LIC Policy, Useful Scheme : మీ పెట్టుబడి రూ.500..లాభం మాత్రం కోటి రూపాయలు. ఇదిగో ఇలా చేస్తే..

LIC Policy

LIC Policy : జీవిత అవసరాలకోసం డబ్బును పొదుపు చేయడం అనేది చాలా మంచి అలవాటు. ఇందుకోసం ఒక్కొక్కరు ఒక్కో పద్దతిని అవలంబిస్తారు. అయితే ఇక్కడ తెలుసుకోబోయే విషయం నెలవారీగా పెట్టుబడి పెట్టి మీరు కోటీశ్వరులుగా ఎలా మారవొచ్చో ఇక్కడ తెలుసుకుందాం. మీరు నెల,నెలా పెట్టుబడి పెట్టాలని అనుకుంటే మీకు మంచి ఆదాయాన్ని అందించే పాలసీలు చాలా ఉన్నాయి. ఇలా నెలవారీ పెట్టుబడి పెట్టే వారికోసం ముఖ్యంగా ఎల్‌ఐసీ (LIC) ఒక గొప్ప ప్లాన్ ను కలిగి ఉంది.

ఈ ప్లాన్ మీకు మంచి ఆదాయాన్ని చేకూర్చుతుంది. ఈ ప్లాన్ లో మీరు డిపాజిట్ చేసిన డబ్బు నుండి మంచి రాబడిని పొందుతారు. ఎల్‌ఐసీ కరోడ్‌పతి లైఫ్ బెనిఫిట్‌లో (LIC Crorepati Life Benefit) డిపాజిట్ చేయడం ద్వారా మీరు 1 కోటి రూపాయల వరకు తిరిగి పొందుతారు. ఈ పాలసీని తీసుకున్న వారిని లక్షాధికారులను చేయడానికి ఇది రూపొందించబడింది. ఇది మీకు కోటి రూపాయల పరిహారాన్ని అందిస్తుంది.

ఎల్ఐసి కరోడ్ పతి పాలసీ ప్రత్యేకత ఏమిటంటే ఈ ప్లాన్‌లో మీరు చాలా తక్కువ మొత్తంలో డిపాజిట్ చేస్తారు కానీ మీరు పొందే ప్రయోజనాలు చాలా ఎక్కువ. ఎల్ఐసీ కరోడ్ పతీ పథకంలో అత్యధికంగా రూ.70 లక్షల వరకు వడ్డీని పొందుతారు.

LIC Policyఈ పధకంలో మీరు ఎంత పెట్టుబడి పెట్టాలి అనే దాని గురించి తెలుసుకుందాం. కరోడ్ పతీ పాలసీలో మీరు నెలకు సుమారు 15 వేల రూపాయలు డిపాజిట్ చేయాలి. అంటే మీరు రోజుకు డిపాజిట్ చేయాల్సిన మొత్తం రూ.500 రూపాయలు. మీరు నెలకు రూ.15,000 డిపాజిట్ చేస్తూ 16 సంవత్సరాలు ఈ పాలసీలో పెట్టుబడి పెట్టాలి. 16 ఏళ్ళకు మీరు నెలకు 15,000 పెట్టుబడి పెడితే అది రూ.29 లక్షలకు పైగా మీ పెట్టుబడి ఉంటుంది. మీ పెట్టుబడి 30 లక్షల రూపాయలు అయితే మీరు దాదాపు 1కోటి రూపాయల రాబడిని పొందుతారు.

ఎల్‌ఐసీ కరోడ్ పతీ పాలసీ టర్మ్ 25 సంవత్సరాలు. అయితే మీరు 25 సంవత్సరాలు పెట్టుబడి పెట్టనవసరం లేదు 16 ఏళ్లు మాత్రమే ఈ పాలసీలో పెట్టుబడి పెట్టాలి. మిగిలిన 9 సంవత్సరాల డిపాజిట్ ను ఎల్ఐసీ సంస్థ మీ పాలసీలోనెల, నెలా జమ చేస్తుంది. మీరు 16 సంవత్సరాల పాటు డబ్బు డిపాజిట్ చేసిన తర్వాత ఇంకా 9 సంవత్సరాలు మీ యొక్క పాలసీ గడువు సమయం ముగిసే వరకు వేచి ఉండాలి.

ఎల్‌ఐసీ అందిస్తున్న కరోడ్ పతీ పాలసీలో మీరు చేరిన తరువాత పాలసీ మొత్తంతో పాటు, మీ కుటుంబానికి రూ. 40 బీమా, రూ. 80 లక్షల వరకు యాక్సిడెంటల్ కవరేజ్ (Accidental coverage) లభిస్తుంది. అనుకోకుండా ఏదైనా కారణం చేత ప్రమాద కరమైన సంఘటన జరిగితే మీ కుటుంబానికి రూ. 80 లక్షల ప్రయోజనం లభిస్తుంది. దీనితో మీ బీమా కూడా ప్రతి సంవత్సరం పెరుగుతుంది.

LIC Policy

 

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in