Telugu Mirror : ప్రావిడెంట్ ఫండ్ ఖాతా దీనినే PF ఖాతా అంటారు.PF ఖాతాను ఉద్యోగస్తులు కలిగి ఉంటారు.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దీనిని EPFO అంటారు.EPFO క్రింద ఉద్యోగస్తుల PF ఖాతాలను తెరుస్తారు. PF ఖాతాలలో ఉద్యోగుల జీతం నుంచి ప్రతి నెలా ఉద్యోగి జీతం నుంచి 12% డియర్ నెస్ (డి.ఎ.) అలవెన్స్ తో పాటు మినహాయించి జమ చేస్తారు.
ఉద్యోగి జీతం లో మినహాయించిన 12% తోపాటు,ఉద్యోగి పనిచేసే ప్రభుత్వ,ప్రైవేటు సంస్థ తన ఉద్యోగుల PF ఖాతాలో అంతే మొత్తాన్ని జమ చేస్తుంది. జమ చేసిన డబ్బు మీద ప్రభుత్వం వార్షిక వడ్డీని అదే ఖాతాకు చెల్లిస్తుంది. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారుడు అవసరమైతే ఉద్యోగం మధ్యలో లేదా రిటైరయ్యాక ఈ డబ్బును ఉపసంహరించు కోవచ్చు.
New Rules For Fast Tag: మీ వాహనం కి ఇప్పుడు ఇది అమర్చడం తప్పనిసరి. మారనున్న టోల్ ప్లాజా రూల్స్
PF డబ్బు విత్ డ్రా కోసం మీ యొక్క బ్యాంక్ ఖాతా ప్రావిడెంట్ ఫండ్ పోర్టల్ లో అప్ డేట్ చేసి ఉండాలి.ఇదిలా ఉండగా కొంత మంది వారి యొక్క బ్యాంక్ ఖాతాను వారి కున్న వివిధ కారణాల వలన మార్చుతుంటారు.అటువంటి వారు వారి PF ఖాతా లింక్ అయిన బ్యాంక్ ఖాతాను సైతం మార్చుకోవాలి అనుకుంటే చాలా సులభతరమైన మార్గంలో మార్చుకోవచ్చు.మీ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకు కొత్త బ్యాంక్ ఖాతాను ఎలా జోడించాలో తెలుసుకుందాం.PF ఖాతాలో కొత్త బ్యాంక్ ఖాతాను అప్ డేట్ చేసే విధానం దశల వారీగా తెలుసుకోండి.
దశ 1…..
• మీరు ఏ కారణం చేతనైనా మీయొక్క PF ఖాతాకు కొత్త బ్యాంక్ ఖాతాను లింక్ చేయాలని అనుకుంటే,
•మొదటిగా మీరు unifiedportal-mem.epfindia.gov.in/memberinterface EPFO అధికారిక వెబ్ సైట్ లోకి ప్రవేశించాలి.
దశ 2…..
• మీరు EPFO వెబ్ సైట్ లోకి వెళ్ళిన తరువాత మీరు UAN నంబర్ ను,పాస్ వర్డ్ అలాగే క్యాప్చా కోడ్ ని మీ స్క్రీన్ పై ఎంటర్ చేయడం ద్వారా లాగిన్ అవ్వాలి.
• లాగిన్ అవగానే మీకు పోర్టల్ లో KYC ఎంపిక వస్తుంది దానిపై నొక్కండి.
• మీరు మీ బ్యాంక్ ఖాతాను జోడించే అవకాశాన్ని పొందుతారు.
• మీరు బ్యాంక్ ఖాతాను అప్ డేట్ చేసుకునే అవకాశం పై క్లిక్ చేయండి.
దశ 3…..
•ఇప్పుడు మీరు మీ కొత్త బ్యాంక్ అకౌంట్ సమాచారాన్ని పొందుపరచాలి.అంటే మీరు మీ పాత ఖాతా కాకుండా మార్చాలి అని అనుకున్న కొత్త ఖాతా వివరాలని నింపాలి.
•ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన సమాచారాన్ని క్షుణ్ణంగా తనీఖీ చేయండి. దీనివలన సమాచారం నింపడం లో పొరపాట్లు ఉంటే సరి చేయవచ్చు.
దశ 4
మీరు ఎంటర్ చేసిన సమాచారం మొత్తం సరిగా ఉంటే “సమర్పించు” మీద క్లిక్ చేయండి.
•క్లిక్ చేసిన తరువాత మీ కొత్త బ్యాంక్ ఖాతా వివరాలు మీ సంస్థ యొక్క HR ద్వారా ఆమోదం తెలుపబడుతుంది.
•మీ సంస్థ HR ఆమోదించగానే మీ యొక్క కొత్త బ్యాంక్ ఖాతా ప్రావిడెంట్ ఫండ్ (PF)ఖాతాకు జోడించబడుతుంది.