Telugu Mirror : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ మేనిఫోర్ట్ లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంది. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని అందించడం మరియు ఆరోగ్యశ్రీ కార్డు పరిమితి రూ.15 లక్షల వరకు పెంచిన విషయం మన అందరికి తెలిసిందే. ఇక ప్రజాపాలనలో స్వీకరించిన 5 గ్యారెంటీల దరఖాస్తుల డేటా ఎంట్రీ కూడా పూర్తి కావొస్తుంది.
కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ప్రజాపాలనలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకి రూ.2,500 ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. ఈ పథకానికి ప్రతి సంవత్సరం రూ.10 వేల కోట్ల వరకు అవసరమవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అయితే ఈ స్కీం ఎంపీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాకముందే ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తుంది.
ఈ పథకానికి వయోపరిమితి 18-55 సంవత్సరాలు ఉండాలి. ప్రజాపాలన దరఖాస్తుల్లో ఎక్కువగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ (గృహాజ్యోతి), రూ.500 గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500 ఆర్థిక సహాయం వంటి దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. ఈ పథకాలను తొందర్లోనే ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
Also Read : Prajapalana : ప్రజాపాలన దరఖాస్తులకు అప్లై చేసుకున్నారా? అయితే ఇప్పుడే అప్లికేషన్ స్టేటస్ ని చెక్ చేసుకోండి
అయితే కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే రెండు పథకాలను నెరవేర్చగా మహాలక్ష్మి పథకం వచ్చే నెలలో ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది. బీపీఎల్ కుటుంబాలకు సంబంధించి నెలకి రూ.2,500 వారి ఖాతాల్లో జమ కానున్నాయి. అయితే దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా వచ్చే నెలలోనే విడుదల అయ్యేలా కనపడుతున్నాయి.
ఈ పథకం ఇంట్లో ఒక్కరికి మాత్రమే వర్తిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఆ ఇంట్లో పెన్షన్ లబ్దిదారులు ఉంటె మరి ఈ పథకం కింద వారికి సహాయం అందుతుందా లేదా అనే విషయం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇంట్లో భర్త టాక్స్ కట్టినా లేక జీఎస్టీ రిటర్న్ ఫైల్ చేసిన కూడా వారు అనర్హులుగా ఉంటారు. మహాలక్ష్మి పథకం ప్రభుత్వ ఉద్యోగులకి కూడా వర్తించదు. ఈ పథకం రేషన్ కార్డు ఆధారంగా అమలు చేయబడుతోంది అంచనా.
మహాలక్ష్మి పథకానికి కావలసిన పత్రాలు :
ఈ పథకం కింద దాదాపు 10 మిలియన్ల మహిళలు లబ్ధి పొందుతున్నారని అంచనా వేస్తున్నారు. అర్హులైన మహిళలు నెలకి రూ.2,500 నగదు సహాయం అందుతుంది. ఇకపై నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేయబడుతుంది.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…