Telugu Mirror: హెయిర్ స్పా పేరుని చాలా మంది వినే ఉంటారు. కానీ దీని యొక్క ఉపయోగాలు మరియు జుట్టుకి దీని అవసరం ఎంత ఉందో మీకు తెలుసా ?
హెయిర్ స్పా వలన జుట్టు పోషణ మరియు శ్రేయస్సు కోసం మాత్రమే కాకుండా ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఈ హెయిర్ స్పా చేయించడం వలన ఇది జుట్టుకి డి స్ట్రెస్ థెరపీ వలె పని చేస్తుంది.
బ్యూటీ ఎక్స్ పర్ట్ ప్రకారం, హెయిర్ స్పా వలన డ్యామేజ్ అయిన మీ జుట్టును ఆరోగ్యంగా మారుస్తుంది. దీని వలన మానసిక ఒత్తిడి తగ్గు తుంది తద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. హెయిర్ స్పాను కనీసం నెలలో ఒకసారి అయినా చేయించుకోవడం అవసరం. హెయిర్ స్పా తర్వాత కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి అప్పుడే దీని యొక్క పూర్తి ఉపయోగాలు జుట్టుకి అందుతాయి.
నిజానికి హెయిర్ స్పా అనేది జుట్టుకు చేసే చికిత్స. దీనిలో షాంపూ (Shampoo), హెయిర్ క్రీం (Hair Cream), హెయిర్ మాస్క్ (Hair Mask) మరియు కండిషనర్ అప్లై చేయడం ద్వారా మీ జుట్టును డీప్ మాయిశ్చరైజింగ్ (Deep Moisturizing) చేస్తుంది. అలాగే ఆవిరి కూడా పట్టడం వలన జట్టు యొక్క రంధ్రాలను తెరవడం జరుగుతుంది. ఈ ప్రక్రియ ద్వారా డామేజ్ అయిన మీ హెయిర్ రిపేర్ అవుతుంది. దీనివలన జుట్టుని మృదువుగా,మెరిసేలా చేస్తుంది. హెయిర్ స్పా తర్వాత మీ జుట్టు పెరగడంలో కూడా సహాయపడుతుంది.
హెయిర్ స్పాను నెలకు ఒకసారి చేపిస్తే సరిపోతుంది. అయితే మీ జుట్టు నిర్జీవంగా ఉంటే 15 రోజులకు ఒకసారి చేయించాలి. కానీ నెలకు ఒకటి లేదా రెండు సార్లు కంటే, ఎక్కువసార్లు హెయిర్ స్పా చేయించకూడదు. హెయిర్ స్పా ఎక్కువగా చేయించడం వలన స్కాల్ఫ్ డ్రై గా మారుతుంది. అలాగే జుట్టు కూడా డల్ గా అవుతుంది . హెయిర్ స్పా చేసిన తర్వాత మీ జుట్టును దుమ్ము మరియు మురికి నుండి కాపాడుకోవాలని గుర్తించుకోండి. దీనికోసం మీరు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మీ జుట్టుపై దుమ్ము పడకుండా స్పార్క్ తో మీ జుట్టును కవర్ చేయండి.
హెయిర్ స్పా తర్వాత స్ట్రైట్ నర్ లు, కర్లర్ లు ,బ్లోయర్ లు మొదలైన హెయిర్ స్టైలింగ్ సాధనాలను ఉపయోగించకండి. దీనివలన జుట్టుకి అందిన పోషణ కోల్పోయే ప్రమాదం అధికం అవుతుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ వస్తువుల వాడకాన్ని కనీసం ఒక వారం పాటు ఆపేయాలని అన్నారు.
హెయిర్ స్పా తర్వాత జుట్టుకు డీప్ కండిషనింగ్ జరుగుతుంది. కాబట్టి హెయిర్ స్పా చేయించుకున్న తరువాత ఒకటి లేదా రెండు రోజుల వరకు మీరు జుట్టును కడగకూడదు. వెంటనే తలస్నానం చేయడం వలన హెయిర్ స్పా ప్రయోజనాలను పూర్తిగా పొందలేరు. బ్యూటిషన్ చెప్పిన సలహాలు పాటించండి. షాంపూను వాడినప్పుడల్లా షాంపూను జుట్టుపై నేరుగా అప్లై చేయకండి. షాంపూలో కొద్దిగా నీరు కలిపి అప్పుడు దానితో తలస్నానం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీ జుట్టులో మెరుపు అలానే ఉంటుంది.
మీరు మీ జుట్టును కడిగిన ప్రతిసారి కండీషనర్ ఉపయోగించడం మర్చిపోకండి. కండీషనర్ చేయడం వలన జుట్టును మృదువుగా చేస్తుంది. అలాగే హెయిర్ స్పా వలన వచ్చే ప్రయోజనాలు జుట్టుకి చాలా రోజులు ఉంటుంది. మరియు జుట్టు లైట్ గా తడి ఉన్నప్పుడు సీరం ఉపయోగించాలి. కండిషనర్ లేదా సీరం అవసరమైన పరిమాణంలో మాత్రమే వాడాలి.
హెయిర్ స్పా చేయడం వలన మీ జుట్టు ఇతరుల జుట్టు కన్నా, భిన్నంగా ఉంటుంది. మరియు మీ జుట్టు మృదువుగా ఉంటుంది. మెరుస్తూ కనిపిస్తుంది మరియు జుట్టు అందాన్ని రెట్టింపు చేస్తుంది.ప్రస్తుత రోజుల్లో వాతావరణం లో కాలుష్యం అధికంగా ఉంటుంది. కాబట్టి మీ జుట్టుని రక్షించుకోవడం కోసం హెయిర్ స్పా చక్కటి మార్గం. దీనివలన చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది. మసాజ్ వలన ఒత్తిడి కూడా తగ్గుతుంది. హెయిర్ స్పా వలన జుట్టు కూడా పెరుగుతుంది.
కాబట్టి హెయిర్ స్పా వలన జుట్టుకి ఇన్ని ప్రయోజనాలు ఉండటం వలన కనీసం నెలలో ఒకసారి అయినా తప్పనిసరిగా చేయించుకోవడం అవసరం.