నడకతో ఆరోగ్యం మీ సొంతం, ఎక్కువగా నడవడం వల్ల ఎన్ని ప్రయోజనాలో!

ప్రతి రోజూ నడవడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీ చెబుతుంది. ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి.

Telugu Mirror : మన జీవితం, మనం చేసే పనులు, ఆలోచనలు, మంచి అలవాట్ల పైనే ఆధారపడి ఉంటుంది. ఆహారం, ఆరోగ్యం, ఆనందం ఎల్లప్పుడూ ఉండాలనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మనిషి ఆశా జీవి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. వయసు మీద పడుతున్నప్పటికీ ఇంకా కొనేళ్లు బతకాలనే కోరిక ప్రతి జీవిరాశికి ఉంటుంది. మనిషి లో కూడా ఈ కోరిక ఉంటుంది. ఇలా ఆశించడం ఒక ఎత్తు అయితే దానికి అనుగుణంగా నడుచుకోవడం మరో ఎత్తు. ఆరోగ్యమైన జీవితం కావాలనుకుంటే సరిపోదు, ఆరోగ్య రక్షణకై మార్గాలు వెతకడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడం కూడా ముఖ్యం. మన ఆరోగ్య రక్షణకై మంచి ఆహరంతో పాటు మరి కొన్ని అలవాట్లను అలవాటు చేసుకోవడం వల్ల కూడా ఆయిష్షు పెరిగే అవకాశం ఉంటుందని మీ తెలుసా? అవును మీరు విన్నది నిజమే.ఎలానో ఇప్పుడు చూద్దాం.

సుదీర్ఘ నడకతో 15% ఆరోగ్యాన్ని పెంచే ఛాన్స్.

ప్రతి రోజు నడవడం లేదా సుదీర్ఘ నడక ఒంటికి చాలా మంచిది. అలా చేయడం మనిషి ఆరోగ్య విషయం లో కీలక పాత్ర పోషిస్తాయి. ఆధునిక కాలం లో టెక్నాలజీ (Technology) పెరుగుతున్నందు వల్ల మనం ఎంత దూరం నడిచాం, ఎన్ని అడుగుల దూరం నడుస్తున్నాం అనే విషయాన్నీ చాల ఈజీ గా ట్రాక్ చేయొచ్చు.

Image Credit : GK Gurukul

మితంగా వెన్న తింటే ఆరోగ్యానికి మేలు, అధికంగా తింటే అనారోగ్యం పాలు

నిపుణులు చెప్పేదాని ప్రకారం, రోజూ దాదాపు 10,000 వేల అడుగుల నడక మంచిదని సూచిస్తున్నారు. యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీ (european journal of preventive cardiology) తాజాగా చేసిన పరిశోధన పై ఒక ప్రచురణ అందించింది. ఆ పరిశోధన ప్రకారం, మరణం సంభవించే వ్యాధులను అరికట్టేందుకు రోజుకి సగటున 4 వేల చర్యలు తీసుకోవాలట. అలా చేయడం వలన గుండెకి సంబందించిన వ్యాధులు చోటు చేసుకోకుండా ఉంటాయి.

మీరు తీసుకునే చర్యలను పెంచడం వలన 15% మరణాలు సంభవించే ఆవకాశం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి ఆరోగ్యాన్ని అందించాలంటే మెరుగైన వ్యాయామం ఇంకా ఎక్కువ శారీరక శ్రమ అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి.
నడవడం వల్ల వచ్చే లాభాలు నిపుణుల మాటలు.

సుదీర్గమైన నడక ఒంటికి మంచిది మరియు అనేక రోగాలను నివారించడం లో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు సగటున 4 వేల నుండి 20,000 అడుగులు అనగా దాదాపు రెండు కిలోమీటర్స్ (two kilometers) నడవడం వలన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది చెబుతున్నారు. ఆరోగ్యాంగా ఉండేందుకు రోజు వారి చర్యలో పెద్దగా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి రోజు ఎక్కువ సేపు నడిచేందుకు ప్రయత్నించండి, మరియు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Leave A Reply

Your email address will not be published.