శరీరం మొత్తానికి రక్తాన్ని సరఫరా చేసే అవయవాలలో గుండె ఒకటి. ఈ ప్రక్రియలో ఏదైనా సమస్య ఉంటే మొత్తం ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది.ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల ప్రమాదాలు అధికమవుతున్నాయి. దీని గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి మరియు నివారణ చర్యలు గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి సెప్టెంబర్ 29న “ప్రపంచ హృదయ దినోత్సవం” (World Heart Day) ను ప్రతి సంవత్సరం జరుపుకుంటారు.
గుండె జబ్బుల ప్రమాదాలు వేగంగా పెరుగుతున్నాయి. కోవిడ్ -19 (Covid-19) నుంచి వీటి ప్రమాదం ఇంకా అధికమైంది. ప్రస్తుతం యువకులు కూడా దీని బాధితులు గా మారుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మరణించే వారిలో గుండె జబ్బులు ఒకటని వైద్యులు అంటున్నారు. జీవన విధానంలో మార్పులు మరియు నాణ్యతలేని ఆహారం వీటి వల్ల గుండె ఆరోగ్యాన్ని అధికంగా ప్రభావితం చేస్తున్నాయి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే దినచర్య సక్రమంగా ఉండడం చాలా అవసరం.
హార్వర్డ్ (Harvard) నిపుణులు మాట్లాడుతూ, మనం తెలిసీ, తెలియక చేసే అనేక చెడు అలవాట్లు కారణంగా మన గుండెకు హాని కలుగుతుంది. 20 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారిలో కూడా గుండెపోటు లేదా గుండె ఆగిపోవడం అంటి సమస్యలు అధికమవుతున్నాయి. ఎటువంటి చెడు అలవాట్ల వల్ల మన గుండె మీద చెడు ప్రభావం పడుతుందో వాటిని వెంటనే వదిలేయాలి. సక్రమమైన జీవన శైలీ అలవాటు చేసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవడంతో పాటు ఎక్కువ రోజులు జీవించే అవకాశం సాధ్యమవుతుందని హార్వర్డ్ నిపుణులు చెబుతున్నారు.
Also Read : Role Of Aspirin: రెండవ సారి హార్ట్ స్ట్రోక్ నివారణలో ఆస్పిరిన్ పాత్ర
పురుషులలో మరియు మహిళల్లో వచ్చే గుండె జబ్బుల ప్రమాదం పై జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, బరువును నియంత్రణలో ఉంచుకొని మరియు ధూమపానం చేయకుండా, క్రమం తప్పకుండా వ్యాయామం (Exercise) చేసే వారికి గుండెపోటు లేదా గుండెజబ్బుల తో మరణించే ప్రమాదం 83% తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు.
ఎటువంటి అలవాట్లు ఉంటే గుండె ఆరోగ్యానికి ప్రమాదకరమో తెలుసుకుందాం :
సిగార్లు, పొగాకు, సిగరెట్లు వినియోగం ఉన్నవారు వీటిని పూర్తిగా మానేయాలి. వాటి నుంచి వెలువడే పొగ గుండె ధమనుల కు ఎక్కువగా హాని కలిగిస్తుందని హార్వర్డ్ నిపుణులు పేర్కొన్నారు. పొగాకు ఉత్పత్తుల కు దూరంగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సెకండ్ హ్యాండ్ (Second Hand) స్మోకింగ్ కూడా చాలా ప్రమాదకరం. వీటికి కూడా దూరంగా ఉండాలి.
శారీరక శ్రమ కూడా చాలా అవసరం. శారీరక శ్రమ ఉండటం వలన గుండె జబ్బులు మరియు అనేక ఇతర దీర్ఘకాలిక వ్యాధులను రాకుండా కాపాడటంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. శారీరకంగా ఎంత చలాకీ (Active) గా ఉంటే దీర్ఘకాలిక వ్యాధులు అంత దూరంగా ఉంటాయి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ఒక లక్ష్యంగా పెట్టుకొని ఈ విధంగా చేయడం వలన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. శారీరక శ్రమ తక్కువగా ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు.
Also Read : యుక్త వయసులో గుండెపోటు రావడానికి కారణాలు ఇవే,అవేంటో తెలుసుకొండి.
శరీర బరువు ఎప్పుడూ కూడా అదుపులో ఉండేలా చూసుకోవాలి. అధిక బరువు ఉండటం వలన ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు (Fat) గుండెపై ఒత్తిడి తెస్తుంది. తద్వారా గుండె జబ్బులు మరియు డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచేలా చేస్తుంది. అధిక బరువు ఉండటం వల్ల రక్తపోటు మరియు బ్లడ్ షుగర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండింటి వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది.
గుండె నొప్పి లక్షణాలు :
ప్రతి ఒక్కరు తమ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. దానికి సంబంధించిన సమస్యల హెచ్చరిక సంకేతాలను ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. సంకేతాలను ముందుగానే గుర్తిస్తే వెంటనే చికిత్స (Treatment) తీసుకోవడం వలన ఆరోగ్యాన్ని గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఛాతినొప్పి లేదా అసౌకర్యంగా అనిపించడం, బిగుతుగా ఉండటం, ఒత్తిడి అనిపించడం లేదా మంటతో కూడి ఉండటం, ఇటువంటి లక్షణాలు కలిగినప్పుడు వెంటనే వైద్యుని (Doctor) దగ్గరికి వెళ్ళాలి. కొంతమందికి మెడ, చేతులు, దవడ లేదా వెన్ను నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రకమైన సమస్య ఉన్నా కూడా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
దానిమ్మ పండు చేస్తుంది ఆరోగ్యానికి ఎంతో మేలు
విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది ఉన్నట్లయితే గుండె (Heart) కు సంబంధించిన సమస్య అనే సంకేతం కావచ్చు. ఊపిరి పీల్చు కోవడంలో సమస్య ఉన్నట్లయితే లేదా చాతి నొప్పితో పాటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నట్లయితే వెంటనే వైద్యుని దగ్గరికి వెళ్ళాలి.
హృదయ స్పందన ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నట్లయితే గుండెపోటు లేదా ఇతర గుండె రుగ్మతలకు కూడా దారితీసే అవకాశం ఉంది. క్రమ రహిత హృదయ స్పందన ఉన్నట్లయితే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.
కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ (Care) తీసుకోవడం చాలా ముఖ్యం.
గమనిక: ఈ కథనం వివిధ మాధ్యమాల ద్వారా సమీకరించి వ్రాయబడినది. పాఠకులకు అవగాహన కల్పించడం కోసం తయారు చేయబడింది.