Coffee Varities: బాప్ రే ఇన్ని ‘ కాఫీ’ లా

Telugu Mirror: కాఫీ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు ‌.చాలామందికి టీ(Tea) మరియు కాఫీ(Coffee) తాగే అలవాటు ఉంటుంది. కొంతమందికి రోజుకి మూడు నుంచి నాలుగు సార్లు కాఫీ తాగే అలవాటు ఉంటుంది.

అదే పనిగా పనిచేసినప్పుడు అలసిపోయిన భావన కలుగుతుంది. అటువంటి సమయంలో కాఫీ తాగాలని అనుకుంటారు . ఎందుకంటే రిలాక్స్ గా ఉంటుంది కాబట్టి. కాఫీలు చాలారకాలుగా తయారు చేస్తారని చాలామందికి తెలియదు .అందరికి తెలిసిన కాఫీ(Coffee) నార్మల్ కాఫీ.

Also Read:Face Pack : మెరిసే చర్మం కోసం నాచురల్ పేస్ ప్యాక్ ..ఇప్పుడు మీ కోసం..

మీరు ఎప్పుడైనా కెఫీన్(caffeine) కి వెళ్ళినప్పుడు ఎటువంటి  కాఫీ ఆర్డర్ ఇవ్వాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతారు.కాబట్టి అలాంటి పరిస్థితి ఎదురవకుండా ఈరోజు కొన్ని రకాల కాఫీల గురించి తెలుసుకుందాం.

Image credit: Medline plus

కాఫీలలో రకాలు:

ఎస్ప్రెస్సో(espresso):

ఈ కాఫీ ని బ్లాక్ కాఫీ అని కూడా పిలుస్తారు. దీనిలో పాలు ఉపయోగించరు. మరియు చక్కెర(Sugar)కూడా కలపరు. ఈ కాఫీ నల్లగా మరియు ఘాటుగా ఉంటుంది.

డోపియో(Doppio):

ఇది బ్లాక్ కాఫీ(Black Coffee) కన్నా స్ట్రాంగ్ గా ఉంటుంది చాలామంది ఈ కాఫీ ని ఆర్డర్ చేస్తుంటారు.

అమెరికాన్(American):

బ్లాక్ కాఫీ రుచికి దగ్గరగా ఉంటుంది. దీనిని వేడి నీటితో తయారు చేస్తారు. ఇది బ్లాక్ కాఫీ(Black Coffee)తో పోలిస్తే కొంచెం తక్కువ ఘాటుగా ఉంటుంది.

కాపు చినో(cappuccino):

ఈ కాఫీని పాలనురగ మరియు పాలను ఉపయోగించి తయారు చేస్తారు. ఈ కాఫీలో వేడిపాలు మరియు పాలనురగ అన్ని సమాన భాగాలుగా తీసుకొని తయారు చేస్తారు.

Also Read:Vivo Y27 : అదిరిపోయే ఫీచర్స్ తో అందరికి అందుబాటులో Vivo Y27 4G ఫోన్ ..

లాట్టే(Latte):

దీనిలో పాలపరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఈ కాఫీలో వెన్న తీసిన పాలు, పాలనురగ, ఎస్ప్రెస్సో కూడా ఉన్నాయి .దీని రుచి కాపు చినో రుచిలాగే అనిపిస్తుంది.

మోచా(Mocha):

ఇది ఒక డిఫరెంట్ కాఫీ. దీనిలో హాట్ చాక్లెట్(Hot Chocolate) కూడా ఉంటుంది .ఈ కాఫీ రుచి చాలా బాగుంటుంది దీనిని పాలనరగ, పాల ,ఎస్ప్రెస్సో నుండి తయారు చేస్తారు.

కోర్టడో(Cortado) :

ఈ కాఫీ నీ కేవలం వెన్న తీసిన పాలు మరియు ఎస్ప్రెస్సో తో తయారుచేస్తారు.

మకియాడో(Mercado):

కాఫీలో మరొక రకం . దీనిని పాలనురగ మరియు పాలు ఎస్ప్రెస్సో తో కలుపుతారు .దీనిలో వేడి పాలకు బదులుగా పాల నురగ ను ఉపయోగిస్తారు.

ఎప్పుడైనా డిఫరెంట్ గా కాఫీ తాగాలనుకున్నప్పుడు ఈ రకమైన కాఫీలు తాగి ఎంజాయ్ చేయవచ్చు.

Leave A Reply

Your email address will not be published.