Mahatma Gandhi Employment: కరువు పనికి వెళ్లేవారికి గుడ్ న్యూస్, రూ.50,000 ప్రయోజనం

నిరుపేదలకు పనిని కల్పిస్తూ, ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది.

Mahatma Gandhi Employment: MGNREGA మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రవేశ పెట్టారు. పేదలకు ప్రతి సంవత్సరం 100 రోజులు పని కల్పించి సామాజిక మరియు ఆహార భద్రతను పెంపొందించే తగిన లక్ష్యాలతో ఈ ప్రణాళికను ప్రారంభించారు.

నిరుపేదలకు పనిని కల్పిస్తూ, ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం (Government) ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది. దాదాపు మూడింట ఒక వంతు పనులను మహిళలకు మాత్రమే కేటాయించారు. 2005లో, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రవేశ పెట్టారు. గ్రామీణ కుటుంబాలకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో 100 రోజులు ఉపాధి హామీని అందిస్తుంది.

ఈ చట్టం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రాంతాలకు వర్తిస్తుంది. ఉపాధి హామీ వ్యవస్థ రోడ్లు, కాలువలు, చెరువులు, బావులు, రక్షణ పనులు, వరద నియంత్రణ, నీటి వనరుల పునరుద్ధరణ, కరువు నివారణ చర్యలు, అడవుల (Forests) పెంపకం మరియు సంఘాలలో ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు సమకూరుస్తుంది. మీరు కరువు పనికి వెళ్తున్నారా? అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Modi's help to Israel, lakhs of Indian construction workers migrated to Israel
image credit : cablecommunity.com

తెలంగాణ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు స్వల్ప గాయాలు లేదా ఇతర ప్రమాదాలు ఏమైనా జరిగితే ప్రాథమిక వైద్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. కరువు కాటకాలతో ఉండి కరువు పనిలో చేరిన వారిలో అనుకోని ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటున్నాయి. ఓ అధికారి ప్రకారం, ఉపాధి హామీ విధానంలో పనిలో ఏదైనా ఆటకం జరిగితే, చట్టం ద్వారా రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ద్వారా అందుతుంది.

కరువు కాలంలో కూలి పనులకు వెళ్లిన వ్యక్తులు అనుకోని ప్రమాదంలో గాయపడినా, చూపు కోల్పోయినా వారి కుటుంబ సభ్యులకు కేంద్ర ఉపాధి హామీ పథకం కింద 50 వేల రూపాయల ఎక్స్‌గ్రేషియా (exgratia) అందజేస్తారు. కరువు పనికి వెళ్లే వారు ఎండా కాలంలో ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటారు.

దీన్ని దృష్టిలో ఉంచుకుని కరువు పని సమయంలో పని చేసే వారికి నీడ, నీరు తదితర సౌకర్యాలను గ్రామపంచాయతీ (Gramapanchayathi) కల్పిస్తుంది. జాబ్‌కార్డు నమోదు చేసే సమయంలో దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత తిరిగి పనిలో చేరాలని ఆయన పేర్కొన్నారు.

Mahatma Gandhi Employment

Comments are closed.