శరీరానికి పోషకాలే కాదు ‘చర్మ సమస్యలను సైతం ఖతం’ చేసే పాలకూర.. అందుకే ఇది సూపర్ ఫుడ్

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఆకుకూరలు ఎంతగానో దోహదపడతాయి. పాలకూర ను ఈ సీజన్లో తింటే సంవత్సరం అంతా ఆరోగ్యంగా జీవించవచ్చు. అందుకే పాలకూరను సూపర్ ఫుడ్ అంటారు. పాలకూర వల్ల చర్మానికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఆకుకూరలు ఎంతగానో దోహదపడతాయి, ముఖ్యంగా పాలకూర. పాలకూర (Lettuce) ను ఈ సీజన్లో తింటే సంవత్సరం అంతా ఆరోగ్యంగా జీవించవచ్చు. అందుకే పాలకూరను సూపర్ ఫుడ్ అంటారు. అయితే పాలకూర ఆరోగ్యానికే కాదు, చర్మ సంరక్షణకు కూడా తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

పాలకూరలో ఫైబర్, విటమిన్ ఎ, సి, కె లతో పాటు ఫోలేట్, పొటాషియం, ఐరన్ కూడా ఉన్నాయి. ఇవి చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

పాలకూరలో విటమిన్ -బి ఉంటుంది. ఇది ఎండ వల్ల వచ్చే నీలి కాంతి కిరణాల (Blue light rays) నుండి చర్మాన్ని సంరక్షిస్తుంది. సూర్యుని నుండి వచ్చే హానికరమైన కిరణాలు, అకాల వృద్ధాప్యానికి (premature aging) గురిచేస్తాయి. కనుక క్రమం తప్పకుండా పాలకూరని తినడం వల్ల చర్మ సమస్యలను సులభంగా తొలగించుకోవచ్చు.

Also Read : Benefits Of Cumin Seeds : అధిక బరువు నుండి డయేరియా వరకు నిద్ర లేమి నుండి నులిపురుగులు దాకా నివారించే జీలకర్ర

కనుక రోజు వారి ఆహారంలో పాలకూరను భాగంగా చేర్చుకోవడం వల్ల వివిధ రకాల వ్యాధుల నుండి మనల్ని మనం కాపాడు కోవచ్చు. అలాగే చర్మ సమస్యలు కూడా దరి చేరవు.

పాలకూర వల్ల చర్మానికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

 

Lettuce not only provides nutrients to the body but also cures skin problems. That's why it is a super food
Image Credit : HMTV

పాలకూర రసం త్రాగడం వల్ల శరీరంలోని వ్యర్ధ పదార్థాలు తొలగిపోతాయి. ఇది మొటిమలు, దద్దుర్లు (hives) సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి.

ముఖంపై ఉన్న సన్నని గీతలు, ముడతలు (Wrinkles) మరియు మచ్చలను తగ్గించడంలో పాలకూర చాలా బాగా ఉపయోగపడుతుంది.

పాలకూర లో విటమిన్ -కె, ఫోలేట్ అధిక మొత్తంలో ఉండడం వలన ఇది చర్మానికి మెరుపును తీసుకువస్తుంది. అలాగే ముఖం పై ఉన్న మచ్చలను కూడా తొలగిస్తుంది.

Also Read : Dry Cough : పొడి దగ్గు మిమ్మల్ని వేధిస్తుందా? ఇలా చేసి చూడండి, పొడి దగ్గు మాయం మీకు ఉపశమనం..

ముఖంపై మొటిమలు (pimples) ఉన్నవారు పాలకూరని పేస్టులా చేసి మిశ్రమాన్ని మొటిమల మీద అప్లై చేసి 30 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడగాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తే ముఖంపై ఉన్న మొటిమలు తొలగిపోతాయి.

ముఖంపై పిగ్మెంటేషన్ తో బాధపడేవారు పాలకూర మరియు పుల్లటి పెరుగు కలిపి పేస్ట్ చేసి, ఈ పేస్ట్ ని ముఖంపై అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడగాలి. ఈ విధంగా తరచుగా చేస్తే పిగ్మెంటేషన్ సమస్య ను వదిలించు కోవచ్చు.

కాబట్టి పాలకూర తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే చర్మ సమస్యల (Skin problems) కు కూడా చక్కటి పరిష్కార మార్గం పాలకూర. అందుకే పాలకూరను సూపర్ ఫుడ్ గా పరిగణించారు.

Comments are closed.