Sweaty Palms And Hands : కాళ్ళు చేతులకు అధిక చెమట పడుతుందా? మీ సమస్యకు పరిష్కారం ఇక్కడ ఉంది.

ఎవరికైనా పని చేస్తున్నప్పుడు చెమట పట్టడం సహజం. కొంతమందికి ఏ పని చేసిన లేదా చేయకపోయినా చేతులకు మరియు కాళ్లకు చెమట ఎక్కువగా పడుతుంటుంది. ఇటువంటి వారి కోసం కొన్ని రకాల టిప్స్ ఈరోజు కథనంలో తెలియజేస్తున్నాం. ఈ టిప్స్ పాటించడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

ఎవరికైనా పని చేస్తున్నప్పుడు చెమట (sweat) పట్టడం సహజం. కొంతమందికి ఏ పని చేసినా లేదా చేయకపోయినా చేతులకు మరియు కాళ్లకు చెమట ఎక్కువగా పడుతుంటుంది. అటువంటివారు చెప్పులు లేదా షూస్ వేసుకున్న చెమట పట్టి చెప్పులు మరియు షూస్ జారుతుంటాయి. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు.

చెమట వల్ల కాళ్లకు బాగా మురికి అంటుకుంటుంది. తద్వారా పాదాలు నల్లగా అవుతాయి. అలాగే చెప్పులు కూడా త్వరగా పాడైపోతాయి. మరియు చెమట వాసన (smell) అధికంగా వస్తూ ఉంటుంది. ఈ సమస్య వల్ల నలుగురిలోకి రావడానికి ఇబ్బంది పడుతుంటారు.

ఇటువంటి వారి కోసం కొన్ని రకాల టిప్స్ ఈరోజు కథనంలో తెలియజేస్తున్నాం. ఈ టిప్స్ పాటించడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

మైల్డ్ సోప్ :

Sweaty Palms And Hands : Do feet and hands sweat excessively? Here is the solution to your problem.
image credit : Fashion Beans

చేతులకు మరియు కాళ్లకు ఎక్కువగా చెమటలు పడుతుంటే ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఈ సమస్యతో ఇబ్బంది పడేవారు వాసన అధికంగా వచ్చే సబ్బులు వాడకుండా మైల్డ్ సోప్ ని వాడాలి. దీనిని వాడటం వల్ల ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది.

Also Read : శరీరంలో కలిగే అంతర్గత ఆరోగ్య సమస్యలకు నివారిణి విటమిన్-E., ఇలా తీసుకోండి ఉల్లాసంగా జీవించండి

కాటన్ సాక్స్ :

Sweaty Palms And Hands : Do feet and hands sweat excessively? Here is the solution to your problem.
image credit : Buzz Feed

కాళ్లకు అధికంగా చెమటలు పట్టేవారు టైట్ గా ఉండే షూ వేసుకోకుండా కొంచెం వదులుగా ఉండే షూ వేసుకుంటే మంచిది. మరియు సాక్సుల విషయంలో కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. కాటన్ సాక్స్ ని వాడటం మంచిది. ఎందుకంటే ఇవి చెమటను పీల్చుకుంటాయి (Inhale).

ఆపిల్ సైడర్ వెనిగర్ :

Sweaty Palms And Hands : Do feet and hands sweat excessively? Here is the solution to your problem.
image credit : The Times Of India

కాళ్ళు మరియు చేతులకు చెమటలు అధికంగా పట్టే వారికి ఆపిల్ సైడర్ వెనిగర్ చాలా బాగా పనిచేస్తుంది. నీళ్లలో కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి కలిపి అందులో చేతులను మరియు కాళ్ళను 20 నిమిషాల పాటు ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే ఆంటీ మైక్రోబియన్ లక్షణాలు చెమటను నియంత్రిస్తాయి. అలాగే దుర్వాసన (stench) రాకుండా చేయడంలో సహాయపడతాయి.

Also Read : Benefits Of Rose Water : రోజ్ వాటర్ ని ఇలా ఉపయోగిస్తే గులాబీ లాంటి అందం మీ స్వంతం

బ్లాక్ టీ :

Sweaty Palms And Hands : Do feet and hands sweat excessively? Here is the solution to your problem.
image credit : Reddit

కాళ్ళు మరియు చేతులు కు ఎక్కువగా చెమట పట్టేవారికి బ్లాక్ టీ డికాషన్ చాలా బాగా పనిచేస్తుంది. బ్లాక్ టీ డికాషన్ లో చేతులు మరియు కాళ్ళను 30 నిమిషాల పాటు ఉంచాలి. తరచుగా ఈ విధంగా చేయడం వల్ల చేతులు మరియు కాళ్ళలో వచ్చే చెమటను తగ్గించడంలో సహాయపడతాయి.

కాబట్టి చేతులు మరియు కాళ్లకు అధికంగా చెమట పట్టేవారు ఇటువంటి కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా ఈ సమస్య నుండి సులువుగా బయటపడవచ్చు.

Comments are closed.