Telugu Mirror : రోజువారి ఆహారంలో మనం తరుచుగా ఉప్పు(Salt) మరియు పంచదార(Sugar)ను తీసుకుంటూ ఉంటాం అయితే వీటిని అధికంగా తీసుకోవడం అత్యంత ప్రమాదకరం అని పరిశోధనలు అంటున్నాయి.చాలామంది అనుకుంటారు చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల మధుమేహం వస్తుందని. క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు.చక్కెర వల్ల నిజంగా క్యాన్సర్(Cancer) వస్తుందా? చక్కెర క్యాన్సర్ పెంచే కారకాలను ఎక్కువ చేస్తుందని నివేదికలు అంటున్నాయి. దీనిపై స్పష్టత లేదు. షుగర్ తినడం వల్ల క్యాన్సర్ రావడానికి ప్రత్యక్షంగా ప్రభావం చూపదని ,పరోక్షంగా దాని ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఈ విషయం గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం:
చక్కెరను తీసుకున్నప్పుడు అది రక్తంలో కలిసి ప్రతి కణం(Cell)లో శక్తి కోసం ఉపయోగిస్తుందని నిపుణులు అంటున్నారు. ఊపిరితిత్తులలోని సన్నని మరియు చదునైన కణాలలో ప్రారంభమయ్యే గడ్డలు యొక్క పెరుగుదలకు గ్లూకోజ్(Glucose) అవసరం. క్యాన్సర్ కణాలు, సాధారణ కణాలు కంటే సుమారుగా 200 రెట్లు ఎక్కువగా వినియోగిస్తాయి.అటువంటి సందర్భంలో మీరు షుగర్ ఎక్కువ మొత్తంలో తీసుకుంటే ,అలాగే శరీరంలో ఇప్పటికే క్యాన్సర్ కణితి(Cancerous Tumor) లు ఉంటే చక్కెర తినడం వల్ల అవి ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని కనుగొన్నారు.
అమెరికాలో క్యాన్సర్ సొసైటీ మరియు నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నిపుణులు ఏమని అన్నారంటే షుగర్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ కి కారణమయ్యే ఆధారాలు లేవని అంటున్నారు. అయితే ఇవి ఊబకాయం(obesity) ప్రమాదాన్ని పెంచుతుందని తద్వారా క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది అని అన్నారు.కొవ్వు కణాలు ఆడిపోకిన్స్(Adipokines) అనే ఇన్ఫ మేటరీ ప్రోటీన్లను రిలీజ్ చేస్తాయి. అప్పుడు డి.ఎన్ఏ. ను దెబ్బతీస్తాయి. అప్పుడు కణితుల ప్రభావం యొక్క ప్రమాదం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది .మీ శరీరంలో ఎంత ఎక్కువ కొలెస్ట్రాల్(Cholesterol) ను కలిగి ఉంటే ఈ ప్రోటీన్లకు అంత ఎక్కువ అవకాశం కలిగి ఉంటాయి.
Heavy Rains in Telangana: రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న వర్షాలు.. నేడు రేపు పాఠశాలలకు సెలవు
ఊబకాయం లేదా ఎక్కువ బరువు కలిగి ఉంటే రొమ్ము, లివర్ మరియు పెద్ద ప్రేగు కాన్సర్ తో పాటు, 13 రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని మరో అధ్యయనంలో అంటున్నారు. కొన్ని రకాల క్యాన్సర్లు, ఇన్సులిన్(Insulin) ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉందని పరిశోధనలు పేర్కొన్నాయి.
షుగర్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందా లేదా అనేది అధ్యయనాలలో మిశ్రమ ఆరోపణలు ఉన్నాయని అంటున్నారు.కాబట్టి ఆహారంలో చెక్కర తీసుకోవడం తగ్గించాలి. మీకు మధుమేహం(Sugar) ఉన్నా లేకపోయినా షుగర్ ఎక్కువగా తీసుకోవడం తగ్గించడం చాలా మంచిది.షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మెదడు సంబంధిత ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉందని పరిశోధనలు పేర్కొన్నాయి. షుగర్ ఎక్కువ తీసుకోవడం వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది .