Telugu Mirror : చాలా మంది శిధిలావస్థ లో ఉన్న పాత ఇళ్ళలో నివసిస్తుంటారు. మీ పాత ఇంటిని రిపేర్ చేయించడానికి మీ దగ్గర సరిపడా డబ్బు లేదా? బ్యాంకులు పాత ఇంటి మరమ్మత్తు(repair)ల కోసం రుణాలను ఇస్తాయని మీకు తెలుసా? పాత ఇంటి పై రుణాలను గ్రామీణ,పట్టణ ప్రాంతాలకు వేరు వేరు పరిమితులలో రుణాలను అందిస్తాయి.మీకు మీ పాత ఇంటి రిపేర్ కోసం రూ.50,000 నుంచి 2 లక్షల వరకు రుణం కోసం చూస్తుంటే,రుణం(Loan) పొందే ప్రక్రియ గురించి తెలుసుకుందాం.
పాత గృహాల రిపేర్ కోసం రుణం పొందేందుకు కొన్ని అర్హత ప్రమాణాలను పాటిస్తాయి బ్యాంక్ లు,మీరు అర్హత కలిగి ఉండి అవసరమైన పత్రాలు అన్నిటినీ సమర్పిస్తే పాత ఇంటి మరమ్మత్తు కోసం లోన్ పొందవచ్చు.SBI,పంజాబ్ నేషనల్ బ్యాంక్,కోటక్ మహీంద్రా,బ్యాంక్ ఆఫ్ బరోడా,ICICI, IDBI ,ఇండియన్ బ్యాంక్ మరియు ఆనేక ఇతర బ్యాంక్ లు పాత గృహాల రిపేర్ కోసం రుణాలను అందిస్తాయి.
Realme C53 Launch : ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఫస్ట్ సేల్ ఎప్పుడో తెలుసా?
బ్యాంక్ రుణం కోసం మీరు పైన తెలిపిన బ్యాంక్ లలో ఏదేని ఒక బ్యాంక్ కు వెళ్ళండి.మీ భూమి యొక్క రిజిస్ట్రేషన్ పత్రాలు,మీ ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్, మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ల నకలు(copy) వీటితోపాటు మీ బ్యాంక్ లావాదేవీల చివరి మూడు నెలల స్టేట్మెంట్ కాపీలను బ్యాంక్ అధికారికి అందజేయండి.బ్యాంక్ వారు మీ పత్రాలను ధృవీకరించుకుని,మీకు రుణం ఇవ్వడానికి ఆమోదించితే,ఇంటిని నిర్మించడానికి లేదా రిపేర్ చేసుకోవడానికి మంజూరు అయిన రుణం మొత్తంలో 70% నుండి 80% వరకు మీ బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ(deposit) చేస్తారు.
అదేవిధంగా మీ పాత ఇంటికి రుణం పొందాలి అనుకుంటే మొదట మీ భూమి యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్(Registration document) ఉండాలి. మీ వయస్సు 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల లోపు వయసు కలిగి భారతీయులై ఉండాలి. అలాగే ఇంతకు ముందు మీరు ఏ బ్యాంక్ లోను రుణం తీసుకుని చెల్లించకుండా ఉన్నా గానీ,చాలా ఆలస్యంగా రుణాలను తిరిగి చెల్లించినట్లుగా ఉండకూడదు.ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్నట్లు అయితే మీరు చేస్తున్న ఉద్యోగంలో రెండు సంవత్సరాల సర్వీస్ కలిగి ఉండాలి.మీరు పని చేస్తున్న సంస్థ నెలకొల్పి మూడు సంవత్సరాలు అయి ఉండాలి.మీ యొక్క నెల జీతం రూ.25,000 ఉండాలి.అలాగే మీరు మీ ఆధార్ కార్డ్(Aadhaar Card) కి పాన్ కార్డ్(PAN Card) ని అప్ డేట్ చేసి ఉండాలి.
Sukanya Samrudhi : కేవలం 250 రూపాయలతో డిపాజిట్, మీ చిన్నారి భవిష్యత్ కోసం అదిరిపోయే స్కీమ్
ఇవన్నీ ఉన్నా గానీ మీరు రుణానికి అర్హత ఉందా లేదా అని మీ యొక్క బ్యాంక్ క్రెడిట్(Credit) రికార్డ్ ను ఇంకా ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.మీకు మీ పాత ఇంటి కోసం ఇచ్చే లోన్ మీ CIBIL స్కోర్ అలాగే మీరు ఉన్న ప్రదేశం తో పాటు కొన్ని ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.మీ ఇల్లు గ్రామీణ ప్రాంతంలో ఉంటే తక్కువ రుణాన్ని,పట్టణ ప్రాంత మైతే అధిక శాతం రుణాన్ని పొందవచ్చు.అలాగే ప్రధాన రహదారికి సమీపంలో ఉంటే ఇంకొంత ఎక్కువ రుణం పొందేందుకు అవకాశం ఉంది.ఉదాహరణకు మీ ఇల్లు పట్టణంలో ప్రధాన రహదారికి సమీపంలో ఉంటే,మీకు రూ.30 లక్షల నుండి 32లక్షల వరకు రుణ మొత్తానికి అర్హత కలిగి ఉంటారు.