Mahindra Treo Plus 2024: భారత దేశంలో ప్రముఖ ప్రీమియం ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కంపెనీ మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ (MLMML) భారత మార్కెట్ లోకి ఎట్టకేలకు ట్రియో ప్లస్ ఈ-ఆటో (Mahindra Treo Plus Electric Auto) ను విడుదల చేసింది. మహీంద్రా కంపెనీ నుంచి వచ్చిన ఈ ఆటో ధర రూ. 3.58 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఇంతకు ముందు వచ్చిన మోడల్ కంటే కూడా అప్ డేట్ పొంది మార్కెట్ లోకి రావడం దీనిలోని విశేషంగా భావించవచ్చు.
మహీంద్రా కంపెనీ వినియోగదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా తయారుచేసి, ఈ ఎలక్ట్రిక్ ఆటోని మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఆటో ఇప్పటికే అత్యధిక ప్రజాదరణ పొందింది, అలాగే ఇప్పుడు మెటల్ తో బాడీ రూపకల్పనను కలిగి ఉంది. మహీంద్రా కంపెనీ కస్టమర్ ల అవసరాలను గుర్తెరిగి, వాహన వినియోగదారుల ఆలోచనలకు అనుగుణంగా ఈ ఆటోను లాంచ్ చేసింది. ఈ ఆటోను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ లకు మరింత దగ్గరగా దీనిని తీసుకు రావడానికి లోన్ మరియు మంచి ఫైనాన్సింగ్ ఆప్షన్ లను కంపెనీ అందిస్తోంది.
వాస్తవంగా 2018లో మహేంద్ర కంపెనీ ట్రియోస్ ఎలక్ట్రిక్ ఆటోను విడుదల చేసినప్పటి నుంచి సుమారు 50000 యూనిట్ల ఆటోలు అమ్ముడయ్యాయి. ట్రియోస్ వాహనాలు ఏకంగా 1.10 బిలియన్ కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి వాతావరణంలో 18500 మెట్రిక్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ (CO2) ఉద్గారాలను తగ్గించడానికి కారణమయ్యాయి. ఎలక్ట్రిక్ ఆటో సెగ్మెంట్ లో భారతదేశంలో 52 శాతం మార్కెట్ వాటాతో మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ ఆటో మొదటి స్థానంలో నిలిచింది.
మహీంద్రా కంపెనీ తన కస్టమర్ లకు మంచి డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం మాత్రమే కాకుండా, ఉత్తమమైన ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ ను కూడా అందిస్తోంది. ఇందులో భాగంగానే దేశంలో అతిపెద్ద సర్వీస్ నెట్‌వర్క్‌ను అందించడానికి తయారవుతుంది. మెటల్ బాడీ తో వచ్చిన ట్రియో ప్లస్ 5 సంవత్సరాలు లేదా 120000 కిమీ వారంటీని పొందుతుంది. ఇది వాహనాన్ని ఉపయోగించే కస్టమర్ లకు చాలా అనువైనదిగా ఉంటుంది.
కొత్త మహీంద్రా ట్రియో ప్లస్ ఎలక్ట్రిక్ ఆటో 10.24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఈ ఆటో 42 టార్క్‌తో పాటు 8kW శక్తిని అందిస్తుంది. ఇది ఫుల్ చార్జితో 167 కిమీ రేంజ్ వరకు ఇస్తుందని ఆటోమోటివ్ రీసర్చ్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) చేత ధృవీకరించబడింది. కానీ ఇప్పుడున్న ప్రపంచంలో, వివిధ రకాల వాతావరణ పరిస్థితుల్లో ఈ ఎలక్ట్రిక్ ఆటో రేంజ్ 150 కిమీ కంటే ఎక్కువ అని అంటున్నారు.
మహీంద్రా ట్రియో ప్లస్ ఎలక్ట్రిక్ ఆటో లో వీల్ బేస్ వచ్చేసి 1073 మిమీ ఉంటుంది. దీనిలో హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్స్ ని కలిగి ఉంది. ఇటువంటి ఫీచర్స్ కలిగి ఉండటం వలన వాహనాన్ని ఉపయోగించే వారికి మంచి డ్రైవింగ్ అనుభూతిని ఇస్తాయి. మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ (MLMML) యొక్క UDAY ప్రోగ్రామ్ కింద ఈ ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేసే వినియోగదారులు మొదటి సంవత్సరానికి రూ.10 లక్షల ప్రమాద భీమా కవరేజ్ పొందుతారు.
Mahindra Treo Plus 2024