సాధారణంగా మొక్కజొన్న (corn) పిండిని వంటలు చేయడానికి ఉపయోగిస్తాం. చైనీస్ వారు కూరలో గ్రేవీ చక్కగా రావడానికి మొక్కజొన్న పిండిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అలాగే సూప్స్ లో కూడా మొక్కజొన్న పిండిని వాడుతుంటారు. వంటలలో మొక్కజొన్న పిండిని కలపడం వలన చిక్కదనం తో పాటు రుచి కూడా పెరుగుతుంది.
అయితే మొక్కజొన్న పిండి (Corn flour) ని ఉపయోగించి బట్టలపై పడిన మరకలను తొలగించుకోవచ్చు అన్న విషయం చాలామందికి తెలియదు. అంతేకాకుండా కొన్ని రకాల వస్తువులను కూడా శుభ్రపరచడంలో కూడా మొక్కజొన్న పిండి చాలా బాగా పనిచేస్తుంది.
ఈ రోజు కథనంలో మొక్కజొన్న పిండితో బట్టలు మరియు ఫ్లోర్ పై ఉన్న మరకలను ఎలా తొలగించ వచ్చో తెలుసుకుందాం. అలాగే కొన్ని రకాల వస్తువులను మెరిసేలా ఎలా చేస్తాయో కూడా తెలుసుకుందాం.
బట్టల పై నూనె (oil) మరకలు పడుతూ ఉంటాయి. అవి అంత సులువుగా పోవు. అటువంటి సందర్భంలో మొక్కజొన్న పిండిని ఉపయోగించి వాటిని వదిలించు కోవచ్చు. బట్టల పై నూనె మరక ఉన్నచోట మొక్కజొన్న పిండిని చల్లాలి. పిండి చల్లిన తర్వాత 12 గంటల పాటు అలానే వదిలేయాలి.
అలా వదిలేయడం వల్ల బట్టల పై పడిన నూనెను ఆ పిండి పీల్చుకుంటుంది. ఆ తర్వాత బట్టలను సబ్బుతో ఉతికి ఎండలో ఆరేస్తే మరక (stain) సులువుగా వదిలిపోతుంది.
మొక్కజొన్న పిండి తో కూడా నూనె మరకలను పోగొట్టుకోవచ్చు. నూనె పడిన చోట మొక్కజొన్న పిండి పేస్ట్ ను అప్లై చేసి ఐదు గంటల పాటు అలానే వదిలేయాలి. ఆ తర్వాత కడగాలి. కార్న్ స్టార్చ్ తో నూనె మరకలే కాకుండా ఎలాంటి మరకలనైనా సులువుగా తొలగించవచ్చు. అలాగే మరకలను సులువుగా శుభ్రం (clean) చేయవచ్చు.
Also Read : Benefits Of Rose Water : రోజ్ వాటర్ ని ఇలా ఉపయోగిస్తే గులాబీ లాంటి అందం మీ స్వంతం
soya Bean : మీరు ఎప్పుడైనా సోయా ఛాప్స్ తయారీ చూశారా? ఇలా చేస్తారని ఊహించరు! వైరల్ గా మారిన వీడియో
మొక్కజొన్న పిండిని ఉపయోగించి వెండి (silver) వస్తువులు, గాజు వస్తువులు, తలుపులపై పడిన మరకలు, గోడలపై ఉన్న మరకలను కూడా తొలగించవచ్చు. మొక్కజొన్న పిండితో వస్తువులను శుభ్రం చేయడం వల్ల అవి కొత్త వాటిలా మెరుస్తాయి. తరచుగా కాకపోయినా నెలకు ఒకసారైనా ఈ పిండిని ఉపయోగించి వస్తువులను శుభ్ర పరచుకోవచ్చు.
కాబట్టి మొక్కజొన్న పిండి ని ఈ విధంగా ఉపయోగించి ఎటువంటి మరకల నైనా తొలగించుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని రకాల వస్తువులను (Things) తళ తళ మెరిసేలా చేయవచ్చు.