పళ్ళ రంగు ను బట్టి వారి ఆరోగ్యాన్ని చెప్పవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంతమంది పళ్ళు పసుపు పచ్చ (yellow green) రంగు లో ఉంటాయి. మరి కొంతమందికి నల్లగా, గోధుమ రంగులో కూడా ఉంటాయి.
పళ్ళు తెల్లగా కాకుండా వేరే రంగులో ఉండడం వలన నలుగురిలోకి రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. వీళ్లు సరిగ్గా మాట్లాడలేరు అలాగే నవ్వ లేరు కూడా. పళ్ళ రంగు మారడానికి వివిధ కారణాలు ఉంటాయి.
సరిగ్గా బ్రష్ చేయకపోవడం, కాఫీలు మరియు టీ లు అధికంగా త్రాగటం, వయసు పెరగడం. వీటి వల్ల దంతాల రంగు మారుతుంది. వీటిని అశ్రద్ధ (carelessness) చేస్తే కొన్ని రోజులకు పళ్ళ నుండి రక్తస్రావం, దుర్వాసన, పళ్ళు బలహీనంగా మారడం వంటివి జరుగుతుంటాయి.
Also Read : Motion Sickness : ప్రయాణంలో వాంతులు, వికారం ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేయండి హాయిగా ప్రయాణించండి
కనుక ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే పళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. పళ్ళు ఆరోగ్యంగా (Healthy), దృఢంగా మరియు తెల్లగా ఉండాలంటే కొన్ని రకాల మొక్కల యొక్క ఆకులను నమలడం వలన రంగు మారిన దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు.
దంతాలను తెల్లగా మార్చే ఆకులు ఏమిటో తెలుసుకుందాం.
వేపాకులు :
పసుపు రంగులోకి మారిన దంతాలను మళ్ళీ తెల్లగా మార్చే శక్తి వేపాకుల కు ఉంది. వేపాకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి పళ్ళ పైన ఉన్న బ్యాక్టీరియాని నాశనం చేసి, పళ్ళను తెల్లగా మార్చడంలో సహాయపడతాయి. వేపాకులను పేస్టులా తయారు చేసుకుని టూత్ పేస్ట్ లా వాడినట్లయితే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే నోటి దుర్వాసన (Bad breath) ను పోగొట్టి పళ్ళు ఆరోగ్యంగా మరియు దృఢంగా ఉండేలా చేస్తాయి.
తులసి ఆకులు :
తులసి ఆకులలో కూడా గొప్ప ఔషధ గుణాలు (Medicinal properties) ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవాలి. తులసి ఆకులు నమిలినపుడు వచ్చిన రసంతో పుక్కిలించడం వల్ల దంతాలపై పేరుకొని ఉన్న ఫలకం మరియు బ్యాక్టీరియాను తొలగించి పళ్ళను తెల్లగా అయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా నోటి దుర్వాసన రాకుండా చేస్తుంది. పళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
Also Read : Dates Benefits : పోషకాల గని ఖర్జూర పండు. రోజూ రాత్రి రెండు ఖర్జూర మిమ్మల్ని ఎప్పటికీ ధృఢంగా ఉంచుతుంది.
తమలపాకులు :
తమలపాకు మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తమలపాకు (betel leaf) మొక్కను కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. తమలపాకు లో యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉన్నాయి. తమలపాకును నమిలినపుడు వచ్చిన రసాన్ని మౌత్ వాష్ లా ఉపయోగించడం వల్ల తెల్లగా మారుతాయి. అంతేకాకుండా ఈ ఆకులను నమలడం వలన నోటిలో ఉన్న బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది.
కాబట్టి పళ్ళు ఆరోగ్యంగా ఉన్నవారు మరియు దంతాల (teeth) రంగు మారిన వారు, నోటి దుర్వాసన తో ఇబ్బంది పడేవారు ఈ మూడింటిలో ఏదో ఒక దానిని ప్రయత్నించవచ్చు. తద్వారా దృఢమైన మరియు ఆరోగ్యకరమైన తెల్లని దంతాలను పొందవచ్చు.