి.
వయో పరిమితి (Required Age) :
ఈ స్థానాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కనీసం 21 ఏళ్లు(Age) ఉండాలి మరియు 65 ఏళ్లు మించకూడదు.
అర్హతలు (Qualifications):
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సామర్థ్యంతో గ్రాడ్యుయేట్ (Graduate) అయి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ (Selection Process):
ఈ స్థానాలకు దరఖాస్తు చేసుకున్న వారందరూ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడతారు.
జీతం (Salary):
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, ఈ స్థానాలకు ఎంపికైన ఏ అభ్యర్థికైనా రూ. 25,000 వరకు వేతనం చెల్లిస్తారు.
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్ మరియు అవసరమైన పత్రాలను క్రింది చిరునామాకు పంపాలి. అసిస్టెంట్ జనరల్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ప్రాంతీయ కార్యాలయం, బరోడా సిటీ రీజియన్ II, గ్రౌండ్ ఫ్లోర్, సూరజ్ ప్లాజా 1, సయాజిగంజ్, బరోడా – 390005.
Comments are closed.