LIC Jeevan Utsav : ఎల్ఐసీ నుంచి అదిరిపోయే పాలసీ.. 5 ఏళ్లు కడితే చాలు జీవితాంతం గ్యారెంటీ ఆదాయం..!

LIC Jeevan Utsav

LIC Jeevan Utsav : ప్రభుత్వ రంగ జీవిత బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కొత్త పాలసీని లాంఛ్ చేసింది. పొదుపు+ బీమాతో పాటు గ్యారెంటీ రిటర్న్స్‌తో ఎల్‌ఐసీ ఈ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. అదే జీవన్‌ ఉత్సవ్‌ (LIC Jeevan Utsav) పాలసీ. ఇది నాన్‌ లింక్డ్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌, ఇండివిడ్యువల్‌, సేవింగ్స్‌, జీవితాంతం ఇన్సూరెన్స్ అందించే పాలసీ. ఒకసారి ఈ పాలసీ తీసుకుంటే ప్రీమియం చెల్లింపు వ్యవధి ముగిసిన తర్వాత జీవితాంతం ఆదాయం పొందొచ్చు. హామీ మొత్తంలో 10 శాతం చెల్లిస్తారు.

పాలసీ ఫీచర్లు .

ప్రీమియం టర్మ్‌, వెయిటింగ్‌ పీరియడ్‌ (Waiting period) తర్వాత ఏటా ఆదాయం వస్తుంది. మీరు రెగ్యులర్‌ ఆదాయాన్ని పొందకూడదనుకుంటే, మీరు ఫ్లెక్సీ ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. అందువలన, చక్రవడ్డీ ప్రయోజనం వస్తుంది. పాలసీ యొక్క మొదటి సంవత్సరం నుండి జీవితకాలం ముగిసే వరకు బీమా కవరేజ్ అందుబాటులో ఉంటుంది. ప్రీమియం చెల్లించే కాలానికి రూ. 1000కు రూ. 40 చొప్పున గ్యారెంటీ అడిషన్స్‌ ఉంటుంది. 90 రోజుల చిన్నారుల నుండి 65 సంవత్సరాల వయస్సు గల ఎవరైనా ఈ కవరేజీలో నమోదు చేసుకోవచ్చు.

Also Read : 2 Lakhs For Second marriage రెండో పెళ్ళికి రూ.2 లక్షలు, వారు మాత్రం అర్హులు కాదు

అర్హత వివరాలు.

ఈ పాలసీ (policy) ప్రవేశ వయస్సు 90 రోజులు. గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు. పాలసీ చెల్లింపులకు గరిష్ట వయస్సు 75 సంవత్సరాలు. 5 నుండి 16 సంవత్సరాల వరకు, ప్రీమియం చెల్లించాలి. కనీసం రూ.5 లక్షల బీమా కవరేజీ తీసుకోవాలి. ఎంచుకున్న పదవీకాలం ఆధారంగా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. మీరు ఐదేళ్ల ప్రీమియం చెల్లింపు వ్యవధిని ఎంచుకుంటే, మీరు ఐదేళ్లు వేచి ఉండాల్సి ఉంటుంది. అదే ఆరేళ్లు ఎంచుకుంటే నాలుగేళ్లు ఆగాల్సిందే. మీరు 7 సంవత్సరాలు ఎంచుకుంటే, మీరు తప్పనిసరిగా మూడు సంవత్సరాలు వేచి ఉండాలి. మీరు 8-16 సంవత్సరాల ప్రీమియం (Premium) చెల్లింపును ఎంచుకుంటే, మీరు తప్పనిసరిగా రెండు సంవత్సరాలు వేచి ఉండాలి. వెయిటింగ్ పీరియడ్ తర్వాత, మీరు ఎల్‌ఐసి నుండి సంవత్సరానికి హామీ మొత్తంలో 10% చొప్పున జీవితకాల ఆదాయాన్ని పొందవచ్చు. జీవించి ఉన్నంత కాలం ఇన్సూరెన్స్ హామీ ఉంటుంది.

LIC Jeevan Utsav

ప్రీమియం.

ఈ పాలసీ తీసుకోవాలంటే కనీస బీమా మొత్తం రూ. 5 లక్షలు తీసుకోవాలి. ఆపై ఎంత మొత్తమైనా హామీ మొత్తంగా ఎంచుకోవచ్చు. 30 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి ఐదేళ్ల ప్రీమియం చెల్లింపు ఆప్షన్‌ ఎంచుకుంటే ఏటా రూ. 2.17 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదే వ్యక్తి 8 ఏళ్ల ప్రీమియం ఆప్షన్‌ ఎంచుకుంటే రూ. 1.43 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 16 ఏళ్ల ప్రీమియం టర్మ్‌ ఎంచుకుంటే ఏడాదికి రూ. 58 వేలు చెల్లించాల్సి ఉంటుంది. వయసును బట్టి ప్రీమియం మారుతూ ఉంటుంది. అలాగే, ప్రీమియం చెల్లించే వ్యవధి పెరిగితే చెల్లించాల్సిన మొత్తం తగ్గుతుంది.

ఉదాహరణకు 25 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి 12 ఏళ్ల ప్రీమియం టర్మ్‌కు రూ. 10 లక్షల కనీస హామీ మొత్తంపై పాలసీ తీసుకున్నాడు అనుకుందాం. ఏటా రూ. 86,800 ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. 12 ఏళ్ల టర్మ్‌ అంటే 36 ఏళ్లు వయసు వచ్చే వరకు ఈ మొత్తం చెల్లించాలి. రెండేళ్ల వెయిటింగ్‌ పీరియడ్‌ తర్వాత అంటే 38 ఏట నుంచి రెగ్యులర్‌ ఆదాయం మొదలవుతుంది. బీమా మొత్తంలో 10 శాతం లక్ష రూపాయల చొప్పున ఏటా ఆదాయం లభిస్తుంది.

Also Read : Raithu Barosa 10 Days: పది రోజుల్లో రైతు భరోసా నిధులు విడుదల, ఇదిగో వివరాలు ఇవే!

లాభాలు.
ఈ ప్లాన్‌లో రెండు రకాల ఆప్షన్లు ఉంటాయి. ఒకటి రెగ్యులర్‌ ఆదాయం, రెండోది ఫ్లెక్సీ ఆదాయం. మొదటి ఆప్షన్‌ ఎంచుకుంటే ఏటా చివర్లో బీమా హామీ మొత్తం నుంచి 10 శాతం ఆదాయం వస్తుంది. అదే ఆప్షన్‌-2 ఎంచుకుంటే బీమా మొత్తంలో 10 శాతం ప్రతిఫలం అందుతుంది. ఈ మొత్తం ఎల్‌ఐసీ వద్దనే ఉంచితే 5.5 శాతం చొప్పున చక్రవడ్డీ జమ అవుతుంది. కావాలంటే జమ అయిన మొత్తం నుంచి 75 శాతం ఉపసంహరించుకోవచ్చు. ఒకవేళ పాలసీదారుడు (Policy holder) మరణిస్తే జమ అయిన మొత్తం, డెత్‌ బెనిఫిట్స్‌ను నామినీకి చెల్లిస్తారు. పాలసీదారుడు అకాల మరణం చెందితే డెత్‌ బీమా మొత్తం+ గ్యారెంటీడ్‌ అడిషన్స్‌ను వస్తాయి. డెత్‌ బీమా మొత్తం లేదా వార్షిక ప్రీమియానికి 7 రెట్లు ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తుంది.

LIC Jeevan Utsav Policy

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in