Morning Walk: మార్నింగ్ వాక్ లో మీరు ఈ పద్దతులు పాటిస్తున్నారా? లేకపోతే మీ ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉంది.
Telugu Mirror: వాకింగ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి .అయితే మార్నింగ్ వాక్(Morning Walk) చేయడానికి వెళుతున్నట్లయితే సరిగ్గా చేస్తున్నారా లేదా అనే విషయం తెలుసుకోవాలి. మార్నింగ్ వాక్ చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని అనుకుంటారు. అవును ఇది శరీరానికి మేలు కచ్చితంగా చేస్తుంది .మార్నింగ్ వాకింగ్ చేయడం వలన ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కండరాలను దృఢపరుస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది. వీటితో పాటు గుండె(heart)ను ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ మార్నింగ్ వాకింగ్ సరైన పద్ధతిలో చేయకుంటే ఆరోగ్యానికి హానికరం అవుతుంది. మార్నింగ్ వాకింగ్ కి వెళ్లేవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
ఉదాహరణకు కొందరు వాకింగ్ కి వెళ్లే వారికి నిద్ర సరిపోకపోతే వాళ్ళు లేచి అలానే వాకింగ్ కి వెళతారు. నిద్ర సరిపోని కారణంగా అలసట మరియు చిరాకు వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మార్నింగ్ వాక్ చేయడం వల్ల శరీరానికి పూర్తి ఉపయోగాలు అందవు. అందువలన మార్నింగ్ వాక్ సరైన పద్ధతిలో చేయడం చాలా అవసరం.
మార్నింగ్ వాక్ కి వెళ్లే ముందు హెవీ ఫుడ్(Heavy Food) తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఇది జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. తేలికపాటి మరియు పోషకాలు ఉన్న ఆహారాన్ని తక్కువ మోతాదులో తినడం ఉత్తమం. ఎందుకంటే వీటిని మీరు తినడం వల్ల మీకు శక్తితో పాటు నడకకి ఉపయోగంగా ఉంటుంది.
మార్నింగ్ వాక్ కి వెళ్లే ముందు కొద్దిగా నీరు త్రాగి వెళ్లడం మంచిది. నడిచే సమయంలో దేహంలో సరైన హైడ్రేషన్(Hydration) నిర్వహించడానికి ఈ విధంగా చేయాలి. ఉదయం పూట వాకింగ్ కి వెళ్లే ముందు వాటర్ తాగడం వల్ల శరీరంలో ఎనర్జీ లెవెల్ పెరిగి చలాకీగా ఉంటారు. కాబట్టి మార్నింగ్ వాక్ కి వెళ్లే ముందు నీళ్లు తాగి వెళ్లడం శ్రేయస్కరం.
మార్నింగ్ వాక్ కి వెళ్లేటప్పుడు పాదరక్షల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన పాదరక్షలు ఎంచుకోవాలి. మీ వాకింగ్ షూస్ సౌకర్యవంతంగా మరియు సరిగా సరిపోయిన వాటిని సెలెక్ట్ చేసుకోండి. తద్వారా మీకు షూస్ వల్ల జారే సమస్యలను నివారించవచ్చు. మీ పాదాల సైజుని బట్టి సరైన సైజుని ఎంచుకోండి.
ఉదయం వాకింగ్ కి వెళ్లే ముందు కొన్ని వామప్స్(Warm up’s) చేయడం తప్పనిసరి. ఇవి చేయడం వల్ల శరీరం వేడెక్కుతుంది. అప్పుడు మీ బాడీలోని కండరాలు, నడకకు సిద్ధమవుతాయి. వైద్యశాస్త్రం ప్రకారం ఉదయం వాకింగ్ కి వెళ్లే ముందు ఐదు నుంచి పది నిమిషాలు వామప్ చేయడం వల్ల బాడీ ఉత్తేజం అవుతుంది. అప్పుడు వాకింగ్ చేయడానికి బాడీ సహకరిస్తుంది. వాకింగ్ ముందు శరీరాన్ని ఉత్తేజింప చేయడం సురక్షితం. మరియు ఆరోగ్యకరమైన నడకకు మంచిది.
ఫిజియోథెరపిస్ట్(Physiotherapist) మరియు ఫిట్నెస్ నిపుణులు డాక్టర్ అమిత్ అగర్వాల్(Dr.Amith Agarwal) మాట్లాడుతూ, మార్నింగ్ వాకింగ్ ఆరోగ్యానికి చాలా మంచిదని అన్నారు. ముఖ్యంగా మహిళలు వాకింగ్ చేయడానికి ఆసక్తి చూపరు అని అన్నారు. మార్నింగ్ వాక్ కి వెళ్లే ముందు కొంచెం నీరు త్రాగాలి. అలాగే ఓట్స్(Oats), బనానా(Bananna) లేదా చిలగడదుంపల వంటి కొన్ని తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం లేదా తేలికపాటి స్నాక్స్(snacks)కూడా తీసుకునే ప్రయత్నం చేయవచ్చు. ప్రారంభంలో నడిచేటప్పుడు చాలా స్పీడుగా నడవకూడదు. అలాగే వేరే వాళ్ళని చూస్తూ వాకింగ్ చేయకూడదు వారిని అనుసరించకూడదు. మీ సౌలభ్యం ప్రకారం చేయండి. మార్నింగ్ వాక్ పూర్తయిన తర్వాత కొంచెం నీరు త్రాగాలి.
కాబట్టి మార్నింగ్ వాక్ చేసే వారు ఈ జాగ్రత్తలు పాటించి, ప్రతి ఒక్కరు వాకింగ్ చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.