Masala Dosa And cup coffee Cost : సాంకేతికత పెరుగుతున్న నేపథ్యంలో నేటి కాలంలో మార్పులు చోటు చేసుకుంటున్నారు. పాతకాలం తో పోలిస్తే ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఏదైనా కొనాలంటే వేలల్లోనే ఖర్చు అవుతుంది. మన తాతయ్యలు, అమ్మమ్మలు అప్పట్లో ధరలు ఇలా ఉండేవి కాదు అని చెప్పిన సందర్భాలను మనం చూసే ఉంటాం.
ఏ విషయం అయిన సోషల్ మీడియా లో పలు వీడియోలు, ఫోటోలు వెంటనే వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు ధరలను గుర్తు చేస్తూ ఇప్పుడు నెట్టింట ఒకటి వైరల్ గా మారింది. మరి, అప్పట్లో మసాలా దోస ధర ఎంత ఉందొ మీకు తెలుసా? ఆ ధర తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు.
1971 లో మసాలా దోస ధర ఎంతంటే?
70 ఏళ్లు పైబడిన వారిని అడిగితే చిన్నప్పుడు రూపాయికి చాలా పదార్దాలు వచ్చేవని చెబుతారు. జూన్ 28, 1971న మోతీ మహల్ రెస్టారెంట్ లో రెండు మసాల దోసెలు మరియు రెండు కప్పుల కాఫీ 10 పైసల సర్వీస్ ఛార్జీతో ఆ రసీదుపై రూ. 2.10 పైసలు బిల్లు ఉంది.అది ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆ ధరను చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.
Moti Mahal restaurant, Delhi's bill receipt of 28.06.1971. 2 Masala Dosa & 2 Coffey, 16 paise tax and Bill is Rs 2.16 only…..! pic.twitter.com/YllnMWQmTD
— indian history with Vishnu Sharma (@indianhistory00) February 1, 2017
అదే ఈరోజుల్లో బయట బ్రేక్ ఫస్ట్ చేయడం కూడా ఖర్చుతో కూడుకున్న పని అని ప్రజలు భావిస్తున్నారు. మనం ఏదైనా మంచి రెస్టారెంట్‌లో మసాలా దోస మరియు కాఫీని ఆర్డర్ చేస్తే, రూ.100 పైగానే చెల్లించాల్సి వస్తుంది. అదే పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్తే ధర వేలల్లోనే ఉంటుంది.
ఇప్పుడున్న ఖర్చులు, ధరలు చూస్తున్న ప్రజలు, 1971 భోజన బిల్లు చూస్తే ఆశ్ఛర్య పడడంలో ఎటువంటి సందేశం లేదు. అందుకే , సోషల్ మీడియాలో 1971 నాటి బిల్లు వైరల్‌గా మారింది, నెటిజన్లను ఎంతగానో ఆశ్చర్యపరిచింది.
ఈరోజుల్లో అంత తక్కువ ఖర్చుతో టిఫిన్ చేయడం ఒక కల అనే చెప్పవచ్చు. ‘ఇండియన్ హిస్టరీ విత్ విష్ణు శర్మ’ అనే ఎక్స్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. ఇలాంటి వార్తలు చూస్తూ ఉంటె అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు చోటుచేసుకున్నాయి అని అనిపిస్తుంది.