Telugu Mirror : ప్రతి ఒక్కరూ యంగ్ (Young) గా ఉండాలని కోరుకుంటారు. వృద్ధాప్యంలో చర్మం పై వచ్చే ముడతలు గురించి ఆందోళన చెందుతుంటారు. అయితే వయసు పెరిగే కొద్దీ చర్మం లో మార్పులు రావడం సహజం. అయితే పెరుగుతున్న కాలుష్యం వల్ల కూడా ముడతలు, ఫైన్ లైన్స్, మచ్చలు, పిగ్మెంటేషన్ (pigmentations) చిన్న వయసులోనే వస్తున్నాయి. వీటివల్ల ముఖం చెడిపోతుంటుంది. వాటిని పోగొట్టుకోవడం కోసం చర్మాన్ని సంరక్షించుకునే చికిత్సలు చేయించుకుంటారు.
మరి కొంతమంది ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ (Beauty produts) వాడి వాటిని నిర్మూలిస్తారు. మీలో ఎవరికైనా చర్మంపై వచ్చే ముడతలతో ఇబ్బంది పడుతున్నట్లయితే కొన్ని ఇంటి చిట్కాలను అనుసరించి ముఖంపై ఉన్న ముడతలను తగ్గించుకోవచ్చు. వీటిని వాడటం వలన మీ ముఖంపై వచ్చే ముడతలను తగ్గించుకోవచ్చు. చర్మంపై వచ్చే ముడతలు తగ్గించుకోవడానికి మనం నెయ్యిలో కొన్ని రకాల పదార్థాలను కలిపి వాడటం వల్ల ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ముడతలతో పాటు చర్మంపై వచ్చే ఇతర సమస్యలను కూడా తగ్గిస్తాయి. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం.
నెయ్యి మరియు సెనగపిండి
పొడి చర్మం ఉన్నవారు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో ఒక టేబుల్ స్పూన్ శెనగపిండి వేసి కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖం కడగాలి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ముడతలను ఖచ్చితంగా తగ్గిస్తుంది. చర్మంపై ఉన్న మృత కణాలను కూడా తొలగించడంలో కూడా సహాయపడుతుంది.
మితంగా వెన్న తింటే ఆరోగ్యానికి మేలు, అధికంగా తింటే అనారోగ్యం పాలు
నెయ్యి మరియు తేనె
చిన్న వయసులో వచ్చే ఫైన్ లైన్స్, ముడతలు మరియు చర్మం వదులుగా ఉండే సమస్యల నుంచి బయటపడాలంటే ఒక టీ స్పూన్ నెయ్యి మరియు తేనెను కలిపి చర్మానికి అప్లై చేయాలి. దీనిని తరచుగా కొన్ని రోజులు వాడటం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.
నెయ్యి, పసుపు మరియు వేప పొడి
ఈ మూడింటిని కలిపి పేస్ట్ లా తయారు చేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి అప్లై చేసి ఆరిన తర్వాత సాధారణ నీటితో కడగాలి. ఈ ప్యాక్ లో ఉండే మూలకాలు చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి అలాగే చర్మం పై ఉన్న ముడతలను కూడా తగ్గిస్తుంది.
నెయ్యి మరియు ముల్తాని మిట్టి
నెయ్యి మరియు ముల్తానీ మిట్టి వాడటం వల్ల ముఖంలో మెరుపు వస్తుంది. ఈ ప్యాక్ ని కొన్ని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. చర్మంపై ఉన్న ముడతల (Wrinkles) ను తగ్గించుకోవడంతో పాటు నిగారింపు చర్మాన్ని కూడా పొందవచ్చు. ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో, ముల్తానీ మిట్టి కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత శుభ్రంగా కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల ముడతలు తగ్గడంతో పాటు, మెరిసే చర్మంను పొందవచ్చు మరియు బ్లాక్ హెడ్స్ సమస్య కూడా ఉండదు.
కాబట్టి ముఖంపై ఉన్న ముడతలను తగ్గించుకోవడానికి మరియు చర్మంపై ఉన్న ఇతరసమస్యలను కూడా పోగొట్టుకోవడానికి ఈ చిట్కాలను అనుసరించి సులభంగా బయటపడవచ్చు.