Telugu Mirror : థ్రెడ్స్ ఇప్పుడు రికార్డ్ లు సృష్టిస్తున్న సోషల్ మీడియా యాప్. మార్క్ జుకర్ బర్గ్ విడుదల చేసిన థ్రెడ్స్ ఇప్పటికే 10 మిలియన్ ల డౌన్ లోడ్ లను సాధించింది. థ్రెడ్స్ ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సోషల్ మీడియా యాప్ గా మారింది. థ్రెడ్స్ తక్కువ సమయంలోనే ఎక్కువ వినియోగదారులను సంపాదించుకుంది. థ్రెడ్స్ యొక్క గాడ్ ఫాదర్ కంపెనీ ఫేస్ బుక్ కు 1 మిలియన్ యూజర్ లను సంపాదించుకోవడానికి 10 నెలలు పట్టింది, చాట్GPT కు 5 రోజులు పట్టింది, ఇన్ స్టాగ్రామ్ కు 2.5 నెలలు పట్టింది, స్పాటిఫైకు 5 నెలలు, నెట్ ఫ్లిక్స్ కు 3.5 సంవత్సరాలు, ట్విట్టర్ కు మాత్రం 10 సంవత్సరాలు పట్టింది.
Telugu Panchangam : తెలుగు మిర్రర్ న్యూస్ ఈ రోజు ఆదివారం, జూలై 9, 2023 తిథి ,పంచాంగం
కానీ థ్రెడ్స్ మాత్రం 2 గంటల్లో 1 మిలియన్ యూజర్ లను సంపాదించుకుంది, 7 గంటల్లో 10 మిలియన్ల వినియోగదారులను సాధించింది.
థ్రెడ్స్ గురించి చెప్పాలంటే ఇది కొంచెం ట్విట్టర్ ను కాపీ చేసిందనే చెప్పాలి. ట్విట్టర్ లో వచ్చిన కొత్త నియమాల వల్ల ఎంతో మంది వినియోగదారులకు నచ్చలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మెటా థ్రెడ్స్ యాప్ ను విడుదల చేసింది. వాళ్ళు అనుకున్న దాని కంటే థ్రెడ్స్ ఎంతో ఫేమ్ ను సంపాదించుకుంది. కానీ అదే రీతిలో విమర్శలను కూడా ఎదుర్కొంటుంది. ఇప్పటికే “ట్విట్టర్ కిల్లర్ ” అనే క్యాప్షన్ తో ఎంతో మంది థ్రెడ్స్ ను వ్యతిరేకిస్తున్నారు. ఈ విమర్శలలో కొంత మంది ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు.
ఇది ఎలా పని చేస్తుందంటే…
థ్రెడ్స్ యాప్ ఇన్ స్టా గ్రామ్ కు అనుసంధానమైన యాప్. ఈ యాప్ ను వాడాలంటే మనకు ఇన్ స్టాగ్రామ్ ఖాతా ఉండాలి. మన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ తో థ్రెడ్స్ యాప్ లో లాగిన్ అవ్వాలి. థ్రెడ్స్ నుంచి మనం ఏదైనా 500 అక్షరాలు కలిగిన టెక్స్ట్ పోస్ట్, ఫోటోలను, 5 నిమిషాల నిడివి కలిగిన వీడియోలను పోస్ట్ చెయ్యవచ్చు. ఈ పోస్ట్ లను థ్రెడ్స్ అనే పేరుతో పిలవాలి. థ్రెడ్స్ యాప్ నుంచే ఇన్ స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ లు చెయ్యవచ్చు. అలానే ఇన్ స్టాగ్రామ్ నుంచి కూడా థ్రెడ్స్ యాప్ లో పోస్ట్ చెయ్యవచ్చు. యూజర్స్ ను ఫాలో మరియు అన్ ఫాలో చేయడం వంటి పనులను కూడా చెయ్యవచ్చు.
మనం ఫాలో అవుతున్న మరియు మనకు ఆశక్తి కలిగిన పోస్ట్ లు మాత్రమే మనకు కనిపిస్తాయి. మనకు ఇష్టం లేని అంశాలను సెలెక్ట్ చేసుకుంటే ఆ విషయాలకు సంబందించిన పోస్ట్ లు మనకు కనిపించవు. యూజర్ లను బ్లాక్ మరియు రిపోర్ట్ కూడా చెయ్యవచ్చు. ఇలా ఏమైనా చేస్తే ఇన్ స్టాగ్రామ్ లో కూడా సేవ్ అవుతాయి ఉదాహరణకు మనం ఎవరినైనా థ్రెడ్స్ లో అన్ ఫాలో చేస్తే మన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఆటోమెటిక్ గా వాళ్ళు అన్ ఫాలో అయిపోతారు. ఇలానే మనల్ని ఎవరు టాగ్ చెయ్యాలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా థ్రెడ్స్, వినియోగదారులకు స్వేచ్ఛ అనుభూతిని కల్పిస్తుంది.
Delhi Metro–ఢిల్లీ మెట్రో లో మళ్ళీ లొల్లి…
ఈ యాప్ రిలీజ్ అయిన తర్వాత ముందుగా 1 మిలియన్ ఫాలోవర్ లను సంపాదించిన వ్యక్తి ఫేమస్ యూట్యూబర్ అయిన “జిమ్మీ డోనాల్డ్ సన్”. ఈ పేరు మీరు ఎక్కడ వినివుండక పోవచ్చు. కానీ ఇతనే “MrBeast”. MrBeast థ్రెడ్స్ యాప్ లో మొదటగా 1 మిలియన్ ఫాలోవర్ లను సంపాదించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను సంపాదించుకున్నాడు. అతను 999k నుంచి 1 మిలియన్ ఫాలోవర్ లకు చేరుకున్న ఆ క్షణాన్ని ఒక వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్ లో వీడియోను పోస్ట్ చేశాడు.ట్విట్టర్ పోలీస్ లకు దొరక్కుండా నన్ను కాపాడండి అని MrBeast ఫన్నీగా థ్రెడ్స్ లో పోస్ట్ చేశారు. థ్రెడ్స్ ఇంకా ఎన్ని రికార్డ్ లను సంపాదిస్తుందో చూడాలి.