Best Flowers Valentine Week Rose Day 2024 : రోజ్ డే తేదీ, గులాబీల విశిష్టత మరియు వాలెంటైన్స్ వీక్ లో ఈరోజు ప్రాముఖ్యత

Valentine Week Rose Day 2024

Valentine Week Rose Day 2024 : ఫిబ్రవరి -7 నుంచి 14 వరకు ప్రేమికుల వారం (Valentine’s Week) ను జరుపుకుంటారు. ప్రేమికుల వారం మొదటి రోజు అంటే ఫిబ్రవరి – 7 న “రోజ్ డే” (Rose Day) గ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజున మీరు మీ స్నేహితుడికి, మీ భాగస్వామికి లేదా ప్రత్యేకమైన వ్యక్తికి గులాబీ పువ్వు ను ఇవ్వడం ద్వారా మీ భావాలను వ్యక్తం చేయవచ్చు.
ఈ నేపథ్యంలోనే పూల మార్కెట్లు గులాబీలతో నిండి కళకళలాడుతున్నాయి. ప్రేమికుల వారంలో ప్రత్యేకంగా ఒకరోజు గులాబీ లకు అంకితం చేయడం జరిగింది.

రోజ్ డే రోజు ఎటువంటి రంగు గులాబీ పువ్వును ఎవరికి ఇవ్వాలి మరియు దాని యొక్క అర్థం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
ప్రేమకు చిహ్నంగా గులాబీ పువ్వును ఇస్తారు. గులాబీ పువ్వు రంగును బట్టి వాటి యొక్క అర్ధాన్ని వ్యక్త పరుస్తాయి. మీ మనసులోని భావాలను మీరు ఎంచుకున్న కలర్ గులాబీ పువ్వులను బట్టి అవతలి వ్యక్తికి చెప్పవచ్చు.
మీరు ఎవరినైనా ప్రేమించిన లేదా ఎవరితోనైనా స్నేహం చేయాలన్నా, మీ మనసులోని భావాన్ని గులాబీ పువ్వు ద్వారా వ్యక్తీకరించవచ్చు. మీ మనసులో దాగి ఉన్న ప్రేమను మీరు ఇచ్చే పువ్వు రంగును బట్టి చెప్పవచ్చు.

Types Of Flowers To Give In Valentine Week Rose Day 2024:

తెల్ల గులాబీ పువ్వు  (White Rose):
మీరు ఏదైనా తప్పు చేసినట్లయితే వారికి క్షమాపణ చెప్పాలి అనుకుంటే ఆ వ్యక్తికి తెల్ల గులాబి పువ్వు ని ఇవ్వాలి. తెల్ల గులాబీ పువ్వు స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నంగా సూచిస్తాయి. మీకు మరియు మీ భాగస్వామికి మధ్య ఏమైనా గొడవలు ఉంటే ఈ తెల్ల గులాబీ పువ్వుని ఇవ్వడం ద్వారా మీ మధ్య ఉన్న సంబంధాన్ని పునఃర్మించుకోవడానికి దోహదపడుతుంది.

పసుపు గులాబీ  (Yellow Rose):
మీరు ఎవరితోనైనా స్నేహం చేయాలి అనుకుంటే వారికి పసుపు రంగు గులాబి పువ్వు ని ఇవ్వాలి. పసుపు రంగు గులాబీ నీ స్నేహానికి గుర్తుగా సూచిస్తారు. మీరు మీ స్నేహితులను ఇష్టపడుతున్నారని చెప్పాలి అనుకుంటే మీరు వారిని వారికి పసుపు రంగు గులాబీ పువ్వును ఇవ్వడం వలన వారికి సులువుగా విషయం అవగతమవుతుంది.

పింక్ రోజ్ (Pink Rose):

పింక్ కలర్ గులాబీ పువ్వును స్నేహితులకు ఇవ్వడం వలన మీ స్నేహబంధం ను బలంగా చేసుకోవచ్చు అని అర్థం. పింక్ కలర్ గులాబీ ప్రేమ మరియు సంరక్షణను సూచిస్తుంది. అలాగే కృతజ్ఞత మరియు ఆనందాన్ని కూడా సూచిస్తుంది.

ఆరెంజ్ రోజ్ (Orange Rose):
నారింజ రంగులో ఉండే గులాబీ పువ్వు అభిరుచికి చిహ్నంగా చెబుతారు. జంటల మధ్య, తమ ప్రేమతో ఉన్న అభిరుచిని సూచించడానికి నారింజ రంగు గులాబీ పువ్వును ఇవ్వవచ్చు.

ఎర్ర గులాబీ (Red  Rose):

ఎరుపు రంగు గులాబీ పువ్వును ప్రేమను వ్యక్తపరచడానికి ఇస్తారు. మీరు ఎవరినైనా ప్రేమిస్తే, మీ ప్రేమను తెలపడానికి ఎరుపు రంగు గులాబీని ఇవ్వవచ్చు. మీరు ఇచ్చిన ఎరుపు రంగు గులాబీ పువ్వును వారు తీసుకుంటే, అవతలి వ్యక్తి కూడా మీ ప్రేమను అంగీకరించినట్లు అర్థం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ఎర్ర గులాబీని ఇస్తారు‌. ఈ ఎరుపు రంగు గులాబీ పువ్వు గౌరవం, అందం, ప్రేమ మరియు శృంగారాన్ని సూచిస్తుంది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in