Mahila Samman Saving Certificate Scheme: మహిళలకు సూపర్ స్కీం, పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ
మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది ఒక చిన్న పొదుపు కార్యక్రమం. దీని ద్వారా మహిళలు రూ. 2 లక్షలు అందుకుంటారు. పూర్తి వివరాలు ఇవే!
Mahila Samman Saving Certificate Scheme: ప్రజా సంక్షేమంతోపాటు మహిళా సాధికారతను పెంపొందించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. మహిళా సాధికారత మరియు వారి ఆర్థిక సహాయాన్ని పెంచే ప్రయత్నాలలో భాగంగా, కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పొదుపు కార్యక్రమాలను అమలు చేస్తోంది.
మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది ఒక చిన్న పొదుపు కార్యక్రమం. దీని ద్వారా మహిళలు రూ. 2 లక్షలు అందుకుంటారు. ఈ పథకం డిపాజిట్ చేసిన మొత్తంపై 7.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. పథకం మెచ్యూరిటీ (Scheme Maturity) వ్యవధి రెండేళ్లు ఉంటుంది.
దేశంలోని ఏ స్త్రీ అయినా ప్రభుత్వ రంగ బ్యాంకులు (Banks) , ప్రైవేట్ భాగస్వామ్య బ్యాంకులు లేదా పోస్టాఫీసుల (Post Office) లో MSSC ఖాతాను తెరవవచ్చు. అన్ని వయసుల వారు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. మైనర్ బాలిక (Minor Girl) విషయంలో, ప్రయోజనాలను పొందడానికి ఆమె చట్టపరమైన సంరక్షకుని పేరు మీద ఖాతాను తెరవవచ్చు.
అయితే, ఇది నెలవారీ ప్లాన్ కాదు. దీనికి వన్-టైమ్ డిపాజిట్ (one time Deposit) అవసరం. మీరు కనీసం రూ.1000 డిపాజిట్ చేయవచ్చు. అయితే, డిపాజిట్ మొత్తంతో సంబంధం లేకుండా, అది ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది.
గరిష్టంగా రూ. 2 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. అంతకు మించి పెట్టుబడి పెట్టడం కుదరదు. మీరు ఎప్పుడు డిపాజిట్ చేసినా రెండేళ్ల తర్వాత డబ్బు, వడ్డీ అందుతాయి. మహిళా సమ్మాన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 7.5% వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది.
ఈ ప్రోగ్రామ్‌లో పెట్టుబడి పెట్టబడిన డబ్బు కూడా సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంటుంది. వడ్డీ ప్రతి మూడు నెలలకు లెక్కించబడుతుంది మరియు మీ ఖాతాలకు జమ చేస్తారు. ఈ ఖాతా రెండేళ్ల తర్వాత మెచ్యూర్ అవుతుంది. అప్పుడు ఫారమ్ 2 నింపండి. అవసరమైతే మీ డబ్బు తీసుకోవచ్చు. మీరు ఒక సంవత్సరం తర్వాత మీ నగదులో 40% వరకు విత్‌డ్రా (With Draw) చేసుకోవచ్చు. దీని కోసం ఫారం 3ని ఉపయోగించాలి.
రెండేళ్లలోపు పూర్తి మొత్తాన్ని వెనక్కి తీసుకోలేరు. పేర్కొన్న షరతులలో మాత్రమే మీ డబ్బు తీసుకోడానికి అనుమతి ఉంటుంది. ఖాతాదారుడు మరణిస్తే లేదా ప్రాణాంతకమైన అనారోగ్యంతో బాధపడుతుంటే, ముందుగా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.
రెండు సంవత్సరాల పాటు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ కార్యక్రమంలో 2 లక్షలు పెట్టుబడి పెడితే, మీరు మెచ్యూరిటీ సమయంలో రూ.2.32 లక్షలు అందుకుంటారు. ఇది FD మాదిరిగానే పనిచేస్తుంది. మీరు మీ స్థానిక పోస్టాఫీసుకు వెళ్లి ఖాతాను తెరవడానికి ఫారమ్ (Forum) ను పూరించాలి. ఇది మాత్రమే కాకుండా, మీరు ఆధార్ (Aadhar) మరియు పాన్ కార్డ్ (Pan Card) వంటి KYC పత్రాలను తప్పనిసరిగా ఇవ్వాలి. చెక్‌తో పాటు, మీరు పే-ఇన్ స్లిప్‌ను అందించాలి. దేశంలోని అనేక బ్యాంకుల్లో మహిళా సమ్మాన్ సర్టిఫికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
Comments are closed.