Lord Shaniswar : నవగ్రహాల్లో శని భగవానుడికి ప్రత్యేక స్థానం ఉంది. సూర్యుడు కుమారుడైన శనీశ్వరుడు కర్మ ప్రదాత. అనగా మనుషులు చేసే క్రియలను బట్టి వారికి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. కనుక శనీశ్వరుడుని న్యాయాధిపతి అని కూడా అంటారు.
అన్ని గ్రహాల్లో చాలా నెమ్మదిగా కదిలే గ్రహం శని గ్రహం. ఒక రాశి నుండి మరొక రాశి లోకి అడుగుపెట్టడానికి శని గ్రహానికి దాదాపు రెండున్నర సంవత్సరాల సమయం పడుతుంది. కాబట్టి శనీశ్వరుడిని మంద గమనుడు అని కూడా పిలుస్తారు. అయితే చాలామంది శనీశ్వరుడు అంటే భయపడతారు. ఎందుకంటే ఎంతోమంది ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని తో ఎంతో బాధపడుతూ ఉంటారు.
అయితే శని భగవానుడు అనుగ్రహం మంచి పనులు చేసే వారిపై మంచి ప్రభావం చూపిస్తాడు. చెడు పనులు చేసే వారికి కష్టాలు కలుగజేస్తాడని నమ్ముతారు. శనీశ్వరుడు ప్రతి ఒక్క రాశిలోను కొన్ని సంవత్సరాలపాటు ఉంటాడు. ఆ సమయంలో వారు చేసే పనులను బట్టి తగిన విధంగా ఫలితాలు ఇస్తుంటాడు.
అయితే శనివారం రోజు శని దేవునికి అంకితం చేయబడింది. కాబట్టి ముఖ్యంగా శనివారం రోజున చేసే పనులు మంచిగా ఉంటే శని భగవానుడు శుభ దృష్టితో శుభ ఫలితాలను తప్పకుండా ఇస్తాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. కాబట్టి శని భగవానుడు మన జాతకంలో సానుకూలంగా ఉండాలంటే శనివారం రోజున ఎటువంటి పనులు చేయాలో మరియు ఎటువంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం.
శనీశ్వరుడి కి మిత్రుడు హనుమంతుడు. కాబట్టి శనివారం రోజున తమలపాకులను ఆంజనేయ స్వామికి సమర్పించి పూజించడం వలన వారిపై శని భగవానుడు శుభ దృష్టిని కలిగి ఉంటాడు.
శనివారం రోజున చీమలకు, కాకులకు, కుక్కలకు ఆహారం పెట్టడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ విధంగా చేయడం వలన జాతకములో శని దోషం ఉన్నవారికి దోష ప్రభావం తొలగిపోతుందని భావిస్తారు.
శనీశ్వరుడి వాహనాలలో కాకి ఒకటి. నల్ల చీమలకు పంచదారను ఆహారంగా పెట్టడం వలన శని భగవానుడు వారి జాతకంలో సానుకూలంగా ఉంటాడు.
శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించినా కూడా శని భగవానుడు వారికి మంచి ఫలితాలను అందిస్తాడని విశ్వాసం.
శని దేవుడిని జిల్లేడు పువ్వులు మరియు నల్ల నువ్వులను సమర్పించి పూజించాలి. అలాగే శని అష్టకం పఠించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు.
శనిదోషం ఉన్నవారు శనీశ్వరుడి గుడిలో నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. మరియు నల్లని దుస్తులు సమర్పించాలి.
శని భగవానుడుకి పేదవారు మరియు దివ్యాంగులు అంటే అమితమైన ప్రేమ. కనుక శని దేవుని అనుగ్రహం పొందడం కోసం పేదలకు అన్నదానం, వస్త్ర ధానం వంటివి చేయడం వలన శనీశ్వరుడు అనుగ్రహం సులభంగా పొందవచ్చు. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలబడే వ్యక్తులపై మరియు సాయం కోసం ఎదురుచూసే వారికి సాయం చేస్తే శని దేవుడు వారి పట్ల సానుకూలంగా ఉంటాడు.
జలదానం చేసిన వారిపై శని భగవానుడు సానుకూలంగా ఉంటాడు.
ప్రకృతి వికాసానికి సహకరించే వారిపై శుభ ఫలితాలను ఇస్తాడు. అలాగే పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రకృతికి మరియు పశువులకు సేవ చేయడం వలన శని దేవుడు శుభ ఫలితాలను ఇస్తాడు.
మీ సంపాదనను ఎట్టి పరిస్థితులలోనూ ఇతరులను నాశనం చేయడానికి ఉపయోగించకూడదు. అటువంటి వారిపై శని భగవానుడు దుష్ప్రభావాన్ని చూపిస్తాడు.
అలాగే ఇతరుల హక్కులను సొంతం చేసుకోవాలని చూసే వారిపై కూడా శని దేవుడు చాలా కఠినంగా ప్రవర్తిస్తాడని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
మద్యం మరియు మత్తు పదార్థాలు తీసుకునే వారిపై శని దేవుడు ప్రకోపం ఉంటుంది అని వాస్తు పండితులు హెచ్చరిస్తున్నారు.
అలాగే శనివారం రోజున మాంసాహారం తినే వారిపై కూడా చెడు ప్రభావం పడుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు.
డబ్బు, అధికారం, పదవులు, అహంకారం ఉన్నవారిపై శని భగవానుడి చెడు ప్రభావం అధికంగా ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అటువంటి వారికి శని దేవుడు తగిన బుద్ధి చెబుతాడని చెబుతున్నారు.
కాబట్టి శని అనగానే భయపడాల్సిన అవసరం లేదు. మనిషి చేసే కర్మలను బట్టి మంచి, చెడు ఫలితాలను శని భగవానుడు వారికి ఇవ్వడం జరుగుతుంది. కనుక శనీశ్వరుడు మన జీవితంలో సానుకూలంగా ఉండాలంటే పైన పేర్కొన్న మంచి పనులు చేసి శుభ ఫలితాలను ప్రతి ఒక్కరు పొందవచ్చు.
మంచి పనులు చేసే వారిపై శని భగవానుడు కృప ఖచ్చితంగా ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
వాస్తు శాస్త్రం పై నమ్మకం ఉన్నవారు పాటించండి. ఆనందంగా జీవించండి.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…